Prabhas: ‘ప్రభాస్’ ది మంచి మనసు, కుటుంబ సభ్యులకు కూడా సాయం చేయడానికి ఆలోచించే ఈ రోజుల్లో.. శత్రువుకి కూడా సాయం చేసే గుణం ఉండటం ప్రభాస్ గొప్పతనం. ఎప్పుడో తనతో ఒక సినిమా చేసి ఏవరేజ్ హిట్ ఇచ్చాడని, పూరి కోసం యాంకర్ గా కూడా మారిపోయాడు ప్రభాస్. మహామహులకు కూడా ఇంటర్వ్యూలు ఇవ్వడానికి ఆలోచించే ప్రభాస్, పూరి కొడుకు ఆకాష్ హీరోగా వస్తున్న ‘రొమాంటిక్’ సినిమా కోసం యాంకర్ గా ఒక ఇంటర్వ్యూ చేశాడు.

ఐతే, ఈ ఇంటర్వ్యూలో ప్రభాస్ తన సెన్సాఫ్ హ్యూమర్ ను బాగా చూపించాడు. ముఖ్యంగా ఈ ఇంటర్వ్యూలో ప్రభాస్ వేసిన ఒక జోక్ బాగా పేలింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ డైలాగ్ బాగా వైరల్ అవుతోంది. ఇంటర్వ్యూ మధ్యలో ఆకాష్ హీరోయిన్ కేతిక శర్మతో ఒక పాట పాడాలని కోరాడు. అయితే, ఆకాష్ కోరిక వినగానే ఆ అమ్మాయి సిగ్గు పడుతూ ‘నేను పాడలేను, నేను జస్ట్ బాత్రూమ్ సింగర్ ను’ అంటూ పాట పాడటానికి అంగీకరించలేదు.
ఆకాష్ “ఏమీ కాదు, ఇది బాత్ రూమ్ అనుకో, నువ్వు పాడు, మేము ఇక్కడ లేం అనుకో, ఇది నీ బాత్రూం అనుకో, ఏం డార్లింగ్ ? ‘ అని ప్రభాస్ వైపు చూశాడు ఆకాష్. దానికి ప్రభాస్ ‘ఆ పిల్ల బాత్ రూమ్ లో నేను ఎందుకుంటానురా?” అంటూ పంచ్ వేశాడు. మొత్తానికి ప్రభాస్ స్పాంటేనియస్ గా ఇచ్చిన రిప్లై చూసి నెటిజన్లు కూడా ఎంజాయ్ చేస్తున్నారు. ఇక ఈ నెల 29న ‘రొమాంటిక్’ మూవీ విడుదల కాబోతుంది.
సినిమా జనం లోకి వెళ్ళాలని మేకర్స్ పబ్లిసిటీ బాగా చేస్తున్నారు. ప్రభాస్ తో చేసిన ఇంటర్వ్యూ బాగా వర్కౌట్ అయింది. ప్రభాస్ ఈ సినిమా చూడాల్సిందిగా ఫ్యాన్స్ ను కోరాడు. సో.. ప్రభాస్ తన ఓన్ ఫిల్మ్ గా ఈ చిత్రాన్ని ప్రమోట్ చేస్తున్నాడు కాబట్టి.. కచ్చితంగా ఈ సినిమాకి ఓపెనింగ్స్ వచ్చే అవకాశం ఉంది. ఇక నిజంగానే సినిమా బాగుంటే.. ఈ సినిమా సూపర్ హిట్ అయ్యే ఛాన్స్ ఉంది.
కాగా ఈ రొమాంటిక్ చిత్రానికి పూరి ప్రీమియర్ షోలను ఏర్పాట్లు చేస్తూ ఎప్పుడూ లేనిది బాగా హడావిడి చేస్తున్నాడు. ఎంతైనా పూరి ఈ సినిమాకు కథ, మాటలు, స్క్రీన్ ప్లే కూడా అందించాడు. అందుకే, ఈ సినిమాపై ప్రేక్షకుల్లో కూడా మంచి అంచనాలు ఉన్నాయి.
Also Read: ఆయన తొలితరం హీరో.. కానీ కవిగా మిగిలిపోయారు !