Shalini Pandey: ‘షాలిని పాండే’.. పేరులోనే హోమ్లీ నెస్ ఉంది, తన పేరుకి తగ్గట్టుగానే తన క్యూట్ ఎక్స్ ప్రెషన్స్ తో ఎప్పటికప్పుడు కవ్విస్తూ ఉంటుంది ఈ స్మాల్ బ్యూటీ. ఇక ‘అర్జున్ రెడ్డి’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన షాలిని, తన తొలి సినిమాతోనే కుర్రాళ్లను ఫిదా చేసింది. ఆ తర్వాత మహానటి, ఎన్టీఆర్ కథానాయకుడు లాంటి చిత్రాల్లో కూడా నటించి మెప్పించింది ఈ యంగ్ హీరోయిన్.

కాగా, షాలిని ప్రస్తుతం కెరీర్ లో మరో బ్రేక్ కోసం ఎదురుచూస్తోంది. సినిమాలెన్ని చేసినా ఇంకా అర్జున్ రెడ్డి దగ్గరే ఆగిపోయిందనే అపవాదుల నుంచి బయట పడటానికి ప్రస్తుతం షాలిని కసరత్తులు చేస్తోంది. అయితే, ఇప్పటివరకు చేసిన సినిమాలు విజయాలు సాధించకపోవడంతో షాలిని కి ఛాన్స్ లు తగ్గాయి. అర్ధాంతరంగా కిందకి పడిపోయిన తన కెరీర్ ను మళ్ళీ నిలబెట్టుకోవడానికి షాలిని పాండే బాలీవుడ్ లో కూడా ప్రవేశించింది.
Also Read: ‘శ్యామ్ సింగరాయ్’ సెన్సార్ కంప్లీట్.. సర్టిఫికేట్ ఏం ఇచ్చారంటే?
అక్కడ రెండు సినిమాల్లో నటిస్తోంది. జైష్ బై జోర్దార్ అనే సినిమాలో రణ్ వీర్ సింగ్ పక్కన నటిస్తోంది. మరి షాలిని బాలీవుడ్ లో అయినా స్టార్ డమ్ ను సంపాదిస్తోందా ? ప్రస్తుతానికి అయితే, ఈ క్యూట్ బేబీకి అండ్ ఈ స్మాల్ ఏంజెల్ కి అక్కడ కూడా ఛాన్స్ లు పెద్దగా రావడం లేదు. ఇక తెలుగులో అయితే కేతిక శర్మ, కృతి శెట్టి లాంటి హీరోయిన్లు షాలినికి గట్టి పోటీని ఇస్తున్నారు.
అయినా, షాలిని ఖాతాలో ఇప్పుడు ఒక సినిమా పడింది. పూరి తన తర్వాత సినిమాను హీరో రామ్ తో చేయబోతున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్ షాలినినేనట. ఎలాగూ హీరోయిన్లను స్క్రీన్ మీదకు ప్రెజెంటేషన్ చేయడంలో పూరి మాస్టర్ డిగ్రీ చేశాడు. అసలే సరైన బ్రేక్ కోసం కిందామీదా పడుతోన్న షాలిని పాండే మీదకు పూరి దృష్టి వెళ్ళింది. ఇక ఆమెకు దశ తిరిగినట్టే.
Also Read: నటి మంచు లక్ష్మి చేతికి రక్తం.. అసలు ఏమైంది?