https://oktelugu.com/

మళ్లీ మనోళ్ల అమెరికా చూపులు!

చింత చచ్చినా పులుపు చావదంటే ఇదేమరీ.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ‘అమెరికన్స్ ఫస్ట్ ’ నినాదంతో విదేశీయులకు గేట్లు మూసేసి.. వీసాల్ కట్ చేసి.. అందరినీ పంపించే ప్రక్రియ మొదలు పెట్టడంతో ఇన్నాళ్లు అమెరికా కలలు కన్న భారతీయులకు తత్త్వం బోధపడి ఇండియాకు తిరిగి వచ్చారు. అయితే బ్యాడ్ లక్.. ట్రంప్ ఓడిపోయి జోబైడెన్ గెలిచాడు.మళ్లీ విదేశీయులకు తలుపులు బార్లా తెరుస్తున్నాడు. దీంతో ఇన్నాళ్లు అమెరికా ఆశలు చంపుకున్న భారతీయులు, భారతీయ విద్యార్థులకు కొత్త ఊపిరి […]

Written By:
  • NARESH
  • , Updated On : November 17, 2020 / 09:36 AM IST
    Follow us on

    చింత చచ్చినా పులుపు చావదంటే ఇదేమరీ.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ‘అమెరికన్స్ ఫస్ట్ ’ నినాదంతో విదేశీయులకు గేట్లు మూసేసి.. వీసాల్ కట్ చేసి.. అందరినీ పంపించే ప్రక్రియ మొదలు పెట్టడంతో ఇన్నాళ్లు అమెరికా కలలు కన్న భారతీయులకు తత్త్వం బోధపడి ఇండియాకు తిరిగి వచ్చారు. అయితే బ్యాడ్ లక్.. ట్రంప్ ఓడిపోయి జోబైడెన్ గెలిచాడు.మళ్లీ విదేశీయులకు తలుపులు బార్లా తెరుస్తున్నాడు. దీంతో ఇన్నాళ్లు అమెరికా ఆశలు చంపుకున్న భారతీయులు, భారతీయ విద్యార్థులకు కొత్త ఊపిరి వచ్చినట్టైంది. వారు మళ్లీ అమెరికాకు రెక్కలు కట్టుకొని వెళ్లడానికి రెడీ అవుతున్నారట..

    Also Read: జోబైడెన్‌.. భారత్‌ను కలుపుకొని పోవాల్సిందేనా?

    డొనాల్డ్ ట్రంప్ దెబ్బకు భారతీయులే కాదు.. అమెరికాలో ఉంటున్న విదేశీయుల బాక్సులు బద్దలయ్యాయి. గెట్ అవుట్ ఫ్రం అవర్ కంట్రీ అని ట్రంప్ వీసాలు టైట్ చేసి అందరినీ పంపించడానికి చట్టాలు తెచ్చారు. అయితే ఆయన పదవి ఎక్కువ కాలం నిలవలేదు. ఓడిపోవడంతో మనోళ్ల ఆశలకు మళ్లీ ఊపిరి వచ్చింది. దీంతో మళ్లీ అమెరికా వైపు మన విద్యార్థుల చూపుపడింది.

    ప్రపంచంలోనే అమెరికా విద్యావ్యవస్థ నంబర్ 1 స్థానంలో పటిష్టంగా ఉంటుంది. విద్యా ప్రమాణాలు, కచ్చితత్వం, ప్రయోగాలకు స్వేచ్ఛ వాతావరణం ఉండడంతో ప్రపంచంలోని నలుమూలల నుంచి విద్యార్థులు ఇక్కడికి చదుకునేందుకు వస్తుంటారు. అయితే ప్రపంచం నలుమూలల నుంచి అమెరికాకు వెళ్తున్న వారిలో భారతీయ విద్యార్థులే ఎక్కువగా ఉన్నారు. ప్రతీ ఏటా అమెరికాకు వెళ్తున్న 10 లక్షల మంది విద్యార్థుల్లో 20 శాతం మంది ఇండియా నుంచి వెళ్తున్నట్లు అమెరికాకు చెందిన సంస్థలు పేర్కొంటున్నాయి.

    Also Read: వర్క్ ఫ్రం హోం ఉద్యోగులకు షాకింగ్ న్యూస్.. ఆ సమస్యలు..?

    ‘ఉన్నత విద్య.. ప్రాక్టికల్ అప్లికేషన్స్.. అనుభవంతో కూడిన ఉన్నత ప్రమాణాలు లభించడం వల్లనే ఎక్కువ శాతం మంది భారతీయ విద్యార్థులు అమెరికాను ఎంచుకుంటున్నారు’ అని అమెరికా రాయభారి డెవిడ్ కెన్నడీ ఇటీవల వెల్లడించారు. భారత్ నుంచి అమెరికాకు వెళ్తున్న వారిలో గత పది సంవత్సరాల్లో రెట్టింపు అయిందని ఆయన పేర్కొన్నారు. అంతేకాకుండా ఇక్కడ చదువుకున్న విద్యార్థులను ఏ రంగంలోనైనా ముందు వరుసలో నిలబెట్టే బాధ్యతను ఆయా విద్యాసంస్థలు పటిష్టంగా తీసుకుంటాయన్నారు.

    ఇక అమెరికా విద్య ఎలా ఉంటుందో తమ సలహాల కేంద్రాల ద్వారా విద్యార్థులకు వివరిస్తున్నాయి. భారత్ లోని ఢిల్లీ, బెంగుళూరు, అహ్మదాబాద్, కోల్ కతా, చెన్నై, హైదరాబాద్ లాంటి నగరాల్లో అమెరికాలోని 4500 గుర్తింపు పొందిన విద్యాసంస్థల్లో విద్యావకాశాలు గురించి, విద్యావ్యవస్థపై ఎప్పటికప్పడు సమాచారం తెలుసుకోవచ్చని అమెరికా రాయబార కార్యాలయం తెలిపింది.

    మరిన్ని వార్తల కోసం అంతర్జాతీయ వార్తలు

    అమెరికా వెళ్లాలనుకునే విద్యార్థులు మరింత సమాచారం తెలుసుకునేందుకు ‘ఎడ్యుకేషన్ యూఎస్ఏ-ఇండియా’ యాప్ డౌన్ లోడ్ చేసుకోవాలని కెన్నడీ సూచించారు. ఈ యాప్ లో విద్యార్థులు ఏయే రంగంలోకి వెళ్లాలో వాటి చదువు విధానం ఏ విధంగా ఉంటుందో వివరిస్తూ పొందుపర్చామన్నారు. కాగా 2019-20 విద్యా సంవత్సరంలో దాదాపు 2 లక్షల మంది విద్యార్థులు ఉన్నత చదువుల కోసం అమెరికాను ఎంచుకున్నట్లు అమెరికాలోని ‘ఓపెన్ డోర్ నివేదిక‘ వెల్లడించింది. దానిని భారత్ లోని అమెరికా రాయభార కార్యాలయం విడుదల చేసింది.