Mokshagna: నందమూరి ఎన్టీయార్ నట వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన బాలయ్య బాబు తనదైన రీతిలో వరుస సినిమాలు చేస్తూ స్టార్ హీరోగా ఎదిగారు. ఇప్పుడు మూడోవ తరం హీరోగా బాలకృష్ణ కొడుకు అయిన మోక్షజ్ఞని రంగంలోకి దింపాలని చాలా సంవత్సరాల నుంచి బాలయ్య ట్రై చేస్తున్నప్పటికీ అది ఇప్పటి వరకు కూడా ఇంకా వర్కౌట్ అయితే అవ్వలేదు.
ప్రతి సంవత్సరం మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటుందని అభిమానులు భారీ అంచనాలు పెట్టుకుంటున్నప్పటికీ ఇప్పటివరకు కూడా మోక్షజ్ఞ ఎంట్రీ ఇవ్వలేదు. ఇక ఈ సంవత్సరం తప్పకుండా మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటుందని బాలయ్య బాబు బలంగా చెప్పడంతో మోక్షజ్ఞ ని ఏ డైరెక్టర్ పరిచయం చేస్తాడు అనే విషయం మీద కూడా చాలా చర్చలు అయితే జరుగుతున్నాయి.ఇక ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం మోక్షజ్ఞని ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో ఇంట్రడ్యూస్ చేయించాలని బాలయ్య బాబు ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది.
ఇక ఇదిలా ఉంటే ప్రశాంత్ వర్మ రీసెంట్ గా హనుమాన్ సినిమాతో భారీ సక్సెస్ అందుకొని మంచి ఫామ్ లో ఉన్నాడు. ఇక ఇలాంటి సమయంలోనే బాలయ్య బాబు తన కొడుకును ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో ఇండస్ట్రీకి పరిచయం చేయించాలని చూస్తున్నాడు. కానీ ప్రశాంత్ వర్మకి చాలా కమిట్ మెంట్స్ అయితే ఉన్నాయి. మరి ఆ కమిట్ మెంట్ల ని కాదనుకొని బాలయ్య బాబు ఆదేశం మేరకు మోక్షజ్ఞని పరిచయం చేసే బాధ్యతను తీసుకుంటాడా లేదా అనే విషయాలు కూడా తెలియాల్సి ఉంది.
నిజానికి ప్రశాంత్ వర్మ మంచి దర్శకుడు ఆయనకు కనక మోక్షజ్ఞని ఇస్తే ఒక మంచి సినిమా తీసి పెడతాడు అనడంలో ఎంత మాత్రం సందేహం లేదు.
అందుకే బాలయ్య బాబు కూడా ప్రశాంత్ వర్మ అయితేనే తన కొడుకుని సేఫ్ గా హ్యాండిల్ చేస్తాడు అనే ఉద్దేశ్యం లో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక మరో పక్క బోయపాటి కూడా మోక్షజ్ఞ ని పరిచయం చేయడానికి ఉత్సాహాన్ని చూపిస్తున్నప్పటికి బోయపాటి యంగ్ హీరోలకు సక్సెస్ ఇవ్వలేడు అనేది మొన్న స్కంద సినిమాతో మరోసారి ప్రూవ్ అయింది. కాబట్టి బాలయ్య ప్రశాంత్ వర్మ కే ఫిక్స్ అయినట్టు గా తెలుస్తుంది… ఇప్పుడున్న కమిట్ మెంట్స్ ని కాదని ప్రశాంత్ వర్మ మోక్షజ్ఞ సినిమాని ఒప్పుకుంటాడా లేదా అనే విషయాలు కూడా తెలియాల్సి ఉంది…