Yatra 2 Twitter Talk
Yatra 2 Twitter Talk: మమ్ముట్టి, జీవా ప్రధాన పాత్రల్లో దర్శకుడు మహి వి రాఘవ తెరకెక్కించిన పొలిటికల్ డ్రామా యాత్ర 2. ఇది ఏపీ సీఎం జగన్ బయోపిక్. 2019లో మహి వి రాఘవ యాత్ర టైటిల్ తో వైఎస్ రాజశేఖర్ రెడ్డి బయోపిక్ తెరకెక్కించారు. ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటుండగా వైఎస్సార్ పాదయాత్ర చేపట్టి ఎలా అధికారంలోకి వచ్చారు. సంక్షేమ పథకాలు తెచ్చారు… అనే కోణంలో యాత్ర మూవీ సాగుతుంది. ఆ చిత్రానికి కొనసాగింపుగా యాత్ర 2 తెరకెక్కింది.
వైఎస్సార్ పాత్రను మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి చేశారు. ఇక జగన్ పాత్రను కోలీవుడ్ హీరో జీవ చేశారు. మరికొన్ని రోజుల్లో ఏపీలో ఎన్నికలు జరగనుండగా ఫిబ్రవరి 8న యాత్ర 2 విడుదల చేశారు. ఇప్పటికే యాత్ర 2 ప్రీమియర్స్ ముగిశాయి. మూవీ చూసిన జనాల రియాక్షన్ ఏమిటో చూద్దాం. యాత్ర మూవీ 2 ఫస్ట్ హాఫ్ బాగుంది. సెకండ్ హాఫ్ పర్లేదు అంటున్నారు.
Positive response from premiers ❤️
Do watch #Yatra2 only in theatres pic.twitter.com/Uvv86j3av8— ️ (@BharathTweetz) February 8, 2024
నేరేషన్ స్లోగా ఉన్నప్పటికీ ప్రతి సన్నివేశం ఎమోషనల్ గా సాగుతుంది. యాత్ర 2 పొలిటికల్ ప్రాపగాండా మూవీ అనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో.. జగన్ ప్రత్యర్థులైన చంద్రబాబు, సోనియా గాంధీలను తప్పుగా చూపిస్తారనే అనుమానాలు ఉన్నాయి. అయితే దర్శకుడు జగన్ ఇమేజ్ పెంచేందుకు ప్రాధాన్యత ఇచ్చాడట. కఠిన పరిస్థితులను ఎదుర్కొని తాను అనుకున్న లక్ష్యం ఎలా సాధించాడు అనే విషయాలు బలంగా చెప్పే ప్రయత్నం జరిగిందట.
#Yatra2 – Modern Day Ramayanam#YsJagan #Mammotty #Jiiva #MahiVRaghav #KetakiNarayan #Yatra2Review #Cinee_WorlddReview #Cinee_Worldd @MahiVraghav @JiivaOfficial @mammukka @ysjagan pic.twitter.com/OaY5RvoIbg
— cinee worldd (@Cinee_Worldd) February 8, 2024
వైఎస్సార్ పాత్రలో మమ్ముట్టి హుందాగా నటించారని అంటున్నారు. ఇక జగన్ గా జీవా మెప్పించారని, ఆయన హావభావాలు అనుకరించాడని ప్రేక్షకుల అభిప్రాయం. దర్శకుడిగా మహి వి రాఘవ సక్సెస్ అయ్యాడు. తాను చెప్పాలనుకున్నది వెండితెరపై ఆవిష్కరించాడని అంటున్నారు. సినిమాటోగ్రఫీ బాగుంది. మ్యూజిక్ బీజీఎమ్ వరకు ఓకే. పాటలు ఆకట్టుకోలేదని అంటున్నారు. జగన్ ఫ్యాన్స్ కి యాత్ర 2 ఐ ఫీస్ట్ అంటున్నారు. వాళ్లకు గూస్ బంప్స్ కలిగించే సన్నివేశాలు యాత్ర 2లో ఉన్నాయట. అభిమానులు ఎమోషనల్ గా కనెక్ట్ అవుతారని అంటున్నారు.
Good 1st Half #Yatra2. @mammukka and @JiivaOfficial lived in their characters . @MahiVraghav narration .
— Sai Suraj (@saisuraj143) February 8, 2024
Web Title: Yatra 2 movie twitter talk in telugu
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com