Youth Movie OTT Release Date Netflix: కెన్ కరుణాస్ అనే యువ తమిళ నటుడు నటించిన లేటెస్ట్ చిత్రం ‘యూత్’ బాక్స్ ఆఫీస్ వద్ద ఎంతటి ప్రభంజనం సృష్టించిందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. తెలుగు లో కూడా ఈ చిత్రాన్ని అనువదించి విడుదల చేశారు. ఇక్కడ కూడా ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా దాదాపుగా 75 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టాయి, సంచలనం సృష్టించిన ఈ చిత్రం, ఇప్పుడు ఓటీటీ లోకి గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధంగా ఉంది. ఈ సినిమా ఓటీటీ రైట్స్ ని నెట్ ఫ్లిక్స్ సంస్థ మంచి ఫ్యాన్సీ రేటుకి కొనుగోలు చేసింది. వాళ్ళతో కుదిరించుకున్న ఒప్పందం ప్రకారం ఈ చిత్రాన్ని ఈ నెల 16 వ తేదీ నుండి స్ట్రీమింగ్ చేయబోతున్నారు. తెలుగు, తమిళం తో పాటు ఇతర ప్రాంతీయ భాషల్లో కూడా ఈ చిత్రం విడుదల కాబోతుంది. ఇంతకీ ఈ సినిమా స్టోరీ ఏంటో ఒకసారి చూద్దాం.
బ్యాకిరీ షాప్ ని నడుపుకుంటూ , ఒక సాధారణమైన మధ్యతరగతి కుటుంబానికి చెందిన ఉన్ని కృష్ణన్, సరోజ దంపతుల ఏకైక కుమారుడు ప్రవీణ్. అతనికి కేవలం 15 ఏళ్ళు మాత్రం. తల్లి సరోజ కి కొడుకు అంటే పిచ్చి ప్రేమ. అతను ఎలాంటి పనులు చేసినా పట్టించుకోదు , సమర్థిస్తూ ఉంటుంది. మరో పక్క తండ్రి క్లి మాత్రం ప్రవీణ్ చేసే పనులు ఒక్కటి కూడా నచ్చవు. ఇక స్కూల్ లో అయితే ప్రవీణ్ వేసే వేషాలకు ఒక్క అమ్మాయి కూడా అతని వైపు కన్నెత్తి చూడరు. కానీ ఇతను మాత్రం ఒక్క అమ్మాయిని అయినా స్కూల్ పూర్తి అయ్యేలోపు పడేయాలి అనే టార్గెట్ పెట్టుకుంటాడు. అలా అమ్మాయిలతో పరిచయం పెంచుకునే క్రమంలో ఇతనికి గంగవల్లి, ప్రేషిక, సోనాల్ వంటి వారు పరిచయం అవుతారు. వాళ్ళతో ప్రేమాయణం నడిపి బ్రేకప్ కూడా చేసుకుంటాడు.
ఇక ఆ తర్వాత పడవ తరగతి నుండి , ఇంటర్ లోకి అడుగుపెట్టేంత వరకు ప్రవీణ్ కి ఏర్పడిన అనుభవాలు, అవమానాలు , బ్రేకప్స్ వంటివి అతనికి ఎలాంటి పాఠాలు నేర్పించాయి. తల్లిదండ్రులు ఇతను గొప్ప స్థాయికి చేరుకోవాలని కోరుకుంటారు. మరి స్థానానికి ఇతను చేరుకుంటాడా లేదా? , అతని లవ్ స్టోరీస్ ఏమయ్యాయి వంటివి ఈ చిత్రం లో హైలైట్ అంశాలు. సినిమా చూస్తున్నంతసేపు ఒక ఎమోషనల్ రోలర్ కోస్టర్ లాగా ఉంటుంది. అంతే కాదు , మన పాత జ్ఞాపకాలు కూడా నెమరువేసుకునేలా ఉంటుంది ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలు. యూత్ ఆడియన్స్ నెట్ ఫ్లిక్స్ లోకి వచ్చిన తర్వాత వారానికి ఒకసారి చూస్తారేమో , ఆ రేంజ్ ఫీలింగ్ ని ఇస్తుంది ఈ చిత్రం.