Varun Tej Lavanya Marriage: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి పెళ్లి ఇటలీలో ఘనంగా జరిగింది. ఈ పెళ్లికి బంధుమిత్రులు తప్ప ఎక్కువమందిని పిలవలేదు.. వరుణ్ లావణ్య ఫ్రెండ్స్ కూడా వీరి పెళ్లికి అటెండ్ కాలేదు. కేవలం సన్నిహితులు, కుటుంబ సభ్యులు అంటే మెగా, అల్లు కుటుంబాలు మాత్రమే హాజరయ్యారు. కానీ ఒకవేళ హైదరాబాద్ లోయ పెళ్లి పెట్టుకుంటే ఇండస్ట్రీ మొత్తం మెగా ఫ్యామిలీ ఇంట్లోనే ఉండేది. ఈ కుటుంబం నుంచి ఆహ్వానం అందిందంటే కాదనని వారు, రానని వారు ఎవరు ఉండరు. కానీ ఇటలీలో డెస్టినేషన్ వెడ్డింగ్ చేశారు కాబట్టి మెగా ఫ్యామిలీనే ఎక్కువ మందిని పిలవలేదట. కానీ నవంబర్ 5న మాత్రం గ్రాండ్ గా రిసెప్షన్ జరగనుంది. ఈ రిసెప్షన్ కు టాలీవుడ్ మొత్తం హాజరుకానుంది.
వరుణ్ – లావణ్య ఇటలీలో జరిగిన పెళ్లికి మాత్రం కొంత మందే గెస్ట్ లను పిలిచారట. అందులో ఎన్టీఆర్ కూడా ఉన్నారు. స్వయంగా వీరి పెళ్లికి ఎన్టీఆర్ కు ఆహ్వాన పత్రిక ఇచ్చారట కూడా. అయితే వీరి పెళ్లికి మాత్రం ఎన్టీఆర్ వెళ్లలేదట. దీంతో ఇంత దగ్గర పెళ్లికి, అది కూడా మెగా ఫ్యామిలీలో వరుణ్ పెళ్లికి ఎన్టీఆర్ వెళ్లకపోవడం ఏంటి? ఎందుకు హాజరవ్వలేదు. రెండు రోజుల సమయం దొరకలేదా? అంటూ మెగా ఫ్యామిలీ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కానీ అనుకోని పరిస్థితుల వల్ల మాత్రమే ఎన్టీఆర్ హాజరు కాలేకపోయారు. మరి ఎందుకో ఓ సారి తెలుసుకోండి.
దేవర షూటింగ్ వలన ఎన్టీఆర్ రాలేనని చెప్పినట్టు తెలుస్తోంది. కానీ రిసెప్షన్ కు మాత్రం ఖచ్చితంగా వస్తానని చెప్పారట. ఇక ప్రస్తుతం ఎన్టీఆర్ దేవర షూటింగ్ కోసం గోకర్ణ వెళ్లాడు. అక్కడే కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారట. ఈ మూడురోజులు షూటింగ్ పూర్తి చేసుకొని నవంబర్ 5న హైదరాబాద్ లో టైగర్ అడుగుపెట్టినట్టు సమాచారం. మరి ఇందులో నిజమెంత అనేది తెలియాలంటే వరుణ్-లావణ్య రిస్పెషన్ వరకు ఆగాల్సిందే.