Baby Movie: బేబీ సినిమా చూడడానికి ఎందుకు ఎగబడుతున్నారు? దానికి కారణం ఏంటి?

సినిమా విశేషాల్లోకి వెళ్తే.. బేబీ మూవీ ట్రయాంగిల్ లవ్ స్టోరీ. ఇలాంటి కథలతో చాలా సినిమాలు వచ్చాయి. కానీ వాటిని తీయడంతో డైరెక్టర్ సాయిరాజేశ్ తన నైపుణ్యాన్ని ప్రదర్శించాడు. తెలిసి, తెలియని వయసులోనే ప్రేమలో పడడం.. అది ప్రేమని తెలుసుకునేసరికి సమయం దాటిపోవడం లాంటివి జరిగేవే. అయితే ఇక్కడ వైష్ణవి చైతన్య ఓ వైపు స్నేహితుడు, మరోవైపు ప్రియుడితో కలిసి ఉంటూ చేసే యాక్టింగ్ ను చూస్తే నేటి కాలం అమ్మాయిలు ఇలాగే ఉంటారేమో అనిపిస్తుంది. వాస్తవానికి విరాజ్ అశ్విన్ ను వైష్ణవి ఫ్రెండ్ లాగానే ట్రీట్ చేస్తుంది.

Written By: Srinivas, Updated On : July 19, 2023 5:05 pm

Baby Movie

Follow us on

Baby Movie: నేటి కాలంలో వందల కొద్దీ భారీ బడ్జెట్ చిత్రాలు తీస్తున్నా ఎవరూ ఆదరించడం లేదు. సాదాసీదా చిత్రాలను తీసి రిలీజ్ చేసే వాటిని మాత్రం ప్రేక్షకులు సక్సెస్ చేస్తున్నారు. మొత్తంగా పెద్ద సినిమాలకంటే చిన్న చిత్రాలే విజయం సాధిస్తున్నాయని చెప్పొచ్చు. అయితే కంటెంట్ ను నమ్ముకునే చిన్న చిత్రాలు తీస్తున్నారు. అందుకే అవి హిట్టు కొడుతున్నాయి. తాజాగా ఆనంద్ దేవరకొండ హీరోగా వచ్చిన ‘బేబీ’ మూవీకి విపరీతమైన క్రేజ్ వచ్చింది. ఏమాత్రం అంచనాలు లేకుండా థియేటర్లోకి వచ్చిన ఈ సినిమాను ప్రతి యొక్క యూత్ తప్పకుండా చూస్తున్నారు. దీంతో సోషల్ మీడియాలో అసలు సినిమలో ఏముంది? అనే చర్చ మొదలైంది. అయితే అసలు కారణం ఇదేనని తెలుస్తోంది.

నాటి నుంచి నేటి వరకు సినిమాను సక్సెస్ చేయడంతో యూత్ పాత్ర బాగా ఉంటుంది. వారిని దృష్టిలో పెట్టుకొని తీసే సినిమాలు సక్సెస్ అయ్యాయి. 2000 సంవత్సర కాలంలో వరుసబెట్టి లవ్ చిత్రాలు వచ్చాయి.. విజయవంతం అయ్యాయి. మధ్యలో కాస్త ఇలాంటి వాటికి బ్రేక్ ఇచ్చినా.. ఇప్పుడు మళ్లీ ఆదరిస్తున్నారని ‘బేబీ’ సినిమాతో అర్థమైంది. కుర్రకారు జీవితంలో జరిగే సంఘటనలను వెండితెరపై చూపించడంతో చాలా మంది ఎమోషనల్ గా ఫీలవుతున్నారు. దీంతో కొంత మంది మళ్ల మళ్లీ చూసేందుకు థియేటర్లోకి వస్తున్నారు.

ఇక సినిమా విశేషాల్లోకి వెళ్తే.. బేబీ మూవీ ట్రయాంగిల్ లవ్ స్టోరీ. ఇలాంటి కథలతో చాలా సినిమాలు వచ్చాయి. కానీ వాటిని తీయడంతో డైరెక్టర్ సాయిరాజేశ్ తన నైపుణ్యాన్ని ప్రదర్శించాడు. తెలిసి, తెలియని వయసులోనే ప్రేమలో పడడం.. అది ప్రేమని తెలుసుకునేసరికి సమయం దాటిపోవడం లాంటివి జరిగేవే. అయితే ఇక్కడ వైష్ణవి చైతన్య ఓ వైపు స్నేహితుడు, మరోవైపు ప్రియుడితో కలిసి ఉంటూ చేసే యాక్టింగ్ ను చూస్తే నేటి కాలం అమ్మాయిలు ఇలాగే ఉంటారేమో అనిపిస్తుంది. వాస్తవానికి విరాజ్ అశ్విన్ ను వైష్ణవి ఫ్రెండ్ లాగానే ట్రీట్ చేస్తుంది. కానీ ఈరోజుల్లో ఏ అబ్బాయి అయినా అమ్మాయి కాస్త చనువుగా ఉంటే పరిస్థితులేంటో అద్దం పట్టినట్లు చూపించారు. ఇలా ట్రయాంగిల్ లవ్ స్టోరీని దర్శకుడు యూత్ కు కనెక్ట్ అయ్యేలా చూపించాడు.

ఇందులో ఇంటర్వెల్ కంటే ముందు వచ్చే సీన్ యూత్ ను విపరీతంగా ఆకట్టుకుంటుంది. మరో సీన్ హీరోయిన్ ను తనను మోసం చేశావంటూ కాస్ల క్లాస్ తీసుకునే సీన్ అద్భుతంగా ఉందంటూ కొందరు కుర్రాళ్లు కితాబునిస్తున్నారు. చాలా మంది తమలను మోసం చేసే అమ్మాయిలకు ఇది మంచి సినిమా అని కీర్తిస్తున్నారు. కొన్ని ప్రేమ జంటలు అయితే ఈ సినిమాను మళ్లీ మళ్లీ చూస్తూ తమ జీవితంలో ఇలాంటి కష్టాలు రావొద్దని కోరుకుంటున్నారు.