Homeఎంటర్టైన్మెంట్Naga chaitanya Samantha: సామ్, చైతన్య మళ్ళీ కలుస్తారా.. జాతకాల్లో అదే ఉందా?

Naga chaitanya Samantha: సామ్, చైతన్య మళ్ళీ కలుస్తారా.. జాతకాల్లో అదే ఉందా?

Naga chaitanya Samantha: తెలుగు ఇండస్ట్రీలో లవ్లీ కపుల్‌గా చెప్పుకునే సమంత-నాగచైతన్య తమ వైవాహిక బంధానికి స్వస్తి పలికిన విషయం తెలిసిందే. దీంతో గత కొన్నిరోజుల నుంచి వాళ్లిద్దరే తెలుగు రాష్ట్రాల్లో హాట్‌ టాపిక్‌గా మారారు. టాలీవుడ్ మోస్ట్ బ్యూటీఫుల్ కపుల్‌గా ఫుల్ పాపులారిటీ అయింది ఈ జోడీ. కానీ విధిరాత అనుకోవాలో లేక వ్యక్తిగత అభిప్రాయం అనుకోవాలో తెలియదు గానీ నాలుగేళ్ల ఈ వివాహ బంధానికి ఉన్నట్టుండి బ్రేక్ పడింది.ఇక వీరిద్దరూ భవిష్యత్తులో ఎలా ఉండబోతున్నారు. అసలు ఇలా కావడానికి కారణాలు ఏంటి ? రెండో పెళ్లి అనే మాట వీరి జీవితాల్లో ఉందా? అనే విషయాలు ప్రస్తుతం సందేహాలుగా మిగిలాయి.

ప్రముఖ జ్యోతిష్యులు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ వీరి జాతకాల ప్రకారం వారి యొక్క స్థితి ఎలా అనే విషయాలను ఈ విధంగా వివరించారు. ఇకపోతే నాగచైతన్య జాతకం ప్రకారం జన్మించినటువంటి నక్షత్రం ఆశ్లేష నక్షత్రం. కర్కాటక రాశి లగ్నం తులా లగ్నం. ఇక లగ్నాధిపతి లగ్నంలో ఉండగా నవమాధిపతి బుధుడు అనగా ఈ కాంబినేషన్ అంటే శుక్ర బుధ కాంబినేషన్ జన్మతః ధనిక కుటుంబంలో జన్మించి వ్యక్తి లక్షణంగా చెప్పవచ్చు. ఇక్కడ లగ్నాధిపతి భాగ్యాధిపతి కలిసి జన్మ లగ్నం లో శుభ స్థితిలో ఉండగా జన్మించినటువటి వ్యక్తి ఒక చక్కటి వ్యక్తిత్వం ఉన్నటువంటి ఉన్నటువంటి వ్యక్తిగా చెప్పవచ్చు. ఇక జాతకరీత్యా చూసుకున్నట్లయితే ప్రధానంగా లగ్నంతో వివాహ అధిపతి పంచమ స్థానం సెవెంత్ లార్డ్ ఫిఫ్త్ క్లాస్ లో ఉండటం. సిక్స్త్ లార్డ్ తో కలిపి సెవెంత్ లార్డ్ కలిగి ఉండటం. అలాగే జాతకరీత్యా దశమాధిపతి దశమ స్థానంలో ఉండటం ప్రధానమైనవి.

ఇవి నాగచైతన్య జాతకంలో ఉన్నందువలన అతని ఉన్నతమైన జీవనశైలి విధానాన్ని సూచిస్తుంది. అయితే ఇక్కడ లగ్నాధిపతి లగ్నంలో ఉండి మిత్రాధిపతి బుధునితో కలసి ఉండడం ప్రధానంగా చెప్పుకోదగిన విషయం. అదేమిటంటే మృదుస్వభావిని సూచించే టటువంటి సంబంధం. ఫ్యామిలీ అంటే బాగా ఇష్టపడతారు. నందమూరి తారక రామారావు జాతకం కూడా చూసుకున్నట్లయితే లగ్నము తులా లగ్నం. తులా లగ్నం అనేది సాధారణంగా దాంపత్య కారకుడు వివాహ కారకుడైన శుక్రునికి సంబంధించింది. కాబట్టి ఫ్యామిలీ అన్నా.. ప్రేమించే స్వభావం అన్నా ప్రాధాన్యత ఇస్తారు. అందుకే చాలా మృదుస్వభావిగా ఇండస్ట్రీలో అందరి చేత మంచివాడిగా చెప్పుకోవడానికి జన్మతః ఇదే కారణం. అయితే సహజంగా కొన్ని లోపాలు అనేవి ఈ నాగచైతన్య జాతకంలో ఉన్నాయి. ఇది గత జన్మలో చేసిన కర్మ దోషాలకి సంబంధించినటువంటిది.

