Mana Shankara Vara Prasad Garu collection tsunami: తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి ని మించిన నటుడు ఇంకెవరు లేరనేది వాస్తవం…గత 50 సంవత్సరాల నుంచి మెగాస్టార్ అనే హోదాకి న్యాయం చేస్తూ వస్తున్న ఆయన ఇప్పటివరకు చేసిన సినిమాలన్నింటితో తనకంటూ ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసుకున్నాడు. ఇకమీదట చేయబోతున్న సినిమాల విషయంలో కూడా ఆయన తగు జాగ్రత్తలు తీసుకుంటు ముందుకు సాగుతుండటం విశేషం… రీసెంట్ గా మన శంకర వరప్రసాద్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే ఈ సినిమా తెలుగులో తన సత్తా చాటుతూ ముందుకు దూసుకెళ్తుంది. కన్నడ సినిమా ఇండస్ట్రీలో సైతం ఈ సినిమాకి భారీ కలెక్షన్స్ అయితే కొల్లగొడుతున్నట్టుగా తెలుస్తుంది… 8 కోట్లు చెల్లించి మరి ఈ రైట్స్ ని ఒక ప్రొడక్షన్ హౌస్ దక్కించుకుంది.
ఇక దానికి తగ్గట్టుగానే మొదటి రోజు నుంచి కూడా ఈ సినిమా కలెక్షన్ల వర్షాన్ని కురిపిస్తుంది. మొదటి రోజు పాజిటివ్ టాక్ ను సంపాదించుకోవడంతో ఫ్యామిలీ ఆడియన్స్ మొత్తం ఈ సినిమాను చూడడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఇక ఇప్పటివరకు కన్నడలో ఈ సినిమా 18 కోట్లకు పైన కలెక్షన్స్ ని రాబట్టడం విశేషం…
ఇక రాబోయే రోజుల్లో కూడా ఈ సినిమాకి మంచి ఆదరణ దక్కుతుంది. కాబట్టి 25 నుంచి 30 కోట్ల వరకు కలెక్షన్స్ ని రాబట్టే అవకాశాలు ఉన్నట్టుగా ట్రేడ్ పండితులు తెలియజేస్తున్నారు. ఇక ఏది ఏమైనా కూడా మన తెలుగులోనే కాకుండా కన్నడలో కూడా తన సత్తా చాటుతూ ముందుకు దూసుకెళ్తుండటం విశేషం…
చిరంజీవి గత సినిమాలకు అంత పెద్దగా కలెక్షన్స్ అయితే రాలేదు. అయినప్పటికి కన్నడలో ఈ సినిమా కలెక్షన్ల వర్షాన్ని కురిపించడం అనేది ప్రతి ఒక్కరిని అక్షరానికి గురిచేస్తుంది. ఇక మొత్తానికైతే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 300 కోట్లకు పైన కలెక్షన్స్ ను కొల్లగొడుతూ ముందుకు దూసుకెళుతుండడం విశేషం…
