Hair Tips: అమ్మాయిలకు అందం జుట్టు. కురులు ఎంత అందంగా ఉంటే మహిళలు అంత కంటే ఎక్కువ అందంగా కనిపిస్తారు. అయితే ఈరోజుల్లో చాలా మంది జుట్టు రాలిపోతుంది. వీటికి ముఖ్య కారణం మనం తినే ఫుడ్, రసాయనాలు ఉండే ప్రొడక్ట్స్, షాంపూ, ఆయిల్స్ వంటివి కారణం అవుతున్నాయి. అయితే ఈ జుట్టే రాలే సమస్య నుంచి బయట పడాలని ఎన్నో చిట్కాలు కూడా పాటిస్తున్నారు. అయిన కూడా జుట్టు రాలిపోయే సమస్య మాత్రం తగ్గడం లేదు. జుట్టు రాలిపోతుందని ఎక్కువగా అలోచించి అమ్మాయిలు ఇంకా జుట్టు రాలే సమస్యను పెంచుకుంటున్నారు. అయితే వంటింట్లో దొరికే కొన్ని రకాల వాటితో జుట్టు రాలే సమస్యను మనం తగ్గించుకోవచ్చు. దానికోసం కొన్ని సహజ చిట్కాలు పాటించాలి. అప్పుడే జుట్టు రాలే సమస్యను తగ్గించుకోవచ్చు. మరి ఆ సహజ చిట్కాలేంటో తెలుసుకుందాం.
ఆరోగ్యానికి అల్లం చాలా మేలు చేస్తుంది. దీనిని తినడం వల్ల జలుబు, దగ్గు తగ్గడంతో పాటు ఎలాంటి అనారోగ్య సమస్యలు కూడా దరి చేరవు. అయితే అల్లం వల్ల కేవలం ఆరోగ్యం మెరుగుపడటంతో పాటు జుట్టు కూడా బలంగా తయారవుతుంది. అల్లంలో ఎక్కువగా విటమిన్స్, మినరల్స్, ఫ్యాటీ యాసిడ్స్ ఉన్నాయి. ఇవి కురులను బలంగా మార్చడంలో సాయపడతాయి. దీనివల్ల జుట్టు రాలే సమస్య తగ్గడంతో పాటు.. కురులు చాలా దృఢంగా తయారవుతాయి. అల్లం రసాన్ని జుట్టు కుదుళ్లపై అప్లై చేయడం వల్ల బ్లడ్ సర్క్యూలేషన్ సరిగ్గా జరుగుతుంది. దీంతో జుట్టు తొందరగా పెరుగుతుంది. అలాగే జుట్టు రాలే సమస్య తగ్గి.. పొడవుగా పెరుగుతుంది.
అల్లం రసం ఇలా తయారు చేసుకోండి
తాజాగా ఉన్న అల్లాన్ని తొక్క తీసి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. తరువాత మెత్తగా మిక్సీ చేసి రసాన్ని వడగట్టుకోవాలి. దీనిని జుట్టు కుదుళ్లకి అప్లై చేస్తే బలంగా పెరుగుతుంది. వారానికి ఒకసారి అయిన ఇలా జుట్టుకి అప్లై చేయాలి. అయితే ఇందులో కొందరు కొబ్బరి నూనె, ఆముదం వంటివి వాడుతుంటారు. అయితే కేవలం అల్లం రసం మాత్రమే కాకుండా అల్లం నూనె కూడా అప్లై చేసిన జుట్టు బలంగా తయారవుతుంది. లేదంటే సీరమ్ లా కూడా చేసి వాడుకోవచ్చు.
అల్లం ఆయిల్ ఎలా తయారు చేయాలంటే?
అల్లాన్ని తొక్క తీసి శుభ్రం చేసుకోవాలి. మీరు తలకు రాసుకునే నూనెను తీసుకుని వేడి చేసుకోవాలి. ఇందులో శుభ్రం చేసుకున్న అల్లం ముక్కలు వేసుకుని ఒక 5 నిముషాలు మరిగించాలి. చల్లారిన తర్వాత గాజు సీసాలో వాడకట్టుకుని నిల్వ ఉంచుకోవాలి. దాదాపు రెండు నెలలు మీరు దీనిని నిల్వ ఉంచుకోవచ్చు. ఈ నూనె రాసి తలస్నానం చేస్తే జుట్టు బలంగా పెరుగుతుంది.
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించేముందు వైద్య నిపుణుల సలహాలు తీసుకోగలరు.
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.
Read More