సినిమా అంటేనే కోట్ల వ్యాపారం.. మరి ఆ వ్యాపారానికి డ్రైవర్ లాంటి వాడు డైరెక్టర్. అందుకే డైరెక్షన్ అంటే సవాలక్ష టెన్షన్లు ఉంటాయి, అవమానాలు, చికాకులు ఉంటాయి. ముఖ్యంగా అనుకున్న బడ్జెట్ కంటే ఎక్కువ ఖర్చు పెటించాల్సిన సందర్భంలో దర్శకుడు చాల నలిగిపోతాడు. ఒక్కోసారి సినిమా క్వాలిటీ కోసం తన రెమ్యునరేషన్ ను కూడా వదులుకుంటాడు.
ఇంత చేసిన డైరెక్టర్ కి చివరకు ఆ సినిమా హిట్ అయితేనే అతనికి లైఫ్. అందుకే, డైరెక్టర్ అనేవాడు ఎప్పుడు ఏదొక భయంతో బతుకుతూ ఉంటాడు. ఇన్నీ ఉన్నా డైరెక్టర్ అంటే అందరినీ కలుపుకుని ముందుకు పోవాలి. కానీ ఒక డైరెక్టర్ కి కాస్త కోపం ఎక్కువ. మనిషి మంచోడే. కానీ ఎవరికీ క్రెడిట్ ఇవ్వడానికి ఇష్టపడదు. సాంగ్స్ మ్యూజిక్ డైరెక్టర్ ఇచ్చినా నేనే కష్టపడి కొట్టించుకున్నాను అంటాడు.
అసలు సినిమా చేస్తోందే మార్కెట్ ఉంటుందో ఊడుతుందో తెలియని ఓల్డ్ హీరోతో. ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు కాస్త జాగ్రత్తగా బడ్జెట్ లో సినిమా చేయడానికి ప్లాన్ చేసుకోవాలి. కానీ, టీజర్ కి ఏభై మిలియన్ల వ్యూస్ వచ్చాయి అని, అనుకున్న బడ్జెట్ కంటే పదిహేను కోట్లు ఎక్కువ పెట్టిస్తున్నాడు ఆ ఊర మాస్ దర్శకుడు. చెబితే వినడు. తిడితే హీరోకి పోయి చాడీలు చెబుతాడు.
దాంతో ఏమి చేయాలో పాపం ఆ నిర్మాతకు అర్ధం కావడం లేదు. కూల్ గా ఆ దర్శకుడికి చెప్పి చూద్దాం అని ఆ నిర్మాత ట్రై చేసినా ఆ దర్శకుడు వినేలా లేడు. పైగా బడ్జెట్ విషయం గురించి మాట్లాడటానికి వెళ్తే.. కావాలని తన డిపార్ట్ మెంట్ జనాల మీద కస్సు బుస్సులాడుతూ బూతులు తిడుతున్నాడు. ఇక ఆఫీసు బాయ్ దగ్గర నుంచి మేనేజర్ వరకు ఎవర్నీ వదలకుండా హేళన చేస్తూ నానామాటలు అంటున్నాడు.
దాంతో ఆ నిర్మాత ప్రస్తుతం అతన్ని ఏమి అనకుండా, అతను ఆడినంత పెడుతూ పోతున్నాడు. రేపు సినిమా రిలీజ్ అయ్యాక రిజల్ట్ తేడా కొట్టి, నష్టాలూ వస్తే… అప్పుడు.. అప్పుడు ఆ మాస్ డైరెక్టర్ ను అఫీస్ లో పడేసి చితక్కొడతాను అంటూ ఆ నిర్మాత ఇప్పటికే తన మేనేజర్ల దగ్గర ఓపెన్ అయిపోయాడు. మరి చివరకు ఏమి జరుగుతుందో చూడాలి.