Veera Simha Reddy Closing Collections: మెగాస్టార్ చిరంజీవి హీరో గా నటించిన ‘వాల్తేరు వీరయ్య’ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి ప్రభంజనం సృష్టించిందో అందరికీ తెలిసిందే..జనవరి 13 వ తారీఖు నుండి నేటి వరకు ఈ సినిమా హౌస్ ఫుల్ కలెక్షన్స్ ని నమోదు చేసుకుంటూ ట్రేడ్ పండితులు సైతం విస్మయానికి గురయ్యేలా చేసింది..ఇక ఈ సినిమాతో పాటుగా భారీ హైప్ తో బాలయ్య ‘వీర సింహా రెడ్డి’ సినిమా కూడా విడుదలైన సంగతి అందరికీ తెలిసిందే.

అఖండ వంటి ప్రభంజనం తర్వాత బాలయ్య నుండి వస్తున్నా సినిమా కావడం తో ఈ మూవీ పై అభిమానుల్లోనే కాదు ప్రేక్షకుల్లో కూడా అంచనాలు భారీగా ఉండేవి..మొదటి రోజు ఓపెనింగ్స్ ని చూసి ఈ సంక్రాంతికి బాలయ్య డామినేషన్ మాత్రమే ఉంటుందని అనుకున్నారు అందరూ..కానీ కథ అడ్డం తిరిగింది..’వాల్తేరు వీరయ్య’ సినిమాని డామినేట్ చేస్తాడని అందరూ అనుకుంటే, చివరికి వాల్తేరు వీరయ్య నాలుగు రోజుల వసూళ్లతో కూడా సమానం కావడం లేదు వీర సింహా రెడ్డి వసూళ్లు.
వీర సింహా రెడ్డి 11 రోజులకు గాను ప్రపంచవ్యాప్తంగా అన్నీ ప్రాంతాలకు కలిపి 73 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టింది..’వాల్తేరు వీరయ్య’ చిత్రం కేవలం నాలుగు రోజులకు రాబట్టిన వసూళ్లు సుమారు గా 76 కోట్ల రూపాయిల వరకు ఉంటుంది..ఓపెనింగ్స్ చూసి సంక్రాంతి వార్ వన్ సైడ్ అయిపోతుంది అని తొడలు కొట్టిన నందమూరి అభిమానులు ‘వీర సింహా రెడ్డి’ చిత్రం క్లోసింగ్ కలెక్షన్స్ ‘వాల్తేరు వీరయ్య’ నాలుగు రోజుల వసూళ్లతో కూడా సమానంగా ఉండేలా కనిపించకపోవడం వాళ్లకి తీవ్రమైన నిరాశ కలిగించింది..చిరంజీవి నుండి ఈ రేంజ్ బాక్స్ ఆఫీస్ డామినేషన్ ని ఊహించలేదని.

ఈ రేంజ్ బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని అనుకోలేదంటూ నందమూరి అభిమానులు సోషల్ మీడియా లో పోస్టులు పెడుతున్నారు..గతం లో కూడా ‘ఖైదీ నెంబర్ 150 ‘ చిత్రం ముందు బాలయ్య ‘గౌతమీ పుత్ర శాతకర్ణి’ చిత్రానికి కూడా ఇదే పరిస్థితి పట్టింది..ఇలా బ్యాక్ తో బ్యాక్ వరుసగా బాలయ్య కి చిరంజీవి చేతిలో ఓటమి ఎదురువడాన్ని జీర్ణించుకోలేక పోతున్నారు నందమూరి ఫ్యాన్స్.