
Simhadri’ re-release : ఈమధ్య కాలంలో రీ రిలీజ్ ట్రెండ్ పీక్ స్టేజి కి వెళ్లింది. స్టార్ హీరోల కెరీర్ లో మైలు రాయిగా నిల్చిన చిత్రాలను రీ రిలీజ్ చేస్తూ,దానికి వచ్చిన వసూళ్లను మంచు పనులకు ఉపయోగించడం అనే ట్రెండ్ పోకిరి సినిమా నుండి ప్రారంభమైంది. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ జల్సా సినిమాతో ఇది తారాస్థాయికి చేరింది.అయితే రీ రిలీజ్ అయినా ప్రతీ చిత్రం సూపర్ హిట్ కాలేదు.పోకిరి , జల్సా , ఖుషి , ఆరెంజ్ సినిమాలు మాత్రమే ఈ ట్రెండ్ లో గ్రాండ్ సక్సెస్ అయ్యాయి.
మిగిలిన సినిమాలు అంతంత మాత్రం గానే ఆడాయి.ఇప్పటి వరకు అందరి హీరోల సినిమాలు రీ రిలీజ్ అయ్యాయి కానీ ఒక్కటి కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఖుషి రీ రిలీజ్ గ్రాస్ రికార్డ్స్ ని బద్దలు కొట్టలేకపోతారు.దానికి మొదటి రోజు వచ్చిన వసూళ్లను ఫుల్ రన్ లో కూడా అందుకోలేకపోయ్యాయి కొన్ని సినిమాలు.
అయితే ఇప్పుడు ఖుషి రికార్డ్స్ ని ఛాలెంజ్ చేస్తూ యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరో గా నటించిన ‘సింహాద్రి’ సినిమా ఆయన పుట్టిన రోజు కానుకగా మే 20 వ తారీఖున విడుదల కాబోతుంది.ఈ చిత్రం ఎన్టీఆర్ కెరీర్ లో ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అనేది ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.అప్పట్లో వంద రోజుల కేంద్రాల విషయం లోను, అలాగే 175 కేంద్రాల విషయం లోను ఆల్ టైం రికార్డ్స్ ని సృష్టించింది ఈ చిత్రం.కానీ కలెక్షన్స్ పరంగా మాత్రం అప్పటి ఇండస్ట్రీ హిట్ ఇంద్ర రికార్డ్స్ ని మాత్రం బద్దలు కొట్టలేకపోయింది.
కానీ ఈ చిత్రం ఎన్టీఆర్ కి తెచ్చిన మాస్ ఫ్యాన్ ఫాలోయింగ్ మామూలుది కాదు.అప్పట్లో పడిన మాస్ బేస్ మెంట్ పునాదులు ఇప్పటికీ కదలలేదు.సింహాద్రి చిత్రం రీ రిలీజ్ తో ఖుషి రికార్డ్స్ ని బద్దలు కొట్టేస్తామని,ఎన్టీఆర్ మాస్ పవర్ ఏంటో మరోసారి అందరికీ చూపిస్తాము అంటూ ఫ్యాన్స్ సవాలు విసురుతున్నారు.దీని మీద సోషల్ మీడియా లో బెట్టింగ్స్ కూడా జరుగుతుండడం విశేషం.