Allu Arjun : ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో చాలా వైవిద్యమైన మార్పులైతే వస్తున్నాయి. ఇక సగటు దర్శకుడు ఆయన చేసే సినిమాలతో సూపర్ సక్సెస్ లను సాధించడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నారు…ఇక వీళ్లలో కొందరు సక్సెస్ అయితే మరికొందరు ఫెయిల్యూర్స్ ను మూట గట్టుకుంటున్నారు…
తెలుగు సినిమా ఇండస్ట్రీలో అల్లు అర్జున్ తన రేంజ్ ని పెంచుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నాడు. ప్రస్తుతం పాన్ ఇండియాలో పుష్ప 2 సినిమాని సూపర్ డూపర్ సక్సెస్ గా నిలపడమే కాకుండా భారీ కలెక్షన్ల వసూలు చేస్తూ ఇంతకుముందు ఉన్న రికార్డులను కొల్లగొడుతూ ముందుకు సాగుతుంది… ఇక ఏది ఏమైనా కూడా అల్లు అర్జున్ లాంటి నటుడు తెలుగు సినిమా ఇండస్ట్రీకి దొరకడం ఒక గొప్ప వరమనే చెప్పాలి. ఆయన చేసిన నటన అద్భుతం పుష్ప 2 సినిమా కోసం సుకుమార్ పెద్దగా చేసింది ఏమీ లేదు. సినిమా మొత్తం అల్లు అర్జున్ మీదే నడుస్తూ ఉండటం విశేషం… ఆయన హీరోయిజం గానీ, ఆయన మాట్లాడే తీరు, పుష్ప క్యారెక్టర్ లో ఇమిడిపోయిన విధానం అన్ని కూడా సగటు ప్రేక్షకుడికి కిక్కు ఎక్కించాయనే చెప్పాలి. అందుకే ఒకటికి రెండుసార్లు ప్రేక్షకులు ఈ సినిమాను చూస్తూ భారీ సక్సెస్ ని చేస్తున్నారు. ఇక ఏది ఏమైనా కూడా ఈ సినిమా లాంగ్ రన్ లో విపరీతమైన క్రేజ్ ను సంపాదించుకోవడమే కాకుండా భారీ కలెక్షన్లను కూడా కొల్లగొడుతుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఇక ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం అయితే పుష్ప 2 సినిమా బాహుబలి రికార్డును కూడా బ్రేక్ చేయడానికి సిద్ధంగా ఉందనే వార్తలైతే వినిపిస్తున్నాయి.
ఇక నార్త్ లో ఈ సినిమాకి విపరీతమైన క్రేజ్ ఉండడమే కాకుండా అక్కడి ప్రేక్షకులు పుష్ప సినిమాను అలాగే అల్లు అర్జున్ ను ఓన్ చేసుకున్నారు. అందుకే అక్కడ విపరీతమైన కలెక్షన్స్ ని కొల్లగొడుతూ ముందుకు సాగుతుంది. పుష్ప మొదటి పార్ట్ సూపర్ సక్సెస్ అవ్వడంతో దీని మీద మొదటి నుంచి మంచి అంచనాలైతే ఉన్నాయి. మరి ఆ అంచనాలకు తగ్గట్టుగానే ఈ సినిమా సూపర్ సక్సెస్ ని సాధిస్తుంది అంటూ చాలామంది వాళ్ళ అభిప్రాయాలని తెలియజేశారు.
దానికి తగ్గట్టుగానే ఈ సినిమా ఎక్కడ తగ్గకుండా రిలీజ్ అయిన అన్నిచోట్ల విపరీతమైన కలెక్షన్స్ ను రాబడుతుంది. ఇక ఇదిలా ఉంటే జూనియర్ ఎన్టీఆర్ హృతిక్ రోషన్ తో కలిసి చేస్తున్న వార్ 2 సినిమా పుష్ప 2 ఎన్ని రికార్డులను సాధించిన కూడా దాన్ని తిరగరాస్తుంది అంటూ బాలీవుడ్ లో ఉన్న కొంతమంది జనాలు కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఈ న్యూస్ సోషల్ మీడియాలో కూడా వైరల్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు.
మరి పుష్ప 2 సినిమాను దాటుకొని వార్ 2 సినిమా భారీ కలెక్షన్లను సంపాదించాలంటే మాత్రం అది జరగని పని అంటూ కొంతమంది ట్రేడ్ పండితులు సైతం వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. ఎందుకంటే పుష్ప 2 కి మొదటి నుంచి భారీ హైప్ అయితే ఉంది. ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ చేస్తున్నాడు అనే ఒకే ఒక బజ్ తప్ప అంతకుమించి సినిమా మీద అసలు ఏ హైప్ లేదు… సగటు ప్రేక్షకుడికి అసలు వార్ 2 అనే సినిమా ఒకటి ఉందనే విషయం కూడా తెలియదు…