https://oktelugu.com/

Acharya Industry Hit: ఈ చిన్న మార్పులు చేసి ఉంటే ఆచార్య ఇండస్ట్రీ హిట్ అయ్యేదా..?

Acharya Industry Hit: మెగా అభిమానులు ఎప్పుడెప్పుడా అని వెయ్యి కళ్ళతో ఎదురు చూసిన మెగాస్టార్ చిరంజీవి ఆచార్య చిత్రం ఇటీవలే భారీ అంచనాల నడుమ ఘనంగా 2000 థియేటర్స్ లో విడుదల అయినా సంగతి మన అందరికి తెలిసిందే..భారీ అంచనా నడుమ విడుదల అయినా ఈ సినిమా మొదటి రోజు మొదటి ఆట నుండే డిజాస్టర్ టాక్ ని సొంతం చేసుకుంది..దీని తో ఈ మూవీ కలెక్షన్స్ పై చాలా తీవ్రమైన ప్రభావం పడింది..ఒక్క చిరంజీవి […]

Written By:
  • Neelambaram
  • , Updated On : May 2, 2022 / 11:00 AM IST
    Follow us on

    Acharya Industry Hit: మెగా అభిమానులు ఎప్పుడెప్పుడా అని వెయ్యి కళ్ళతో ఎదురు చూసిన మెగాస్టార్ చిరంజీవి ఆచార్య చిత్రం ఇటీవలే భారీ అంచనాల నడుమ ఘనంగా 2000 థియేటర్స్ లో విడుదల అయినా సంగతి మన అందరికి తెలిసిందే..భారీ అంచనా నడుమ విడుదల అయినా ఈ సినిమా మొదటి రోజు మొదటి ఆట నుండే డిజాస్టర్ టాక్ ని సొంతం చేసుకుంది..దీని తో ఈ మూవీ కలెక్షన్స్ పై చాలా తీవ్రమైన ప్రభావం పడింది..ఒక్క చిరంజీవి మరియు రామ్ చరణ్ కాంబినేషన్ లో సినిమా అనే రీసన్ తప్ప ఈ సినిమా నుండి విడుదల అయినా టీజర్ మరియు ట్రైలర్ కేవలం అభిమానులను తప్ప ఎవ్వరిని ఆకట్టుకోలేక పోయింది..అందుకే వీక్ అడ్వాన్స్ బుకింగ్స్ ని సొంతం చేసుకున్న ఈ సినిమా, మెగాస్టార్ కెరీర్ లోనే వీక్ ఓపెనింగ్స్ ని సొంతం చేసుకుంది.

    Acharya

    చిరంజీవి సినిమా అంటే కమర్షియల్ ఎలెమెంట్స్ కచ్చితంగా ఉండాలి..ఈ సినిమాలో కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్నప్పటికీ కూడా ఎందుకో అవి జనాలను రంజింపచేసే విధంగా కొరటాల శివ తెరకెక్కించలేక పొయ్యాడు..సినిమాలో ఒక్క సన్నివేశం కూడా అబ్బా అనిపించే విధంగా దర్శకుడు మలచడం లో తీవ్రంగా విఫలం అయ్యాడు అనే చెప్పాలి..ఇక చిరంజీవి మరియు రామ్ చరణ్ మధ్య వచ్చే భలే భలే బంజారా సాంగ్ మినహా ఒక్క సన్నివేశం కూడా బాగా రాకపోవడం తో అభిమానులు తీవ్రమైన నిరాశకి గురి అయ్యారు..ఇది ఇలా ఉండగా ఈ సినిమా స్క్రిప్ట్ లో కొన్ని మార్పులు చేసి ఉంటె ఇండస్ట్రీ హిట్ అయ్యి ఉండేది అని అభిమానులు సోషల్ మీడియా లో చేస్తున్న కామెంట్స్..అదేమిటి అంటే ఈ సినిమా ఫ్లాష్ బ్యాక్ నిడివి ఎక్కువ ఉండడం పెద్ద మైనస్ గా మారింది అనే బాధ ప్రతివో అభిమాని లోను ఉన్నది.

    Also Read: Megastar Chiranjeevi: శ్రీదేవితో అలా చేసి.. 15 రోజులు హాస్పిటల్‌లో జాయిన్‌ అయ్యా – చిరంజీవి

    ఎందుకంటే మన యూత్ ఆడియన్స్ కి ఈ నక్సలైట్ బ్యాక్ డ్రాప్ మొదటి నుండి నచ్చదు..గతం లో ఈ బాక్ డ్రాప్ లో చాలా సినిమాలే వచ్చాయి..జల్సా సినిమా లో కూడా ఈ బ్యాక్ డ్రాప్ తోనే ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది..కానీ ఆ సినిమాలో ఆ ఫ్లాష్ బ్యాక్ ని చాలా షార్ట్ గా పెట్టడం వల్ల చూసే జనాలకు బోరింగ్ ఫీల్ రాలేదు..కానీ ఆచార్య సినిమాలో అంత వ్యవధి ఉన్న నక్సలైట్ బ్యాక్ డ్రాప్ పెట్టడం జనాల సహనం ని పరీక్షించినట్టు అయ్యింది..అందుకే అలాంటి ఫలితం వచ్చింది అంటూ సోషల్ మీడియా లో అభిమానులు పోస్టులు పెడుతున్నారు..వాస్తవానికి ఆచార్య సినిమాలో కూడా రామ్ చరణ్ ఫ్లాష్ బ్యాక్ చాలా తక్కువ వ్యవధి లోనే డిసైన్ చేసాడు కొరటాల శివ..కానీ అభిమానులకు మరింత కిక్ ఇవ్వడం కోసం, రామ్ చరణ్ పాత్రని సినిమా స్టోరీ అవసరం కి మించి పెంచేసాడు..అలా కాకుండా ముందు అనుకున్నట్టు తీసి ఉంటె కాస్త మెరుగైన ఫలితం వచ్చి ఉండేది అని ఇండస్ట్రీ లో వినిపిస్తున్న టాక్.

    Also Read: F3 Movie: ‘బ్లాస్టింగ్’ అట.. ఇంతకీ ఏమిటి ఆ బ్లాస్టింగ్ ?

    Recommended Videos


    Tags