https://oktelugu.com/

HanuMan: బడా హీరోల ముందు సజ్జా హనుమాన్ సినిమా నిలబడుతుందా?

స్టార్ హీరోలతో చిన్న హీరో, చిన్న సినిమా పోటీ పడడంతో అసలు హనుమాన్ సినిమా సక్సెస్ అవుతుందా లేదా అనే సందేహాలు వస్తున్నాయి. ఇక గుంటూరు కారం సినిమాతో మహేష్ బాబు, సైంధవ్ సినిమాతో వెంకటేష్, నా సామిరంగా...

Written By:
  • Neelambaram
  • , Updated On : January 8, 2024 / 04:50 PM IST
    Follow us on

    HanuMan: సంక్రాంతి సందర్బంగా ప్రస్తుతం ఐదు సినిమాలు బరిలో దిగనున్నాయి. ఈ పండుగ సందర్భంగా వచ్చే హీరోలు మరోసారి తమ లక్ ను పరీక్షించుకునే పనిలో పడ్డారు. అయితే తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగకు వచ్చే సినిమాలను ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్లాన్ చేస్తుంది చిత్ర యూనిట్. ఇక ఈ సారి అదే క్రమంలో వచ్చాయి సినిమాలు. ఇందులో ముగ్గురు స్టార్ హీరోలు ఉన్నారు. మరి స్టార్ హీరోలతో పోటీ పడడం అంటే చిన్న హీరోలకు కత్తి మీద సాము వంటిది. కానీ హీరో సజ్జ మాత్రం స్టార్ హీరోలతో పోటీ పడటానికి ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.

    స్టార్ హీరోలతో చిన్న హీరో, చిన్న సినిమా పోటీ పడడంతో అసలు హనుమాన్ సినిమా సక్సెస్ అవుతుందా లేదా అనే సందేహాలు వస్తున్నాయి. ఇక గుంటూరు కారం సినిమాతో మహేష్ బాబు, సైంధవ్ సినిమాతో వెంకటేష్, నా సామిరంగా తో నాగార్జున ప్రేక్షకులను అలరించడానికి సంక్రాంతి కానుకగా వస్తున్నారు. వీరితో పోటీ తట్టుకోవడం అంటే కాస్త కష్టమే. కానీ హనుమాన్ ట్రైలర్ విడుదలైన దగ్గర నుంచి సినిమాపై అంచనాలు పెరిగాయి. అంతేకాదు సజ్జా మంచి కంటెంట్ తో వస్తున్నాడని టాక్.

    హనుమాన్ సినిమాకు బడా హీరోల సపోర్ట్ కూడా దక్కుతుంది. ఇప్పటికే రవితేజ, చిరంజీవిల సపోర్ట్ వచ్చింది. త్వరలోనే జూ. ఎన్టీఆర్ కూడా తోడు అవనున్నాడని టాక్. వీరి అండతో పాటు కంటెంట్ కూడా బాగుందనే టాక్ తో కచ్చితంగా సినిమా హిట్ అవుతుందంటున్నారు నెటిజన్లు. ఇక చిన్న సినిమా అయినా కంటెంట్ బాగుంటే హిట్ అవడం పక్కా. ఎందుకంటే కాంతార,డీజే టిల్లు వంటి చిన్న సినిమాలు ఏ రేంజ్ లో హిట్ ను సంపాదించాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కేవలం కంటెంట్ తోనే ఈ రెండు సినిమాలు భారీ హిట్ ను సొంతం చేసుకున్నాయి. ఏకంగా కాంతార సినిమా పాన్ ఇండియా రేంజ్ లో హిట్ ను సొంతం చేసుకుంది. వీటిని ఉదాహరణగా తీసుకుంటూ.. కచ్చితంగా హనుమాన్ సినిమా కూడా హిట్ అవుతుందంటున్నారు సజ్జా అభిమానులు. మరి చూడాలి ఈ సినిమా ఎలాంటి ఫలితాలను సొంతం చేసుకుంటుందో…