Jani Master remuneration for Aata: టాలెంట్ పరంగా దేశం గర్వించదగ్గ కొరియోగ్రాఫర్స్ లో ఒకరు జానీ మాస్టర్(Jani Master). తెలుగు, హిందీ, కన్నడ భాషలు అని తేడా లేకుండా, ప్రతీ ఇండస్ట్రీ లోనూ టాప్ స్టార్ హీరోలకు కొరియోగ్రఫీ చేసి సెన్సేషన్ సృష్టించాడు. ఆయన ప్రతిభకు నేషనల్ అవార్డు కూడా దక్కింది. కానీ తన అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ శ్రేష్టి వర్మ అనే అమ్మాయి జానీ మాస్టర్ పై లైంగిక వేధింపుల కేసు వేయడం, అందుకు పోలీసులు జానీ మాస్టర్ ని అరెస్ట్ చేసి నెల రోజుల పాటు రిమాండ్ లో ఉంచడం వల్ల, ఆయనకు వచ్చిన నేషనల్ అవార్డు కూడా వెనక్కి వెళ్ళింది. జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన జానీ మాస్టర్ కెరీర్, రెప్పపాటు సమయంలో ముగిసిపోయింది అంటూ సోషల్ మీడియా లో ఆయన పై ఎన్నో కామెంట్స్ వచ్చాయి. అలాంటి సమయంలో ఆయన బెయిల్ మీద బయటకు వచ్చాడు.
కానీ ఆయన కెరీర్ మాత్రం మళ్లీ కోలుకోవడం కష్టమేనేమో అని అంతా అనుకున్నారు. కానీ తనకి జీవితాన్ని ఇచ్చిన రామ్ చరణ్, మరోసారి కెరీర్ పరంగా జానీ మాస్టర్ కి పునర్జన్మ ‘పెద్ది’ రూపంలో ఇచ్చాడు. రీసెంట్ గా ఈ చిత్రం నుండి విడుదలైన ‘చికిరి చికిరి’ పాట గ్లోబల్ వైడ్ గా సెన్సేషన్ సృష్టించింది. పోయింది అనుకున్న కెరీర్ మళ్లీ అంతకు ముందుకంటే గొప్పగా తిరిగొచ్చింది. అయితే మెగా ఫ్యామిలీ కి చెందిన నిహారిక కొణిదెల నిర్మాతగా, రీసెంట్ గానే ‘జీ తెలుగు’ లో ‘ఆట’ అనే డ్యాన్స్ షోని మొదలు పెట్టింది. నేటి నుండి ఈ షో ప్రసారం కానుంది. ఈ షోకి నిహారిక కొణిదెల కూడా ఒక జడ్జిగా వ్యవహరిస్తుండగా, జానీ మాస్టర్, సీనియర్ హీరోయిన్ రాధికా కూడా ఈ షోలో జడ్జీలుగా వ్యవహరిస్తున్నారు. ఒకప్పుడు జానీ మాస్టర్ టీవీ షోస్ లలో కూడా రెగ్యులర్ గా కనిపించేవాడు.
రీ ఎంట్రీ తర్వాత మళ్లీ ఆయన టీవీ షోస్ లో కనిపించడం అసాధ్యం అని అంతా అనుకున్నారు. కానీ ఏ మెగా ఫ్యామిలీ అయితే రీ ఎంట్రీ లో ఆయన్ని దగ్గరకు తీసుకొని ఆదరించిందో, అదే మెగా ఫ్యామిలీ టీవీ షోలో కూడా అవకాశం ఇచ్చింది. ఈ షో కోసం జానీ మాస్టర్ ఒక్కో ఎపిసోడ్ కి 5 లక్షల రూపాయిల రెమ్యూనరేషన్ ని అందుకోబోతున్నాడు అట. ఇదే ఇప్పుడు ఇండస్ట్రీ లో హాట్ టాపిక్ గా మారింది. ఇకపోతే ఈ షో కి హోస్ట్ గా సుడిగాలి సుధీర్ వ్యవహరిస్తుండగా, టీం లీడర్స్ గా వంశీ, కావ్యశ్రీ, విష్ణు ప్రియా వ్యవహరిస్తున్నారు. ప్రతీ శని, ఆదివారాల్లో ఈ షో ప్రసారం కానుంది.
