Homeఎంటర్టైన్మెంట్Jr Ntr: ఆ సినిమా కోసం 10 లక్షల మంది అభిమానులు వచ్చారన్న తారక్ ......

Jr Ntr: ఆ సినిమా కోసం 10 లక్షల మంది అభిమానులు వచ్చారన్న తారక్ … ఏ మూవీ అంటే ?

Jr Ntr: యంగ్ టైగర్ ఎన్టీఆర్ తెలుగు చిత్ర పరిశ్రమలో తనదైన నటనతో అగ్ర హీరోల్లో ఒకడిగా కొనసాగుతున్నారు. నందమూరి ఫ్యామిలి పేరును కాపాడుతూ వారికి తగ్గ వారసుడిగా దూసుకుపోతున్నాడు ఈ యంగ్ హీరో. నటనలో అయిన, డాన్స్ లో అయిన, తనకు తానే పోటీ అనేంతలా మెప్పించగలరు ఎన్టీఆర్. కాగా జూనియర్‌ ఎన్టీఆర్‌కు ఉన్న ఫ్యాన్‌ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆయన సినిమా ఫంక్షన్లలకు అభిమానులు భారీగా హాజరవుతుంటారు. అయితే తారక్‌ తాజాగా నటించిన చిత్రం ” ఆర్‌ఆర్‌ఆర్ “. దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో రామ్ చరణ్ కూడా నటిస్తుండడం మరో ప్రత్యేకత అని చెప్పాలి.

young tiger ntr shares interesting details about his fans love

ఈ సినిమాతో పాన్‌ ఇండియా రేంజ్‌లో అభిమానులను పెంచుకునే పనిలో పడ్డాడు తారక్‌. ప్రస్తుతం అయితే దేశవ్యాప్తంగా ఒమిక్రాన్‌ కేసులు పెరుగుతుండటం, థియేటర్‌ ఆక్యుపెన్సీలో ఆంక్షల వంటి పలు కారణాల వల్ల జనవరి 7 వ తేదీన రిలీజ్ అవ్వాల్సిన ఈ సినిమా వాయిదా పడింది. అంతకుముందు మాత్రం ఈ మూవీ ప్రమోషన్స్‌ను భారీగా చేసింది చిత్రబృందం. ఈ క్రమంలోనే ప్రముఖ హిందీ కామెడీ టాక్‌ షో ‘ది కపిల్‌ శర్మ షో’లో తారక్‌, చరణ్‌, రాజమౌళి, అలియా భట్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్‌ మూవీ ఈవెంట్స్‌కు అభిమానులు ఎలా వస్తారో చెప్పాలని హోస్ట్‌ కపిల్ శర్మ అడిగాడు.

అందుకు ఎన్టీఆర్‌ తాను 2004లో నటించిన ఆంధ్రావాలా చిత్రం ఆడియో లాంచ్‌కు అభిమానులు ఎలా వచ్చారో తెలిపారు. అప్పుడు ప్రభుత్వం ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేసిన విధానం గురించి పేర్కొన్నారు. ‘నా ఆంధ్రావాలా ఆడియో లాంచ్‌కు సుమారు 9 నుంచి 10 లక్షల మంది అభిమానులు వచ్చారు. వారికోసం ప్రభుత్వం 10 ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేయాల్సి వచ్చింది.’ అని తారక్‌ వెల్లడించారు. ఆంధ్రావాలా సినిమాకు పూరి జగన్నాథ్‌ దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. అప్పట్లో ఈ సినిమా ఒక ట్రెండ్ సెట్టర్ అవుతుందని అంతా భావించారు కానీ మూవీ అందర్నీ నిరాశ పరిచింది.

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
RELATED ARTICLES

Most Popular