సమంత జాతకరీత్యా జన్మలగ్నం చూసుకున్నట్లయితే లగ్నం సింహ లగ్నం. ఇక రాశి మేష రాశి భరణి నక్షత్రం. ఇది గమనించినట్లయితే లగ్నాత్తు లగ్నాధిపతి ఉచ్ఛస్థితిని పొందినప్పటికీ ఇక్కడ ప్రధానంగా దనాధిపతితో కలిసి ఉన్నప్పటికీ కష్టపడి పైకి వచ్చేటటువంటి స్వభావంగా సమంత స్వభవంగా చెప్పవచ్చు. లగ్నాత్తు గురు శుక్ర స్థానాలు అష్టమంలో ఉండటం అనేది ప్రధాన శని దోషం అని చెప్పవచ్చు. ఇక ఈ అమ్మాయి జాతకంలో ఏమిటి లోపాలు అని చూసుకున్నట్లయితే శని భగవానుడు రుజుమార్గం కాకుండా దుర్మార్గం కాకుండా వ్యతిరేక మార్గంలో ప్రయాణిస్తున్న టువంటి సంబంధం.

ఇక ఈ ఇద్దరి జాతకాలు కలుస్తాయా లేదా అని చూసుకున్నట్లయితే నాగ చైతన్య జన్మించినటువంటి లగ్నం తులా లగ్నం . సమంతది సింహలగ్నం . అనగా సింహ లగ్నానికి అధిపతి రవి అలాగే తులాలగ్నానికి అధిపతి శుక్రుడు. రవి శుక్రుల కలయిక హార్మోనియం సూచించదు. అందుకనే పెద్దలు చెప్తుంటారు ఆదివారం నాడు ఉసిరికాయ తినకూడదు అని. ఇక వీరిద్దరి కాంబినేషన్ చూసుకున్నట్లయితే తులా లగ్నము సరి అయినది కాదు. నాగచైతన్య శని వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి. సమంత గురు లగ్నానికి సంబంధించినటువంటి వ్యక్తి. కాబట్టి ఏ గ్రూపులో ఉన్న వారికి ఆ గ్రూప్లో ఉన్న వారికి వివాహం జరగడం అనేది ఆచారం. కాబట్టి వేరే గ్రూపులో ఉండడంవల్ల వివాహ బంధం అనేది ఆకర్షణీయంగా ఉండదు. ఇక్కడ రెండు విభిన్నమైనటువంటి వ్యక్తులు ప్రేమించుకుంటున్నారు అంటే స్నేహంలో ఉన్నారు అని అర్థం. ఒకరి లక్ష్యాన్ని ఇంకొకరు గౌరవించడం. ఒకరి కోసం ఒకరు ఎదురు చూడడం సహజం అయినటువంటి స్వభావం. కానీ ఆ రెండు విభిన్నమైన ఇటువంటి వ్యక్తులు కలవడం వలన వచ్చేటటువంటి రియాక్షన్ మాత్రం విభిన్నంగా ఉంటుంది. ఇక్కడ వారిద్దరి మధ్య ఆకర్షణ కలిగి ఉంది. అంటే దాని అర్థం సమంతది మేష రాశి నాగచైతన్య రాశి కర్కాటక రాశి. కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు మేష రాశికి అధిపతి కుజుడు. చంద్రుడు, కుజుడు స్నేహ స్వభావం కలిగి ఉన్నటువంటి వ్యక్తులు. కాబట్టి వారిద్దరూ స్నేహ బంధానికి కలిసి ఉండటానికి దోహదం చేసింది తప్ప వివాహబంధానికి కలిసి రాలేదు. సమంత జాతకరీత్యా ఈ కారణంగానే ఆమె వివాహం తర్వాత మామూలు తారగా ఉన్నటువంటి ఆమె అగ్రతారగా వెలుగొందింది.

