
మెగాస్టార్ చిరంజీవి తాజాగా ‘ఆచార్య’ మూవీలో నటిస్తున్నాడు. కొరటాల శివ-మెగాస్టార్ కాంబోలో తెరకెక్కుతున్న ‘ఆచార్య’పై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఈ మూవీలో చిరంజీవి డ్యుయల్ రోల్ చేస్తుండగా రాంచరణ్ స్పెషల్ రోల్ చేస్తున్నాడు. చిరు సరసన వెటరన్ బ్యూటీ కాజల్ అగర్వాల్ నటిస్తోంది.
Also Read: కరోనా కంటే.. బాలయ్యే ఎక్కువ భయపెడుతున్నాడు !
‘ఆచార్య’ మూవీ శరవేగంగా జరుగుతున్న క్రమంలోనే కరోనాతో ఈ మూవీ షూటింగ్ నిలిచిపోయింది. ఇటీవలే ‘ఆచార్య’ షూటింగ్ ప్రారంభమైంది. ప్రస్తుతం చిరంజీవి లేకుండా ఈ మూవీ షూటింగ్ కొనసాగుతోంది. ఇటీవలే చిరంజీవికి కరోనా నెగిటివ్ రావడంతో ఆయన కూడా త్వరలోనే ఈ మూవీ షూటింగ్ లో పాల్గొనేందుకు సిద్ధమవుతున్నాడు.
చిరంజీవి అంటే డాన్సులు.. ఫైట్స్ కు ప్రసిద్ధి. ఆయనను మాస్.. క్లాస్ ప్రేక్షకులకు దగ్గర చేసింది కూడా ఇవే. కాగా ఇటీవల చిరంజీవి నటించిన ‘సైరా’లో డాన్సులు లేకపోవడం అభిమానులు లోటుగా కన్పించింది. ఈ లోటును ‘ఆచార్య’ మూవీ తీర్చబోతుందట. చిరంజీవి సినిమాల్లో కన్పించే సిగ్నేచర్ స్టెప్పులు ‘ఆచార్య’లో ఉంటాయని టాక్ విన్పిస్తోంది.
Also Read: హోస్ట్ గా ఒకప్పటి హాట్ హీరోయిన్.. !
ఈమేరకు కొరటాల స్క్రీప్టులో మార్పులు చేర్పులు చేసినట్లు సమాచారం. రెండు మాస్ బీట్లకు సరిపడేలా కొన్ని సీన్స్ రాసుకున్నట్లు తెలుస్తోంది. మణిశర్మ సైతం వీటికి అదిరిపోయే బాణీలను సమకూర్చగా జానీ, శేఖర్ మాస్టర్లు అదిరిపోయే స్టెప్పులు కంపోజ్ చేశారట. ‘ఆచార్య’లో చిరంజీవి మునుపటిలా డాన్స్ చేస్తారని వార్త తెలియడంతో మెగా అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్
Comments are closed.