Krithi Shetty: తెలుగు వెండితెరపై అందగత్తెలకు కొదవేమీ లేదు. అయితే, ఆ అందగత్తెల్లో కొందరికి మాత్రమే తెలుగు సినీ లోకం నీరాజనాలు పలుకుతోంది. అలా పలికినా.. ఆ నీరాజనాలు అందుకునే ప్రతిభ, లౌక్యం ఉండాలి. ఈ రెండిట్లో ఏది లేకపోయినా, తెర మరుగు కాక తప్పదు. అయితే, కన్నడ భామ ‘కృతి శెట్టి’ మాత్రం తన లౌక్యం తో మొత్తానికి తెలుగు తెర పై తనదైన ముద్ర వేసింది.

“ఉప్పెన” సినిమా బ్లాక్ బస్టర్ అయినప్పుడు.. ఎందరో హీరోయిన్లు రెండో సినిమాతోనే తెరమరుగు అయ్యారు కాబట్టి.. కృతి శెట్టి కూడా మరుగు చాటుకి వెళ్లక తప్పదు అని టాక్ వినిపించింది. కారణం.. ఆమెలో హోమ్లీ నెస్ తప్ప, హాట్ నెస్ లేదు అనేది ప్రధానంగా వచ్చిన ఆరోపణ. కానీ కృతి రెండో సినిమాలో ఆమె చూపించిన హాట్ నెస్ కి మేకర్స్ కూడా షాక్ అయ్యారు.
అసలు గ్లామరస్ రోల్స్ లో కృతి శెట్టి మెప్పిస్తుందా లేదా అన్న డౌట్స్ అన్నీ ’శ్యామ్ సింగ రాయ్’ పటాపంచలు చేసేశాడు. ఆ సినిమాలో కృతి శెట్టి విచ్చలవిడిగా రెచ్చిపోయింది. హాట్ హాట్ కిస్ లతో హీట్ పెంచే బెడ్ సీన్లతో అడ్డు అదుపు లేకుండా ముందుకు వెళ్లి పోయింది. దెబ్బకు విమర్శకులు సైతం ఆమె పై ప్రశంసల వర్షం కురిపించక తప్పలేదు.
Also Read: సినిమా ఆలూ నాకు దేవాలయాలు లాంటివి : హీరో నిఖిల్
అయినా “ఉప్పెన”లో ఒక విలేజ్ గర్ల్ గా చాలా సింపుల్ గా కనిపించిన ఈ కుర్ర భామ, “శ్యామ్ సింగ రాయ్”లో మాత్రం వెరీ మోడ్రన్ అర్బన్ గర్ల్ గా అదిరిపోయే బోల్డ్ నెస్ తో కేక పెట్టించింది. పైగా రెండో సినిమాకే పక్కా వైవిధ్యం చూపించి.. తాను బోల్డ్ రోల్స్ కి కూడా పర్ఫెక్ట్ అనిపించుకుంది. అయితే, ఈ విజయం ఆమెకు ఈజీగా రాలేదు.
తనకు వచ్చే పాత్రల పై కృతి శెట్టి ఓన్ గా ఎంతో రీసెర్చ్ చేసుకుంటుంది. అసలు తన క్యారెక్టర్ ఏమిటి ? ఎందుకు అలా ఉంది ? ఎలా ఉంటే బాగుంటుంది ? ఇలా అనేక రకాలుగా కృతి తన పాత్ర పై వర్క్ చేస్తోంది. పాత్రలోని ఎమోషన్ని బలంగా పట్టుకుంటుంది. అంత హార్డ్ వర్క్ చేస్తోంది కాబట్టే.. తన కథల సెలెక్షన్ పై కృతి ఎప్పుడు ఉత్సహంగా ఉంటుందట. ఇక వచ్చే నెలలో “బంగార్రాజు” సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతుంది కృతి.
Also Read: నక్సలైట్ గెటప్ లో రామ్ గోపాల్ వర్మ… వైరల్ గా మారిన వీడియో