నాగ చైతన్య జాతకం చూసుకున్నట్లయితే అతని యొక్క జాతకంలో కాలసర్పదోషం ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. అన్నిటికంటే ముఖ్యమైన విషయం పిత్రు శాపం-పితృ దోషం, నాగ దోషం చైతన్య జాతకంలో ఉంది. ఇక సమంత జాతకరీత్యా కర్కాటక సింహ లగ్నంలో ఉన్న వారు వివాహబంధాన్ని ఎంజాయ్ చేయలేరు. అందుకే దాదాపుగా సమాజసేవ చేసేటటువంటి వారు ఈ లగ్నంలో జన్మించినవారై ఉంటారు. ఇప్పటివరకూ వంద నుంచి 80 శాతం వరకు ఇలాంటి వివాహ సంబంధంలో బాధపడుతున్నవారే. ఇక గమనించినట్లయితే సింహ లగ్నానికి ఒక మైనస్ పాయింట్. ఒక రాజు లాంటి తత్వం . రాణి ఇలాంటి తత్వం. తొందరగా ఎవరితోనూ కలవ లేని స్థితి. ఉన్నటువంటి కొద్దిపాటి ఫ్రెండ్స్ తో అన్ని విషయాలను షేర్ చేసుకోవడం. అన్నిటికంటే ప్రధానం గా ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది ఉంటుంది. ఇక్కడ సింహలగ్నం అనేది ఆ స్థితిని సూచిస్తుంది. కొన్నిసార్లు తప్పుడు నిర్ణయాలు తీసుకొని జీవితంలో ఇబ్బంది పడుతూ కూడా ఉంటారు. జన్మలగ్నం యోగ కరమైనది కాకపోయినప్పటికీ కూడా త్వరగా నిర్ణయాలు తీసుకోవడం అంటే ముందు వెనుక ఆలోచించకుండా నిర్ణయం తీసుకోవడం.

ఇక ప్రధానమైనవి అష్టమాధిపతి అష్టమంలో ఉండి గురుచండాల స్థితిలో పొందటం. ఇది ఉండటం వలన జీవితంలో మామూలుగా తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం, ఇబ్బందులు ఎదుర్కోవడం జరగడం ఉంటుంది. అందుకే ఇక్కడ దైవం కూడా కాపాడలేని నిర్ణయాలు జరుగుతూ ఉంటాయి. ఇక మాంగల్య కారకుడైన శుక్రుడు కూడా మాంగల్య స్థానంలో ఉండటం శుభ కారణం. కాబట్టి వివాహానంతరం కూడా ఈ అమ్మాయికి కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందని ఇప్పటికే చాలా మంది చెప్పి ఉంటారు. దీనికి కారణం యోగకారకుడైన శుక్రుడు కుజుడు అంశ స్థితిలో ఉన్నారు. ఈ కారణం చేత అమ్మాయి జాతకరీత్యా వివాహానంతరం కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. సమంత వివాహం సరైన టైం లోనే జరిగింది. కానీ అదే నాగ చైతన్య విషయానికొస్తే అతను జాతకరీత్యా అది సరైన సమయం కాదు.

ఇక పరిహారం విషయానికి వస్తే వీరు జాతకరీత్యా రెండు కూడా గమనించినట్లైతే ఈ రెండూ కూడా సరిగ్గా కలవలేనటువంటి జాతకాలు. ఎందుకంటే ఇక్కడ ఆకర్షణ అనేది తక్కువగా ఉంటుంది. యాక్షన్ ఎక్కువ. అంటే ఇక్కడ సింహ లగ్నానికి సొంతంగా నిర్ణయాలు తీసుకునే అటువంటి స్వభావం ఎక్కువ. ఫ్యామిలీకి సంబంధించినటువంటి వ్యక్తిత్వం చైతన్యది. జాతకంలో దీని కారణంగానే సమంత బోల్డ్ సినిమాలు చేసి తన యొక్క ఇమేజ్ పెంచుకోవడానికి ముఖ్య కారణం. సమంతాకి ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోవడం ఇతర ప్రధాన సమస్యగా తోస్తోంది.

కాబట్టి వీరిద్దరి జాతకరీత్యా ద్వితీయ వివాహం ద్వంద సంబంధాలు అనేది కామన్ గా గోచరిస్తున్నాయి. కానీ వీరి యొక్క భవిష్యత్తులో మాత్రం సమంత కొన్ని ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుందని సూచిస్తుంది. అలాగే నాగ చైతన్య కూడా కెరీర్ లో మంచి స్థానంలో ఉంటున్నట్టు తెలుస్తోందని ఆయన వివరించారు .

Kusuma Aggunna
Kusuma Aggunnahttps://oktelugu.com/
Kusuma Aggunna is a Senior Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.
RELATED ARTICLES

Most Popular