Devi Sri Prasad Yellamma movie: బలగం సినిమాతో తనకంటూ ఒక ఐడెంటిటి క్రియేట్ చేసుకున్న దర్శకుడు వేణు ఎల్దండి…బలగం సినిమాతో ఆయన నేషనల్ అవార్డుని సైతం అందుకున్నాడు. అలాంటి వేణు ఎల్దండి గత మూడు సంవత్సరాల నుంచి తన రెండో ప్రాజెక్ట్ ను పట్టాలెక్కించడానికి తీవ్రంగా శ్రమిస్తున్నాడు. తను చేయబోయే ప్రాజెక్టుకి హీరోలు సెలెక్ట్ అవుతున్నారు. మళ్ళీ ఆ కథలను రిజెక్ట్ చేస్తున్నారు. కారణం ఏదైనా కూడా వేణు ఈ సినిమాతో తనను తాను ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరమైతే ఉంది. ఇక ఇప్పుడు ఈ సినిమాలో దేవిశ్రీప్రసాద్ హీరోగా చేస్తున్నాడు అంటూ వార్తలైతే వస్తున్నాయి. దేవి శ్రీ ప్రసాద్ ఏంటి ఈ సినిమాలో హీరోగా చేయడమేంటి అనే డౌట్ అందరిలో కలుగుతోంది. ఇది రెగ్యులర్ గా వచ్చే రొటీన్ లవ్ స్టోరీ అయితే పర్లేదు. కానీ రూరల్ బ్యాక్ డ్రాప్ లో వచ్చే ఈ సినిమాలో హీరోగా దేవి శ్రీ ప్రసాద్ ఎలా చేస్తాడు.
ఎందుకని వేణు ను బుక్ చేస్తున్నారు అంటూ మరికొంతమంది వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. నిజానికి రూరల్ బ్యాక్ డ్రాప్లో సినిమాలు చేయాలంటే గొప్ప నటులు అయితేనే నటించి మెప్పించగలుగుతారు. కానీ దేవిశ్రీప్రసాద్ లాంటి మ్యూజిక్ డైరెక్టర్ ను హీరోగా పరిచయం చేస్తూ ఈ సినిమాని ఎటు తీసుకెళ్తున్నారు అంటూ దిల్ రాజు మీద సైతం కొంతమంది ఫైర్ అవుతున్నారు…
ఈ సినిమాకి మొదట అనుకున్న హీరోలందరూ ఎందుకు హ్యాండివ్వాల్సి వచ్చింది. సినిమా కథలో ఏదైనా ఫాల్ట్ ఉందా? లేదంటే రెమ్యూనరేషన్ విషయంలో దిల్ రాజు ఏదైనా ఇబ్బంది పెట్టాడా? అనే అభిప్రాయాలు కూడా వెలువడుతున్నాయి. మొత్తానికైతే దేవిశ్రీప్రసాద్ ఈ సినిమాకి అసలు సెట్ అవ్వడు అంటూ మరికొంతమంది సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.
ఇక ఈ సినిమా నుంచి తొందర్లోనే టైటిల్ ను అలాగే హీరోని పరిచయం చేస్తూ ఒక గ్లింప్స్ రిలీజ్ చేయబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇక దానికి సంబంధించిన షూట్ సైతం రీసెంట్ గా అల్యూమినియం ఫ్యాక్టరీలో నిర్వహించిన విషయం మనకు తెలిసిందే… ఇక ఈ సినిమాలో దేవి మెప్పిస్తాడా? లేదంటే నటన విషయంలో ఆయన విమర్శలను ఎదుర్కోవాల్సి వస్తుందా అనేది తెలియాల్సి ఉంది…