Yellamma Movie updates: దిల్ రాజు నిర్మాణం లో నితిన్(Actor Nithin) హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘తమ్ముడు'(Thammudu) కమర్షియల్ గా ఎంత పెద్ద డిజాస్టర్ ఫ్లాప్ అయ్యిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. కేవలం 5 రోజుల్లోనే అన్ని ప్రాంతాల నుండి షేర్ వసూళ్లు రావడం ఆగిపోయాయి. నితిన్ కెరీర్ లో ఎన్నో డిజాస్టర్ ఫ్లాప్ సినిమాలు ఉన్నాయి కానీ, ఈ రేంజ్ డిజాస్టర్ మాత్రం గతం లో లేదు. కుబేర, కన్నప్ప చిత్రాలతో కాస్త ఊపిరి పీల్చుకున్న బాక్స్ ఆఫీస్ ని మరోసారి చావు దెబ్బ కొట్టింది ఈ చిత్రం. పాపం నితిన్ ఈ సినిమా మీద భారీ ఆశలు పెట్టుకొని ఉండేవాడు. దిల్ రాజు ఆ ఆశలపై నీళ్లు చల్లినట్టు అయ్యింది. ముందుగా ఈ కథ నేచురల్ స్టార్ నాని(Natural Star Nani) వద్దకు వెళ్లిందట. కానీ ఆయనకు కథ నచ్చక రెజ్జేక్ట్ చేసాడట.
Also Read: కేవలం టీజర్ 1000 కోట్లను సంపాదించి పెట్టిందా? కోట్లకు పడగలెత్తిన నిర్మాతలు
తనకు MCA లాంటి భారీ కమర్షియల్ సక్సెస్ ఇచ్చిన డైరెక్టర్ వేణు శ్రీరామ్(Venu Sriram) ని ఎందుకు రిజెక్ట్ చేశాడు అనే అనుమానం అప్పట్లోనే ఆడియన్స్ కి వచ్చింది. కానీ ట్రైలర్ చూసిన తర్వాత టీం ఎదో కొత్త ప్రయత్నం చేసినట్టు ఉంది, కచ్చితంగా సక్సెస్ అవుతుందేమో అని అనుకున్నారు. కానీ బెడిసికొట్టేసింది. ఈ సినిమా నితిన్ కెరీర్ పై మామూలు ప్రభావం చూపలేదు. అసలే వరుసగా 5 ఫ్లాపులతో ఇబ్బంది పడుతున్న నితిన్ కి ఆరవ ఫ్లాప్ రూపం లో ఈ ‘తమ్ముడు’ వచ్చింది. అయితే ఇప్పుడు ఇదే నితిన్ తో దిల్ రాజు(Dil Raju) ‘ఎల్లమ్మ'(Yellamma Movie) అనే ప్రాజెక్ట్ ని ప్రకటించాడు. బలగం చిత్రానికి దర్శకత్వం వహించిన వేణు(Venu Yeldandi), ఈ చిత్రానికి దర్శకత్వం వహించబోతున్నాడు. ఇది కూడా నాని రిజెక్ట్ చేసిన కథనే. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ ని చేద్దామా వద్ద అనే ఆలోచనలో దిల్ రాజు ఉన్నట్టు తెలుస్తుంది.
‘తమ్ముడు’ చిత్రం ఫ్లాప్ తర్వాత ఆయన ‘ఎల్లమ్మ’ స్క్రిప్ట్ ని పోస్ట్ మార్టం చేయడం మొదలు పెట్టాడట. కచ్చితంగా సూపర్ హిట్ కొడుతాము అనే నమ్మకంతో దిగిన ‘తమ్ముడు’ నే ఇలా అయ్యిందంటే, ‘ఎల్లమ్మ’ లాంటి రిస్కీ సబ్జెక్టు ఎలా ఉంటుంది అనే దానిపై ఆలోచించడం మొదలు పెట్టాడట. పైగా ఈ సినిమా ని నితిన్ తో చెయ్యాలా వద్దా?, నితిన్ మార్కెట్ పూర్తిగా పడిపోయింది, పైగా ఇది నటన కు అత్యంత ప్రాధాన్యత ఉన్న సినిమా, నితిన్ ఆ రేంజ్ లో నటించగలడా లేదా అనే డైలమా లో పడ్డాడట దిల్ రాజు. అందుకే ఈ ప్రాజెక్ట్ ని కొన్ని రోజులు హోల్డ్ లో పెట్టాలని చూస్తున్నాడు. కష్టాల్లో ఉన్న తమ హీరో ని మరింత కష్టాల్లోకి నెట్టి, ఇప్పుడు ఒక మంచి సబ్జెక్టు ఉన్న సినిమా పడితే దిల్ రాజు దానిని ముందుకు సాగనివ్వకుండా మా హీరో కెరీర్ తో ఆడుకునే ప్రయత్నం చేస్తున్నాడంటూ నితిన్ అభిమానులు సోషల్ మీడియా లో కామెంట్ చేస్తున్నారు.