Homeఎంటర్టైన్మెంట్Actress Pranitha 2025 updates: వళ్ళు విల్లులా వంచి పవన్ హీరోయిన్ యోగా భంగిమలు... ప్రణీత...

Actress Pranitha 2025 updates: వళ్ళు విల్లులా వంచి పవన్ హీరోయిన్ యోగా భంగిమలు… ప్రణీత సుభాష్ టాలెంటెడ్ చూశారా?

Actress Pranitha 2025 updates: కన్నడ భామ ప్రణీత సుభాష్(PRANITHA SUBHASH) తెలుగులో కూడా చాలా చిత్రాలు చేసింది. బ్లాక్ బస్టర్ పోకిరి కన్నడ రీమేక్ పోక్రి తో సిల్వర్ స్క్రీన్ కి పరిచయమైంది. దర్శన్ హీరోగా నటించిన పోక్రి అక్కడ కూడా మంచి విజయం అందుకుంది. అనంతరం తెలుగులో ఎంట్రీ ఇచ్చింది. ఏం పిల్లో ఏం పిల్లాడో, బావ చిత్రాల్లో హీరోయిన్ గా నటించింది. ఈ రెండు చిత్రాలు ఆశించిన స్థాయిలో ఆడలేదు. దాంతో తెలుగు పరిశ్రమను వీడింది. తమిళ్, కన్నడ భాషల్లో చిత్రాలు చేసింది. తిరిగి విజిల్ చిత్రంతో టాలీవుడ్ కి రీ ఎంట్రీ ఇచ్చింది. అది ఆడలేదు. అనూహ్యంగా పవన్ కళ్యాణ్ పక్కన ఛాన్స్ దక్కించుకుంది.

Also Read: Pawan Kalyan latest look : పంచెకట్టులో అదిరిపోయిన పవన్ కళ్యాణ్ లుక్స్..సోషల్ మీడియాని ఊపేస్తున్న లేటెస్ట్ ఫోటోలు!

విజయాలు లేకున్నా దర్శకుడు త్రివిక్రమ్ హీరోయిన్ ప్రణీత సుభాష్ టాలెంట్ గుర్తించారు. ఆమెకు అత్తారింటికి దారేది చిత్రంలో సెకండ్ హీరోయిన్ ఛాన్స్ ఇచ్చాడు. సాధారణంగా త్రివిక్రమ్ చిత్రాల్లో సెకండ్ హీరోయిన్ కి అంతగా ప్రాధాన్యత ఉండదు. కానీ అత్తారింటికి దారేది చిత్రంలో ప్రణీత సుభాష్-పవన్ కళ్యాణ్ కాంబోలో ఒక సాంగ్ కూడా సెట్ చేశాడు. అత్తారింటికి దారేది బ్లాక్ బస్టర్ అయ్యింది. అయినప్పటికీ ప్రణీత సుభాష్ కి బ్రేక్ రాలేదు. రభస లో ఎన్టీఆర్ తో, బ్రహ్మోత్సవం చిత్రంలో మహేష్ తో స్క్రీన్ షేర్ చేసుకున్నా ఫలితం లేకుండా పోయింది. ఆ రెండు చిత్రాలు డిజాస్టర్ అయ్యాయి.

తెలుగులో ప్రణీత చిత్రం చేసి చానళ్ళు అవుతుంది. ఎన్టీఆర్ కథానాయకుడు చిత్రంలో చివరిగా ఓ గెస్ట్ రోల్ చేసింది. అయితే ప్రణీత మానవతావాదిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. లాక్ డౌన్ సమయంలో పేదలకు అన్నదానం చేసి వార్తల్లో నిలిచింది. ప్రణీత దాతృత్వానికి జనాలు ఫిదా అయ్యారు. 32 ఏళ్ల ప్రణీత సుభాష్ 2021లో వివాహం చేసుకుంది. ఆమెకు ఇద్దరు పిల్లలు సంతానం. అయినప్పటికీ నాజూకైన శరీర సౌష్టవం కలిగి ఉంది. జూన్ 21న ఇంటర్నేషనల్ యోగా డే నేపథ్యంలో ప్రణీత సుభాష్ అద్భుతమైన యోగా భంగిమలతో కూడిన ఫోటోలు షేర్ చేసింది.

థర్టీ ప్లస్ లో కూడా శరీరాన్ని విల్లులా వంచుతూ ప్రణీత చేసిన యోగా భంగిమల ఫోటోలు చూసిన నెటిజెన్స్ ఔరా అంటున్నారు. ఆమె టాలెంట్ కి ఫిదా అవుతున్నారు. ప్రణీత తన ఇంస్టాగ్రామ్ లో సదరు ఫోటోలు పంచుకోగా వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం ప్రణీత నటనకు దూరమైనట్లు తెలుస్తుంది. ఆమెకు ఆఫర్స్ రావడం లేదు.

Exit mobile version