Oscars 2022 Winners: ‘వెండితెర’కు ఆస్కార్ అవార్డ్ ఓ కలల స్వప్నం. ప్రపంచ సినీ లోకంలో ఆస్కార్ ఓ తిరుగులేని రారాజు. అందుకే సినిమా గాలి పీల్చుకున్న ప్రతి ఒక్కరూ ఒక్కసారైనా ఆస్కార్ అవార్డ్ ను అందుకోవాలని, కనీసం ఆస్కార్ కోసం పోటీపడాలని.. ఒకవేళ ఆ పోటీలో ఆస్కార్ గెలిస్తే, ఇక జీవితం ధన్యమై పోయిందని భావిస్తుంటారు. మొత్తమ్మీద అందమైన అబద్దపు సామ్రాజ్యంలో ఆస్కార్ అందమైన యువరాణిలా అందర్నీ ఊరిస్తూ ఉంటుంది.
ఆస్కార్ అంత అత్యంత ప్రతిష్ఠాత్మకమైనది కాబట్టే… నటీనటులు, సాంకేతిక నిపుణులు ఆస్కార్ కోసం అంతగా పరితపిస్తూ ఉంటారు. అయితే, కాగా లాస్ ఏంజెల్స్‌లోని డాల్బీ థియేటర్‌లో జరిగిన 94 వ అకాడమీ అవార్డుల వేడుకలో వివిధ విభాగాల్లో ఇద్దరు ఆస్కార్ అందుకున్నారు. ఒకరు… రెండు సార్లు ఆస్కార్ ఉత్తమ నటుడిగా నామినేట్ అయి విజేతగా నిలవలేకపోయారు.

మరొకరు… ఓసారి ఉత్తమ నటిగా నామినేషన్ అందుకున్నా అవార్డు అందుకోలేకపోయారు. అయితే, ఎట్టకేలకు వాళ్ళు ఆస్కార్ అందుకున్నారు. వారెవరో కాదు విల్‌స్మిత్, జెస్సికా ఛస్టెయిన్. ‘వేర్‌ది డే టేక్స్ యు’ అనే చిత్రంతో తెరంగేట్రం చేసిన విల్‌స్మిత్ ర్యాప్ సింగర్, నిర్మాతగానూ తనదైన ముద్రవేశాడు. ‘మేడ్ ఇన్ అమెరికా, నుంచి ‘ఐయామ్ లెజెండ్, ‘అలాద్దీన్’ వరకు ఎన్నో వైవిధ్య చిత్రాల్లో నటించి మెప్పించాడు.
Also Read: Naga Shaurya Teaser Talk: టీజర్ టాక్ : ఆకట్టుకున్న “కృష్ణ వ్రింద విహారి టీజర్ !
ప్రపంచ వ్యాప్తంగా అభిమానుల్ని సంపాదించుకున్న విల్‌స్మిత్ ఆండ్రూ గార్‌ఫేల్డ్ బెనిడిక్ట్ కంబర్ బ్యాచ్, జేవియర్ బార్జెమ్, డెంజిల్ వాషింగ్దన్‌ను వంటి దిగ్గజ
నటులను వెనక్కినెట్టి ‘కింగ్ రిచర్డ్ సినిమాలోని నటనకు ఆస్కార్ సాధించడం విశేషం. ప్రపంచం మెచ్చిన టెన్నిస్ క్రీడాకారిణులు వీనస్, సెరీనా విలియమ్స్ తండ్రి కోచ్ రిచర్డ్ విలియమ్స్ జీవిత కథతో రూపొందిన చిత్రమిది. ఆస్కార్ అందుకున్న మరో నటి జెస్సికా ఆమె కూడా తన నటనతో ఆస్కార్ అందుకుంది. గతంలో రెండు సార్లు ఆస్కార్ మిస్ అయినా ఈ సారి ఆమె ఆ ఘనతను సాధించింది.
Also Read: RGV Tweets On Rajamouli: రాజమౌళి.. నువ్వు ప్రేక్షకులకు దొరికిన బంగారం !
Recommended Video: