మన దేశంలోని ప్రజలు తాంబూలం కోసం తమలపాకును వినియోగిస్తారు. చాలా మంది అధ్యాత్మికంగా మాత్రమే తమలపాకు ఉపయోగపడుతుందని అనుకుంటూ ఉంటారు. అయితే ఎన్నో ఔషధ గుణాలను కలిగి ఉన్న తమలపాకుల వల్ల మనకు అనేక అరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. ఎ, సి విటమిన్లతో పాటు ఎముకలకు అవసరమైన క్యాల్షియం తమలపాకుల ద్వారా లభిస్తుంది.
Also Read: రోజూ తేనె తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలివే..?
ఇమ్యూనిటీ పవర్ ను పెంచడంలో తమలపాకు ఎంతగానో సహాయపడుతుంది. ఆకుకూరలు తినడం వల్ల శరీరానికి ఏ విధంగా ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయో తమలపాకు కూడా అదే విధంగా తీసుకుంటే జీర్ణ సంబంధిత సమస్యలు దూరమవుతాయి. అయితే చాలామంది తమలపాకుతో వేరే వాటిని కలిపి తీసుకుంటే మాత్రం తమలపాకు వల్ల ఆరోగ్య ప్రయోజనాలు చేకూరకపోగా హాని జరుగుతుంది.
Also Read: మంగళవారం ఎవరికైనా డబ్బులు ఇస్తున్నారా… అయితే జాగ్రత్త!
జ్వరంతో బాధ పడేవాళ్లు తమలపాకుతో రసంలా చేసుకుని మిరియాల పొడితో కలిపి తీసుకుంటే జ్వరం తగ్గుతుంది. చుండ్రు సమస్యతో బాధ పడేవాళ్లు తమలపాకును ముద్దలా చేసుకుని తలకు పట్టిస్తే ఆ సమస్యకు చెక్ పెట్టవచ్చు. యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండే తమలపాకు చర్మంపై ముడతలు రాకుండా చేస్తుంది. ఉదర సంబంధిత సమస్యలతో బాధ పడే వాళ్లు తమలపాకు రసంలో తేనె కలుపుకుని తాగితే మంచిది.
మరిన్ని వార్తల కోసం: ఆరోగ్యం/జీవనం
నూనెను ఎక్కువ కాలం నిల్వ చేయాలని అనుకునే వారు నూనెలో తమలపాకులను వేస్తే ఎక్కువ కాలం నూనె నిల్వ ఉంటుంది. తమలపాకు తీసుకుంటే నోటి దుర్వాసన సమస్యకు కూడా చెక్ పెట్టవచ్చు.