Manchu Vishnu career issues: తెలుగు సినిమా ఇండస్ట్రీలో వైవిధ్యమైన నటుడిగా పేరు సంపాదించుకున్న వాళ్ళలో మోహన్ బాబు మొదటి స్థానంలో ఉంటాడు… ప్రస్తుతం ఆయన తన సెకండ్ ఇన్నింగ్స్ ను స్టార్ట్ చేసి విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేస్తున్నాడు. అందుకే ఆయన నాని హీరోగా చేస్తున్న ‘ప్యారడైజ్’ సినిమాలో మెయిన్ విలన్ గా నటిస్తున్నాడు. ఇక మహేష్ బాబు అన్న కొడుకు అయిన జయకృష్ణ హీరోగా చేస్తున్న ‘ శ్రీనివాస మంగాపురం’ సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా తనలోని పూర్తి నటుడిని బయటికి తీసే ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పటివరకు మోహన్ బాబు చేసిన పాత్రలన్నింటి కంటే ఇది చాలా భిన్నంగా ఉంటుందట. మోహన్ బాబు కొడుకుగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన నటుడు మంచు విష్ణు…మోహన్ బాబు ఒకప్పుడు తన టాలెంట్ ను ఉపయోగించి అటు హీరోగా, ఇటు విలన్ గా పలువైవిద్య భరితమైన పాత్రలను పోషించాడు… ఇక విష్ణు కూడా నటనలో తన సత్తా చాటుకోవాలనే ప్రయత్నం చేసినప్పటికి అది వర్కౌట్ కాలేదు.
ఆయన మొదట్లో ఒకటి రెండు సక్సెస్ లను సాధించిన కూడా అవి ఆయన కెరియర్ ను బిల్డ్ చేయలేకపోయాయి. అందుకే ఆయన ఇండస్ట్రీ కి వచ్చి దాదాపు 20 సంవత్సరాలు దాటినా కూడా ఇప్పటికి ఇంకా స్ట్రాజిలింగ్ లోనే ఉన్నాడు. ఒక్క సక్సెస్ ని సాధించడానికి తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కొంటున్నాడు…
నిజానికి విష్ణు హీరోగా బిల్డ్ అవ్వకపోవడానికి మోహన్ బాబును ఒక కారణంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే విష్ణు కి నటనలో చాలా వరకు మేలుకోవాలు నేర్పినప్పటికి ఆయన ఎలాంటి కథలను సెలెక్ట్ చేసుకోవాలి ఎలాంటి సినిమాలు. చేస్తే ఇప్పుడున్న ప్రేక్షకులు ఆదరిస్తున్నారు అనే విషయాలను తనకి చెప్పడంలో మోహన్ బాబు ఫెయిల్ అయ్యాడు.
అందుకే కెరియర్ మొదట్లో ప్లాపులు వచ్చినప్పటికి ఆ తర్వాత వరుస సినిమాలు చేస్తూ వచ్చాడు తప్ప సక్సెస్ లను సాధించలేదు. ఢీ, దేనికైనా రెడీ, దూసుకెళ్తా లాంటి సినిమాలు మాత్రమే ఆయన కెరియర్ లో సక్సెస్ఫుల్ సినిమాలు గా నిలిచాయి. గత సంవత్సరం చేసిన కన్నప్ప సినిమా ఆశించిన మేరకు విజయాన్ని సాధించి పెట్టలేదు. దాంతో ఆయన కొంతవరకు డీలా పడిపోయాడు…