Pawan Kalyan OG: ఇండస్ట్రీ లో మెగా ఫ్యామిలీ హీరోలకు ఉన్న క్రేజ్ ఎలాంటిదో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఒకే కుటుంబం నుండి నలుగురు స్టార్ హీరోలు ఉన్నారు. బాక్స్ ఆఫీస్ పరంగా వాళ్ళ మధ్య మళ్ళీ అనూహ్యమైన పోటీ కూడా ఉంది. అయితే ప్రస్తుతం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Icon Star Allu Arjun) మినహా, మిగిలిన మెగా హీరోలందరూ డిజాస్టర్ ఫేస్ లో ఉన్నారు. గత రెండేళ్ల నుండి ఇదే పరిస్థితి నడుస్తుంది. మెగా ఫ్యామిలీ నుండి విడుదలైన చివరి సూపర్ హిట్ చిత్రం సాయి ధరమ్ తేజ్ నటించిన ‘విరూపాక్ష’. 2023 వ సంవత్సరం లో విడుదలైన ఈ చిత్రం కమర్షియల్ గా పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యింది. ఇక ఆ తర్వాత పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) నుండి వచ్చిన ‘బ్రో’, ‘హరి హర వీరమల్లు’, చిరంజీవి(Megastar Chiranjeevi) నుండి వచ్చిన ‘భోళా శంకర్’, రామ్ చరణ్(Global Star Ram Charan) నుండి వచ్చిన ‘గేమ్ చేంజర్’ చిత్రాలు దారుణమైన ఫ్లాప్స్ గా నిలిచాయి.
Also Read: ఓ కూతురు, ఒక చెల్లి, ఒక స్నేహితురాలు.. హీరోలను మించిన శ్రీలీల గొప్పతనం!
దీంతో మెగా ఫ్యాన్స్ మొత్తం ఇప్పుడు చాలా కసి మీద ఉన్నారు. సెప్టెంబర్ 25 న విడుదల కాబోతున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘ఓజీ'(They Call Him OG) చిత్రం తో ఎలా అయినా కుంభస్థలం బద్దలు కొట్టాలని బలంగా కోరుకుంటున్నారు. ఇప్పటి వరకు ఈ చిత్రం నుండి విడుదలైన ప్రతీ ప్రమోషనల్ కంటెంట్ సెన్సేషనల్ హిట్ గా నిలిచి సినిమా పై అంచనాలను అమాంతం పెంచేలా చేశాయి. ఈ నెల ప్రారంభం లో విడుదల చేసిన ‘ఫైర్ స్ట్రోమ్’ పాట ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ పాట ట్రెండింగ్ లో ఉండగానే నేడు ఈ చిత్రం నుండి ‘సువ్వి సువ్వి’ అనే మెలోడీ సాంగ్ విడుదలైంది. ఈ పాట కి కూడా ఫ్యాన్స్, ఆడియన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. పవన్ కళ్యాణ్ ని చాలా కాలం తర్వాత రొమాంటిక్ యాంగిల్ లో చూపించారని, ఇది కదా మేము ఆయన నుండి కోరుకున్నది అంటూ ఫ్యాన్స్ పొగడ్తలతో ముంచి ఎత్తుతున్నారు.
సినిమాని ఏ యాంగిల్ లో చూసినా సూపర్ హిట్ కల కనిపిస్తుంది. ఈ సినిమా సూపర్ హిట్ అయితే మెగా ఫ్యాన్స్ లో సరికొత్త జోష్ వస్తుందని. ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవి నుండి రాబోయే ‘మన శంకర వరప్రసాద్ గారు’, ‘విశ్వంభర’ చిత్రాలు, అదే విధంగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘పెద్ది’ వంటివి ఓజీ సక్సెస్ స్ట్రీక్ ని ముందుకు తీసుకెళ్తాయి అనే నమ్మకం తో ఉన్నారు ఫ్యాన్స్. ఈ సినిమాలు కూడా చూస్తుంటే చాలా ప్రామిసింగ్ గా ఉన్నాయి. మెగా ఫ్యామిలీ మళ్ళీ ఫుల్ ఫార్మ్ లోకి వచ్చి తమ ఆధిపత్యాన్ని టాలీవుడ్ లో మరోసారి చూపించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు.