Cancer Symptoms: మానవ శరీరంలో అనేక కణాలు కలిసి ఉంటాయి. ఇందులో పాత కణాలు పోయి కొత్త కణాలు పుట్టుకొస్తాయి. అయితే ఒక్కోసారి పాత కణాలు, కొత్త గణాల మధ్య సమతుల్యం లేక అసమతుల్యంలో ఉంటాయి. దీంతో గంటలుగా మారి క్యాన్సర్ కు దారితీస్తుంది. కొందరి శరీరంలో అసాధారణంగా కణాలు పెరిగి ఇబ్బందులకు గురిచేస్తాయి. వీటిని కూడా క్యాన్సర్ గా పేర్కొంటారు. క్యాన్సర్ అనేక రకాలుగా ఉంటుంది. వీటిలో బ్రెస్ట్ క్యాన్సర్, లంగ్స్ క్యాన్సర్, సర్వికల్ క్యాన్సర్, లివర్ క్యాన్సర్, బ్లడ్ క్యాన్సర్, ప్రోస్టేట్ క్యాన్సర్ వంటివి ఉన్నాయి. అయితే తాజాగా అమెరికన్ క్యాన్సర్ సొసైటీ తెలిపిన ప్రకారం క్యాన్సర్ లక్షణాలు ఇలా ఉంటాయని పేర్కొంది..
సాధారణంగా కొన్ని చెడు అలవాట్ల వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. ధూమపానం చేయడం, ప్రాసెస్ చేసిన ఆహారం తినడం, వంశపారపర్యం, అధిక పొగ వచ్చే ప్రాంతాల్లో పనిచేయడం వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కొన్ని వైరస్ ల కారణంగా కూడా క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే క్యాన్సర్ వచ్చే ముందు కొన్ని లక్షణాలు ఇలా ఉంటాయని అమెరికన్ క్యాన్సర్ సొసైటీ తెలిపింది. తీవ్రమైన జ్వరం ఉండడం.. ఒకేసారి బరువు తగ్గిపోవడం, ఆకలి తగ్గిపోవడం, మూత్రానికి వెళ్లినప్పుడు నొప్పిగా ఉండడం, మూత్రంలో తెల్ల రక్తం పడడం, శరీరం రంగు నల్లగా మారడం, చర్మం ఎర్రగావడం, పుట్టుమచ్చలు పెరిగి అందులో నుంచి రక్తం కారడం, గాయాలు ఎక్కువకాలం మానకుండా ఉండడం, రొమ్ములు, వృషణాలు గట్టిగా మారడం వంటి లక్షణాలు ఉంటాయని అమెరికన్ క్యాన్సర్ సొసైటీ తెలిపింది.
అయితే ఇలాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వెళ్లి చెక్ చేసుకోవడం చాలా బెటర్. ఎందుకంటే క్యాన్సర్ నాలుగు స్టేజిల వరకు ఉంటుంది. మొదటి స్టేజీలోనే గుర్తిస్తే 80 శాతం వరకు నయం అయ్యే అవకాశం ఉంటుంది. నాలుగవ స్టేజీలో ఉంటే చికిత్స చేసిన నయం అయ్యే అవకాశాలు తక్కువగా ఉంటాయి. అందువల్ల శరీరం ఎప్పటిలాగా కాకుండా ప్రత్యేక లక్షణాలు ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలి. ప్రస్తుత కాలంలో బయట లభించే ఆహారం తినడం వల్ల, ధూమపానం చేయడం వల్ల చాలామందికి క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే ముందుగా ఇవి బయటపడకుండా ఉంటాయి. అందువల్ల ముందు జాగ్రత్తగా ధూమపానం మానివేయడం.. ఇంట్లో ఆహారాన్ని మాత్రమే తీసుకోవడం.. ఒకేసారి బరువు తగ్గితే ప్రోటీన్లు కలిగిన ఆహారం తినడం వంటివి చేయాలి.
ఇటీవల కొందరు నిపుణులు తెలుపుతున్న ప్రకారం ఒత్తిడి ఎక్కువగా మారిన వారు ఇతర వ్యసనాలకు పాల్పడుతున్నారు. మీరు సైతం ఒత్తిడికి గురికాకుండా ప్రశాంతమైన వాతావరణంలో ఉండే ప్రయత్నం చేయాలి.