Bro Movie Teaser: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘బ్రో ది అవతార్’ వచ్చే నెల 28 వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదల అవ్వబోతున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఇప్పటి వరకు ఈ సినిమాకి సంబంధించి కేవలం ఒక్క మోషన్ పోస్టర్ తప్ప, మిగతా ప్రమోషనల్ కంటెంట్ ఏమి కూడా విడుదల కాలేదు. మరోపక్క ఈ సినిమాకి సంబంధించిన టీజర్ కోసం ఫ్యాన్స్ ఎప్పటి నుండో కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు.
మరో వారం రోజులు గడిస్తే ఈ చిత్రం విడుదలకు కేవలం నెల రోజులు మాత్రమే ఉంటుంది. అభిమానుల్లో టెన్షన్ మొదలైంది, ఎందుకంటే పవన్ కళ్యాణ్ సినిమా విడుదలకు రెండు నెలల ముందే టీజర్ కానీ , గ్లిమ్స్ వీడియో కానీ విడుదల చేస్తుంటారు మేకర్స్, కానీ ఈ చిత్రం విషయం లో మాత్రం అలా జరగడం లేదు.
బయట చాలామంది అభిమానులకు ‘బ్రో’ అనే సినిమా ఒకటి ఉందనే విషయం కూడా ఎవరికీ తెలియదు. మెజారిటీ పీపుల్ కి పవన్ కళ్యాణ్ తదుపరి సినిమా ఏమిటి అంటే ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రం పేరు కానీ, లేదా ‘హరి హర వీరమల్లు’ చిత్రం పేరు కానీ చెప్తుంటారు. ఇప్పుడు లేటెస్ట్ గా వినిపిస్తున్న టాక్ ఏమిటంటే ఈ సినిమాకి సంబంధించిన టీజర్ ని పది రోజుల తర్వాతే విడుదల చేస్తారట.
టీజర్ కట్ అయితే సిద్దంగానే ఉంది కానీ, పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ లో ‘వారాహి విజయ యాత్ర’ చేస్తుండడం వల్ల , ఆయన యాత్ర మొదటి విడత పూర్తి అయ్యే వరకు విడుదల చెయ్యకూడదని మేకర్స్ అభిప్రాయమట. పవన్ కళ్యాణ్ ‘వారాహి విజయ యాత్ర’ మొదటి విడత ఈ నెల 24 వ తారీఖున పూర్తి అవుతుంది, ‘బ్రో’ టీజర్ నెలాఖరున వచ్చే ఛాన్స్ ఉందని అంటున్నారు, చూడాలి మరి.