https://oktelugu.com/

Young heros: దసరా బరిలో కుర్ర హీరోలు.. హిట్​ కొట్టేదెవరు?

Young heros: ఈ ఏడాది దసరాకు కుర్ర హీరోలు మధ్య పోటీ నెలకొంది. సినిమా థియేటర్లలో ఎలాగైనా హిట్​ కొట్టాలనే సంకల్పంతో బరిలోకి దిగుతున్నారు. అయితే ఏ సినిమాకు ప్రేక్షకులు ఓటేసి కాసుల వర్షం కురిపిస్తారో వేచి చూడాలి. ఈ సందర్భంగా పండగ రోజు విడుదలకు సిద్ధంగా ఉన్న యువ హీరోల చిత్రాలేంటో తెలుసుకుందాం. మహా సముద్రం సిద్ధార్థ్‌, శర్వానంద్‌ ప్రధానపాత్రలో నటిస్తున్న చిత్రం మహా సముద్రం. అను ఇమ్మాన్యుయేల్‌, అదితీ రావ్‌ హైదరీ హీరోహీరోయిన్లుగా కనిపించనున్నారు. […]

Written By: , Updated On : October 12, 2021 / 07:12 PM IST
Follow us on

Young heros: ఈ ఏడాది దసరాకు కుర్ర హీరోలు మధ్య పోటీ నెలకొంది. సినిమా థియేటర్లలో ఎలాగైనా హిట్​ కొట్టాలనే సంకల్పంతో బరిలోకి దిగుతున్నారు. అయితే ఏ సినిమాకు ప్రేక్షకులు ఓటేసి కాసుల వర్షం కురిపిస్తారో వేచి చూడాలి. ఈ సందర్భంగా పండగ రోజు విడుదలకు సిద్ధంగా ఉన్న యువ హీరోల చిత్రాలేంటో తెలుసుకుందాం.

young-heros-movies-releasing-on-occation-of-dusura

మహా సముద్రం

సిద్ధార్థ్‌, శర్వానంద్‌ ప్రధానపాత్రలో నటిస్తున్న చిత్రం మహా సముద్రం. అను ఇమ్మాన్యుయేల్‌, అదితీ రావ్‌ హైదరీ హీరోహీరోయిన్లుగా కనిపించనున్నారు. దసరా కానుకగా అక్టోబరు 14న థియేటర్‌లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘ఆర్‌ఎక్స్‌100’ ఫేమ్‌ అజయ్‌ భూపతి దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే రెండు ట్రైలర్లతో సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. రావు రమేశ్‌, జగపతిబాబు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. చైతన్‌ భరద్వాజ్‌ సంగీతం అందించారు.

మోస్ట్ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌

అక్కినేని అఖిల్‌, పూజాహెగ్డే హీరోహీరోయిన్లుగా రానున్న సినిమా మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌. అక్టోబరు 15న విడుదలకు సిద్ధమైన ఈ సినిమా ట్రైలర్‌, పాటలకు ప్రేక్షకుల మంచి ఆదరణ లభిస్తోంది. మూడు సినిమాలు చేసినప్పటికీ, అఖిల్‌కి సరైన హిట్‌ లేదు. ఈ సారి ఎలాగైనా బ్లాక్‌ బస్టర్‌ కొట్టాలని ఆశపడుతున్నాడు అక్కనేని కుర్రాడు.

పెళ్లి సందడి

శ్రీకాంత్‌ తనయుడు రోషన్‌ హీరోగా(తొలి పరిచయం) వస్తున్న సినిమా పెళ్లిసందడి. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు తెరకెక్కించిన ఈ చిత్రం దసరా కానుకగా అక్టోబరు 15న థియేటర్‌లో ప్రేక్షకుల ముందుకు రానుంది. గతంలో వచ్చిన ‘పెళ్లిసందడి’ చిత్రానికి సంగీతమందించిన కీరవాణి ఈ సినిమాకు కూడా స్వరాలు సమకూర్చారు.