https://oktelugu.com/

Mahesh- Trivikram Movie: ఎనిమిది నెలల్లో త్రివిక్రమ్ వల్ల సాధ్యమేనా..?  మహేష్ సినిమా పై అనుమానులు ఎన్నో ?  

Mahesh- Trivikram Movie: చాలా కాలం తర్వాత త్రివిక్రమ్ – మహేష్ కాంబోలో మూవీ సెట్ అయ్యింది. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కిన అతడు, ఖలేజా మిక్స్డ్ రిజల్ట్ అందుకున్నాయి. కమర్షియల్ గా సక్సెస్ కాకున్నా మహేష్ కెరీర్ లో అతడు క్లాసిక్ అని చెప్పాలి. మహేష్ ని త్రివిక్రమ్ సరికొత్తగా ప్రజెంట్ చేశాడు. ఈ మూవీ టీవీలో ప్రసారమైన ప్రతిసారి జనాలు విసుగు లేకుండా చూస్తారు. కామెడీ, రొమాన్స్, యాక్షన్, ఎమోషన్స్ పర్ఫెక్ట్ గా […]

Written By:
  • Shiva
  • , Updated On : September 14, 2022 / 08:09 AM IST
    Follow us on

    Mahesh- Trivikram Movie: చాలా కాలం తర్వాత త్రివిక్రమ్ – మహేష్ కాంబోలో మూవీ సెట్ అయ్యింది. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కిన అతడు, ఖలేజా మిక్స్డ్ రిజల్ట్ అందుకున్నాయి. కమర్షియల్ గా సక్సెస్ కాకున్నా మహేష్ కెరీర్ లో అతడు క్లాసిక్ అని చెప్పాలి. మహేష్ ని త్రివిక్రమ్ సరికొత్తగా ప్రజెంట్ చేశాడు. ఈ మూవీ టీవీలో ప్రసారమైన ప్రతిసారి జనాలు విసుగు లేకుండా చూస్తారు. కామెడీ, రొమాన్స్, యాక్షన్, ఎమోషన్స్ పర్ఫెక్ట్ గా మిక్స్ చేసి త్రివిక్రమ్ అతడు రూపొందించాడు. ముఖ్యంగా బ్రహ్మాండం కామెడీ సినిమాకు ప్రధాన హైలెట్ గా నిలుస్తుంది.

    Mahesh- Trivikram

    అనంతరం విడుదలైన ఖలేజా పూర్తి నెగిటివ్ టాక్ తెచ్చుకుంది. ప్రశాంతంగా చూస్తే కానీ మూవీ థీమ్ అర్థం కాలేదు. ఖలేజా సైతం ఓ మంచి చిత్రంగా మహేష్ కెరీర్ లో నమోదైంది. ఈ కారణంతోనే ఫ్యాన్స్ ఈ కాంబినేషన్ కోరుకుంటున్నారు.కాగా అనేక కారణాలతో SSMB 28 ఆలస్యం అయ్యింది. ఈ ఏడాది ప్రారంభంలోనే మూవీ సెట్స్ పైకి వెళ్ళాల్సింది. ఓ దశలో ప్రాజెక్ట్ క్యాన్సిల్ అంటూ ప్రచారం జరిగింది. కానీ కొన్ని కారణాల వల్ల పోస్ట్ ఫోన్ అవుతూ మొన్న స్టార్ట్ అయ్యింది. 

    Also Read: Shyam Singha Roy In Oscar Race: ఆస్కార్ బరిలో శ్యామ్ సింగరాయ్.. ఇది తెలుగు సినిమాకే గర్వకారణం

    అయితే, ఇప్పటికే ఈ చిత్ర విడుదల తేదీ ప్రకటించారు. 2023 ఏప్రిల్ 28న SSMB28 విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. అసలు షూటింగ్ కూడా మొదలు పెట్టకుండా రిలీజ్ డేట్ ఫిక్స్ చేసి అందరికీ షాక్ ఇచ్చారు. అందులోనూ అతి తక్కువ సమయం మాత్రమే ఉంది. చెప్పిన ప్రకారం విడుదల చేయాలంటే ఆరు నెలల్లో షూటింగ్ పూర్తి చేయాలి. మరో నెల నెలన్నర కాలంలో పోస్ట్ ప్రొడక్షన్ ముగించాలి. ఓ స్టార్ హీరో మూవీ ఇంత తక్కువ టైం లో కంప్లీట్ అవుతుందా అనే సందేహం కలుగుతుంది. ఇక వీరిద్దరి ట్రాక్ చూస్తే ఈ విషయంలో చాలా పూర్. ఖలేజా చిత్రాన్ని త్రివిక్రమ్ రెండేళ్లకు పైగా షూట్ చేశారు.

    Mahesh- Trivikram

    ఇప్పుడేమో ఎనిమిది నెలల్లో సినిమా విడుదల చేస్తా అంటున్నారు. మరోవైపు వచ్చే ఏడాది ప్రారంభంలోనే మహేష్ తో మూవీ స్టార్ట్ చేస్తానని రాజమౌళి చెప్పడం విశేషం. ఇన్ని సవాళ్ల మధ్య ఏప్రిల్ 28న మహేష్-త్రివిక్రమ్ మూవీ థియేటర్స్ లో దిగడం కష్టమేనని కొందరు అంచనా వేస్తున్నారు. కాగా దర్శకుడు త్రివిక్రమ్ తన ఫేవరెట్ హీరోయిన్ పూజా హెగ్డేను మరోసారి కొనసాగిస్తున్నాడు.

    Also Read:Sukumar -Ajay Ghosh: పుష్ప సినిమా చేయనన్న నటుడు.. తిట్టేసిన సుకుమార్

     

     

    Tags