Vijayendra Prasad: ఇంకా షూటింగ్ కూడా మొదలు కాలేదు. మహేష్ బాబు-రాజమౌళి చిత్ర అప్డేట్స్ గూస్ బంప్స్ కలిగిస్తున్నాయి. రచయిత విజయేంద్ర ప్రసాద్ తాజాగా చేసిన కామెంట్స్ కాకరేపుతున్నాయి. రాజమౌళి తండ్రిగారైన విజయేంద్ర ప్రసాద్ మహేష్ చిత్రానికి కథను సమకూర్చిన విషయం తెలిసిందే. లాక్ డౌన్ సమయంలో ఖాళీగా ఉన్న రాజమౌళి మహేష్ కోసం కథను సిద్ధం చేశారు. విజయేంద్ర వర్మ వద్ద ఉన్న స్టోరీ లైన్స్ నుండి ఒకటి ఎంచుకొని డెవలప్ చేశారు. మహేష్ ఇమేజ్, కట్ అవుట్ కి యాక్షన్ అడ్వెంచర్ సెట్ అవుతుందని భావించారు.
మహేష్ బాబుతో ఆఫ్రికన్ జంగిల్ అడ్వెంచర్ డ్రామా చేస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. తాజాగా ఓ మీడియా సంస్థతో మాట్లాడిన విజయేంద్ర ప్రసాద్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. మహేష్ బాబు చిత్రాన్ని ఆర్ ఆర్ ఆర్ స్థాయిలో ఊహించుకోవచ్చా? అనగా, అంతకు మించి ఉంటుందని సమాధానం చెప్పారు. మహేష్ బాబుతో చేసేది యాక్షన్ అడ్వెంచర్ డ్రామా, ఆర్ ఆర్ ఆర్ కంటే భారీ స్థాయిలో ఉంటుందని విజయేంద్ర ప్రసాద్ అన్నారు.
మరో ఆసక్తికర విషయం ఏమిటంటే… షూటింగ్ మొదలు కావడానికి ముందు మూడు నెలలు మహేష్ చేత రాజమౌళి వర్క్ షాప్ చేయిస్తారట. అది సెట్స్ లో ఆయనకు, రాజమౌళికి కూడా పని తేలికయ్యేలా చేస్తుందట. రాజమౌళి పర్ఫెక్షనిస్ట్ అనే పేరుంది. తాను కోరుకున్నది కోరుకున్నట్లుగా వచ్చే వరకు నటులను నార తీస్తారు. నాటు నాటు సాంగ్ విషయంలో జక్కన్న చంపేశాడని ఎన్టీఆర్ ఓ ఇంటర్వ్యూలో చెప్పిన విషయం తెలిసిందే.
ఈ మధ్య మహేష్ ఎక్కువగా జిమ్ లో కనిపిస్తున్నారు. రాజమౌళి మూవీ కోసం కండలు పెంచుతున్నాడనే ప్రచారం జరుగుతుంది. ఈ చిత్ర బడ్జెట్ రూ. 800 కోట్లని సమాచారం. హాలీవుడ్ సాంకేతిక నిపుణులు, నటులు భాగం కానున్నారట. వచ్చే ఏడాది ప్రథమార్థంలో సెట్స్ పైకి వెళ్లనున్న ఈ మూవీ 2026లో విడుదలయ్యే సూచనలు కలవు. కెరీర్లో ఫస్ట్ టైం రాజమౌళి-మహేష్ జతకడుతున్నారు.