Sankranti 2024 Movies: సంక్రాంతి సినిమాల్లో ఆ రెండు సినిమాలు సూపర్ సక్సెస్ అవుతాయా..?

నిజానికి గుంటూరు కారం సినిమా రిలీజ్ అవుతున్నప్పటికీ హనుమాన్ సినిమా మీద కూడా మంచి అంచనాలు ఉన్నాయి. చిన్న సినిమాగా వస్తున్న కూడా ఈ సినిమా మీద అంచనాలు భారీ గానే ఉన్నాయి.

Written By: Gopi, Updated On : January 11, 2024 9:18 am

Sankranti 2024 Movies

Follow us on

Sankranti 2024 Movies: సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న తెలుగు సినిమాలలో ఏ సినిమా విజయం సాధిస్తుంది అనే దాని మీదనే ఇప్పుడు ప్రతి ప్రేక్షకుడు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నాడు. ఈ నాలుగు సినిమాలు కూడా మంచి విజయాన్ని అందుకుంటాయి అని ఆయా సినిమా యూనిట్ మంచి కాన్ఫిడెన్స్ తో ఉన్నప్పటికీ ఇప్పుడు మాత్రం ప్రేక్షకుడు ఏ సినిమాని సక్సెస్ తీరాలకు చేరుస్తాడు అనేది కూడా చాలా ఆసక్తికరంగా మారింది.

నిజానికి గుంటూరు కారం సినిమా రిలీజ్ అవుతున్నప్పటికీ హనుమాన్ సినిమా మీద కూడా మంచి అంచనాలు ఉన్నాయి. చిన్న సినిమాగా వస్తున్న కూడా ఈ సినిమా మీద అంచనాలు భారీ గానే ఉన్నాయి. ఇక ఈ రెండు సినిమాలు కూడా 12 వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఈ రెండు సినిమాలు సపరేట్ జానర్ లో తెరకెక్కడం వల్ల వీటి మధ్య పోటీ ఉన్నప్పటికీ ప్రేక్షకులు ఈ రెండు సినిమాలని ఆదరించే విధంగానే కనిపిస్తున్నారు.

ఎందుకంటే మహేష్ బాబు సినిమా అంటే ఫ్యామిలీ ఆడియెన్స్ ఎక్కువగా చూస్తారు. అలాగే హనుమాన్ సినిమా డివోషనల్ కి సంబంధించిన టచ్ ఉండడంతో దానిని కూడా ప్రేక్షకులు ఆదరించే అవకాశాలు అయితే పుష్కలంగా ఉన్నాయి…ఇక ఇలాంటి క్రమం లో ఈ సినిమాలే కాకుండా వెంకటేష్ సైధవ్ సినిమా కూడా ప్రేక్షకులను మెప్పిస్తుంది అనడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు అంటూ కొంత మంది అభిమానులు కూడా చెప్తున్నారు. ఇక నాగార్జున, అల్లరి నరేష్ కలిసి చేస్తున్న నా సామిరంగా సినిమా కూడా ప్రేక్షకులను ఏమాత్రం నిరాశపరచదు అని ఇప్పటికే చిత్ర యూనిట్ చెప్పారు. ఇక రీసెంట్ గా ఈ సినిమా నుంచి వచ్చిన ట్రైలర్ కూడా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది.

మరి ఈ నాలుగు సినిమాల్లో హనుమాన్ గుంటూరు కారం సినిమాలు భారీ సక్సెస్ లను అందుకుంటాయంటూ ఇండస్ట్రీలో ఈ సినిమాల ప్రివ్యూ చూసిన చాలామంది సెలబ్రిటీ లు చెప్తున్నారు. ఇక సైంధవ్, నాసామి రంగా సినిమాలు సక్సెస్ అయినప్పటికీ ఆ రెండు సినిమాలు మాత్రం భారీ విజయనందుకోబోతున్నట్టుగా తెలుస్తుంది… చూడాలి మరి ఈ సంక్రాంతి ఎవరికి సక్సెస్ తీసుకువస్తుందో…