MS Raju: బూతు సినిమాలు ఎక్కువగా బూతు బాగోతాలకు అలవాటు పడిన ఏ ఆర్జీవీ లాంటోడు తీస్తాడు. కానీ ఒక పెద్ద మనిషి.. ఇండస్ట్రీలో గౌరవ మర్యాదలు ఉన్న మనిషి బూతు సినిమాలు తీస్తే దరిద్రం గా ఉంటుంది. కానీ బూతు అంశాలు ఉన్న సినిమాకు డబ్బులు రావడం సులభం. కాబట్టి.. నీతి, పద్ధతి అనే కాన్సెప్ట్ లను కొంతకాలం పక్కన పడేసి.. సాధ్యమైనంత బోల్డ్ గా.. అవసరం అయితే పచ్చిగా అయినా ఏదొక సినిమా తీసేసి క్యాష్ చేసుకోవాలని ‘ఎం.ఎస్.రాజు’ అనే పెద్ద మనిషి ప్రస్తుతం బాగా ఆరాటపడుతున్నాడు.

అదేంటి ? ఎం.ఎస్.రాజు అంటే మంచి నిర్మాత కదా, పైగా ఫ్యామిలీ ఎమోషన్స్ తో విలువలు ఉన్న సినిమాలు తీసిన నిర్మాత కదా. ఆయన ఇలా బూతు సినిమాల పై యుద్ధం చేయడం ఏమిటి ? అసలు రాజు గారికి ఏమైంది ? ఉన్నట్టు ఉండి ఆయన మనసు మొత్తం బూతు మయం అయిపోవడం ఏమిటి ? ఇలా అనుకుంటున్నారు ఇండస్ట్రీలో. అయితే రాజుగారు మాత్రం ఇవేవీ పట్టించుకునే పరిస్థితిలో లేరు.
నిజానికి ఒకప్పుడు ఎం.ఎస్.రాజు అంటే ఫ్యామిలీ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ అనేవారు. కరెక్ట్ గా పదిహేను ఏళ్ల క్రితం మాట ఇది. యావత్తు తెలుగు పరిశ్రమ ఎం.ఎస్.రాజు అంటే ఎంతో గౌరవంగా ఉండేవారు. పైగా తెలుగు ఇండస్ట్రీకి సూపర్ హిట్స్ అందించిన చరిత్ర ఆయనది. ఇప్పుడున్న స్టార్ హీరోలు అందరూ ఎం.ఎస్ రాజు నిర్మాణంలో సినిమాలు చేసి ఎదిగిన వాళ్లే.
అసలు ఎం.ఎస్. రాజు అంటేనే భారీ సినిమాలు, అంతా భారీ తనమే. కానీ, ఆ భారీతనమే ఆయనకు నష్టాలను మిగిల్చింది. వరుస అపజయాలు కారణంగా రాజుగారు బాగా నష్టపోయారు. రోజులు మారాయి, ఆయన ప్రభ, వైభవం పూర్తిగా తగ్గిపోయింది. గతం గతః.. ఇక వర్తమానం మాత్రం రాజుగారు బూతు సినిమాలు చేసుకుంటూ నాలుగు రాళ్లు సంపాదించుకోవడానికి నానా కష్టాలు పడాల్సి వస్తోంది.
ఆ మధ్య దర్శకుడిగా మారి ‘డర్టీ హరి’ అనే బూతు సినిమా తీసి డబ్బు చేసుకున్నారు. ఆ సినిమా నిండా బూతులు, బోల్డ్ సీన్స్ మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు రాజుగారు ‘7 డేస్ 6 నైట్స్’ అనే మరో బూతు సినిమా చేస్తున్నారు. ఆల్ రెడీ ఈ సినిమా షూట్ కూడా పూర్తి అయింది. ఫస్ట్ కాపీ చూశారు. ‘డర్టీ హరి’ కంటే బూతు మాయ లా ఉందట. రాజుగారు హద్దులు మీరి బూతు సన్నివేశాలు, అవసరానికి మించి మాస్ మసాలా సన్నివేశాలను పెట్టారట. పాపం ఎలాంటి నిర్మాత ఎలా అయిపోయాడు.
Also Read: Ileana: ఇలియానాకి వరుడు కావాలట.. అప్పుడు గర్భం రాలేదట !