Homeహెల్త్‌Cooler Tips: మీరు కూలర్‌ ఇలా వాడుతున్నారా... చర్మవ్యాధులు ఖాయం!

Cooler Tips: మీరు కూలర్‌ ఇలా వాడుతున్నారా… చర్మవ్యాధులు ఖాయం!

Cooler Tips: వేసవి కాలం వస్తోంది. మార్చి రెండో వారంలోనే భానుడు భగ్గుమంటున్నాడు. ఉదయం 8 గంటల నుంచి నిప్పులు కురిపిస్తున్నాడు. ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల వరకు నమోదవుతున్నాయి. వేడి, ఉక్కపోతతో ప్రజలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. దీంతో వేడి, ఉక్కపోత నుంచి ఉపశమనం పొందేందుకు ఫాన్లు 5 నంబర్‌పై పెడుతున్నారు. అయినా గాలి సరిపోకపోవడంతో చాలా మంది అటకపై ఉన్న కూలర్ల దుమ్ము దులుపుతున్నారు. చల్లగాలి కోసం పాత కూలర్లకు మరమ్మతు చేసి బిగించుకుంటున్నారు. ఇక పాత కూలర్లు పనిచేయని వారు కొత్తవాటిని కొనుగోలు చేస్తున్నారు. ఈసారి ఎండలు బాగా ఉండడంతో కూలర్ల విక్రయదారులు సైతం ధరలుపెంచేశారు.

కూలర్‌ ఇలా వాడితే చర్మ వ్యాధులు..
ఇక కూలర్ల వినియోగంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. సరిగా వినియోగించకుంటే కూలర్లతో ప్రమాదం తప్పదని హెచ్చరిస్తున్నారు. ఇక కూలర్ల ధరలు చూస్తే గతేడాది కన్నా రూ.300 నుంచి రూ.500 వరకు పెరిగాయి. ఏ కూలర్‌ కొనుగోలు చేసినా దాని వినియోగం చాలా ముఖ్యమని నిపుణులు అంటున్నారు. ప్రతీ కూలర్‌ గడ్డిని ఏడాదికి ఒకసారి మార్చాలని పేర్కొంటున్నారు. గడ్డి మార్చకుంటే చర్మ వ్యాధులు వస్తాయని హెచ్చరిస్తున్నారు.

షాక్‌ కొట్టే ఛాన్స్‌..
ఇక కూలర్లలో చాలా మంది ఐరన్‌ కూలర్లు వాడుతున్నారు. లోకల్‌గా తయారు చేసే ఈ కూలర్లు ఎక్కువగా చల్లదనం ఇస్తాయని భావిస్తారు. అదే సమయంలో ధర కూడాతక్కువగా ఉండడంతో వాటినే కొనుగోలు చేస్తున్నారు. అయితే పాత కూలర్‌ను మళ్లీ బిగించే ముందు వాటిని సరి చూసుకోవాలని సూచిస్తున్నారు. కూలర్లు తిరుగుతున్నప్పుడు ముట్టుకోవాలని పేర్కొంటున్నారు. నీళ్లు పోసే సమయంలో కూడా పవర్‌ సరఫరా పూర్తిగా నిలిపివేయాలంటున్నారు.

విద్యుత్‌ తీగలతో జాగ్రత్త..
ఇక కూలర్లకు ఉండే విద్యుత్‌ తీగల విషయంలోనూ జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. కూలర్లు వేసవిలో ఎక్కువ గంటలు తిరుగతూనే ఉండడం వలన నాసిరకం తీగలు వేడెక్కి కాలిపోయే ప్రమాదం ఉంటుందని పేర్కొంటున్నారు. నాణ్యమైన తీగలు వాడలంటున్నారు. తీగలు కాలిపోయినప్పుడు తెలియకుండా ముట్టుకుంటే షాక్‌ కొట్టే ప్రమాదం ఉటుందని హెచ్చరిస్తున్నారు. ఏమాత్రం ఏమరుపాటుగా ఉన్నా తీవ్ర నష్టం జరుగుతుందని అంటున్నారు.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
RELATED ARTICLES

Most Popular