Yash Toxic Teaser: ‘కేజీఎఫ్ 2’ తర్వాత భారీ గ్యాప్ తీసుకున్న హీరో యాష్ , ఇప్పుడు మన ముందుకు ‘టాక్సిక్’ అనే చిత్రం ద్వారా రాబోతున్న సంగతి అందరికీ తెలిసిందే. ముందుగా ఈ చిత్రాన్ని ఉగాది కానుకగా మార్చి 19 న విడుదల చేద్దామని అనుకున్నారు, కానీ ఆ తర్వాత కొన్ని అనుకోని కారణాల వల్ల, ఈ చిత్రం జూన్ 4 కి వాయిదా పడింది. కానీ అప్పటికి కూడా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ చాలా వరకు బ్యాలన్స్ ఉండడం తో , ఈ సినిమా మరోసారి వాయిదా పడింది. దీంతో ఈ చిత్రం పై అనేక అనుమానాలు కలిగాయి. మూవీ ఔట్పుట్ పై హీరో యాష్ సంతృప్తి గా లేరని , అందుకే రీ షూట్స్ కోసం ఈ చిత్రాన్ని వాయిదా వేశారని, ఈ సినిమా సూపర్ హిట్ అయ్యే లక్షణాలు అసలు లేవని చెప్పుకొచ్చారు నెటిజెన్స్.
అయితే మూవీ టీం ఇలాంటి రూమర్స్ పై స్పందిస్తూ సినిమాకు ఇంటర్నేషనల్ రేంజ్ స్టాండర్డ్స్ ఉన్నాయని , ఫిలిం ఫెస్టివల్ రీసెంట్ గా ఈ చిత్రానికి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చిందని , ఆ రెస్పాన్స్ ని చూసిన తర్వాత అంతర్జాతీయ స్థాయిలో ఫారిన్ భాషల్లో కూడా విడుదల చెయ్యాలని అనుకుంటున్నామని , అందుకే బెటర్ డీల్స్ కోసం ఈ చిత్రాన్ని వాయిదా వేస్తున్నట్టు చెప్పుకొచ్చారు. ఇక రీసెంట్ గానే ఈ చిత్రాన్ని ఆగస్టు 26 న విడుదల చేయబోతున్నట్టు మేకర్స్ అధికారిక ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. అయితే కాసేపటి క్రితమే ఈ సినిమాలో నటించిన ఫిమేల్ లీడ్స్ కి సంబంధించిన టీజర్ ని పరిచయం చేశారు. ఈ టీజర్ లో ఒక్కొక్క హీరోయిన్ ని ఒక్కో అణుబాంబు లెక్క చూపించారు డైరెక్టర్ గీతూ మోహన్ దాస్. ముఖ్యంగా లేడీ సూపర్ స్టార్ నయనతార ఒక యాక్షన్ సీక్వెన్స్ లో బైక్ మీద వస్తున్న షాట్ హైలైట్ గా అనిపించింది.
అదే విధంగా రుక్మిణి వాసంత్, కియారా అద్వానీ, తారా సుతారియా , హుమా ఖురేషి, ఇలా ప్రతీ ఒక్కరిని యాక్షన్ మోడ్ లో చూపించి , ఈ చిత్రం లో ఫిమేల్ లీడ్స్ కి ఎంతటి ప్రాముఖ్యత ఉందో చెప్పుకొచ్చారు. టీజర్ చూస్తున్నంతసేపు, ఒక సౌత్ సినిమాని చూస్తున్న ఫీలింగ్ అసలు కలగలేదు. ఒక హాలీవుడ్ యాక్షన్ మూవీ ని చూస్తున్నట్టుగా, అసలు సిసలు జెన్ జీ సినిమా లాగా అనిపించింది. ఈ రేంజ్ కంటెంట్ ఉంది కాబట్టే, ఇన్ని రోజుల సమయం తీసుకున్నారు, విడుదల తర్వాత ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద అణుబాంబు లాగా పేలుతుంది , అందులో ఎలాంటి సందేహం లేదంటూ నెటిజెన్స్ అంటున్నారు. సోషల్ మీడియా ని ఒక రేంజ్ లో ఊపేస్తున్న ఈ టీజర్ ని మీకోసం క్రింద అందిస్తున్నాము చూసేయండి.
