Mahesh Babu-Balakrishna: తెలుగు సినీ పరిశ్రమలో దర్శకుడు రాజమౌళికి ఉన్న క్రేజీ మామూలుది కాదు. ఆయన చేతిలో పడితే ఏ సినిమా అయినా బంపర్ హిటే. ఎంత బడ్జెట్ అయినా సరే సినిమాను విజయవంతంగా పట్టాలెక్కించడమే ఆయనకు తెలుసు. హీరో ఎవరైనా సరే కథే సుప్రీమ్ గా భావించి తనదైన శైలిలో సినిమాలు నిర్మించడంలో ఆయనకు ఆయనే సాటి. తెలుగు సినిమా ఖ్యాతిని అంతర్జాయతీంగా చాటిన రాజమౌళి ప్రతిభ గురించి వేరే చెప్పనక్కర లేదు. తన ప్రతిభతో సినిమాను అద్భుతమైన కళాఖండంగా తీర్చిదిద్దడం తెలిసిందే.

మొదటి నుంచి ఒక్క సినిమా కూడా గురితప్పకుండా విజయవంతమైన చిత్రాలుగా మలచడంలో ఆయన పని తనం తెలిసిపోతోంది. తన చాతుర్యంతో సినిమాను అగ్రభాగాన నిలపడంలో ఆయనది ప్రత్యేక శైలి. రాజమౌళి-మహేశ్ బాబు కాంబినేషన్ లో ఓ సినిమా నిర్మించేందుకు సిద్ధమవుతున్నారు. ఇది మల్టీ స్టారర్ సినిమా కావడంతో ఇందులో మరో హీరోకు కూడా అవకాశం ఉండటంతో ఇప్పుడు అందరి కన్ను ఆ హీరో ఎవరనే దానిపైనే పడింది.

ఇటీవల ఓ కార్యక్రమంలో కలిసిన బాలయ్య రాజమౌళితో మాట్లాడుతూ తనతో సినిమా ఎప్పుడు తీస్తావని అడిగినట్లు తెలుస్తోంది. దీంతో వీరి కాంబినేషన్ లో సినిమా రావాలని ప్రేక్షకులు కూడా ఆసక్తిగా చూస్తున్నారు. ఈ పాత్రకు బాలయ్యను ఒప్పిస్తారనే ప్రచారం సాగుతోంది. రాజమౌళితో సినిమా చేసే అవకాశం రావాలే గానీ ఎవరైనా ఎగిరి గంతేస్తారు. ఇక బాలయ్య మహేశ్ తో సినిమా చేస్తారా? లేదా అని అందరిలో అనుమానాలు వస్తున్నాయి.
Also Read: ఆమె టచ్ తో మహేష్ బాబు పొగరు అణిచివేయబడిందా?
కానీ స్టార్ డైరెక్టర్ కావడంతో ఆయనతో సినిమా చేసే అవకాశాన్ని చేజార్చుకోరని మరో వాదన కూడా వస్తోంది. ఈ నేపథ్యంలో రాజమౌళి ఆ పాత్రకు ఎవరిని ఎంపిక చేస్తారో తెలియడం లేదు. మహేశ్ బాబుతో సినిమా చేసే సమయం ఇంకా బాగానే ఉండటంతో ఇప్పుడే నిర్ణయం తీసుకోవడానికి సిద్ధపడటం లేదు. కానీ రాజమౌళి ఆఫర్ ఇస్తే మాత్రం బాలయ్య కచ్చితంగా ఓకే చెబుతారని తెలుస్తోంది.
రాజమౌళితో సినిమా చేయాలనే ఉద్దేశం తెలుగు సినీ పరిశ్రమలో అందరిలో ఉంది. ఆయన పాత్రలను మలిచే తీరు అద్భుతంగా ఉండటమే దీనికి కారణం. దీంతో ఆయనతో సినిమా చేసేందుకే ఎక్కువ ఇష్టపడతారు. అందుకే ఈ సినిమాలో మరో హీరో పాత్ర కోసం బాలయ్యను ఎంచుకోనున్నట్లు వార్తలు వస్తున్నాయి. కానీ చివరకు ఆ పాత్ర ఎవరిని వరిస్తుందో వేచి చూడాల్సిందే.
Also Read: లక్ష్మీ పార్వతి కంటే ముందే ఆ హీరోయిన్‌ను రెండో పెండ్లి చేసుకోవాలనుకున్న ఎన్టీఆర్.. కానీ!
[…] Also Read: మహేశ్ బాబు సినిమాలో బాలయ్య నటిస్త… […]
[…] Viral Cinema: సినిమా వైరల్ నుంచి ప్రజెంట్ క్రేజీ అప్ డేట్స్ విషయానికి వస్తే.. ప్రముఖ బ్యాడ్మింటన్ ప్లేయర్ ప్రకాశ్ పదుకొణె జీవిత చరిత్రను సినిమాగా తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు ప్రకటించింది కూతురు దీపికా పదుకొణె. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన దీపికా.. ఏ సౌకర్యాలు లేని రోజుల్లో నాన్న బ్యాడ్మింటన్‌లో అద్భుత విజయాలు సాధించారు. ఆయన విజయం వెనుక కష్టాలను కూడా ఈ చిత్రం ద్వారా చూపించాలనుకుంటున్నా అని, ఈ సినిమాను తానే నిర్మిస్తున్నట్లు దీపికా తెలిపింది. […]
[…] Bheemla Nayak: పవర్స్టార్ పవన్ కల్యాణ్, రానా దగ్గుబాటి ప్రధాన పాత్రలో నటిస్తున్న భీమ్లానాయక్ సినిమా నుంచి మరో బిగ్ అప్డేట్ వచ్చింది. సినిమాకు సెన్సార్ పూర్తయినట్లు వెల్లడించింది. సెన్సార్ బోర్డు U/A సర్టిఫికేట్ జారీ చేసినట్లు చిత్ర నిర్మాణ సంస్థల్లో ఒకటైన సితారా ఎంటర్టైన్మెంట్స్ వెల్లడించింది. ఇక భీమ్లా నాయక్ సినిమాను ఈ నెల 25న విడుదల చేయనున్నట్లు ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు నిర్మాతలు. […]
[…] Also Read: Mahesh Babu-Balakrishna: మహేశ్ బాబు సినిమాలో బాలయ్… […]