Junior NTR : జూనియర్ ఎన్టీఆర్ టాలీవుడ్ టాప్ స్టార్స్ లో ఒకరు. టీనేజ్ లోనే మాస్ హీరో ఇమేజ్ తెచ్చుకున్నాడు. స్టూడెంట్ నెంబర్ వన్, ఆది, సింహాద్రి చిత్రాలు ఎన్టీఆర్ కి భారీ ఫేమ్ తెచ్చిపెట్టాయి. ఎన్టీఆర్ గొప్ప డాన్సర్, యాక్టర్. అద్భుతమైన డైలాగ్ డెలివరీ ఆయన సొంతం. ఇక ఆర్ ఆర్ ఆర్ మూవీతో గ్లోబల్ స్టార్ గా ఎదిగాడు.
కెరీర్ బిగినింగ్ లో ఎన్టీఆర్ ఓ హీరోయిన్ ప్రేమలో పడ్డాడు. ఆ ముంబై భామతో పెళ్లి వరకు వ్యవహారం వెళ్ళిందంటూ కథనాలు వెలువడ్డాయి. అంతగా ప్రేమించిన ఆ అమ్మాయిని కాదని ఎన్టీఆర్ మరొకరిని ఎందుకు వివాహం చేసుకోవాల్సి వచ్చింది. ఈ ప్రశ్నకు ఎన్టీఆర్ ఓ సందర్భంలో స్వయంగా సమాధానం చెప్పాడు.
ఏదో ఒక సమయంలో ఎవరితో ఒకరితోనో ప్రేమలో పడాల్సిందే. నేను కూడా ప్రేమలో పడ్డాను. కానీ ఒక దశలో అది కరెక్ట్ కాదనిపించింది. నేను రియలైజ్ అయ్యాను. ప్రేమను వదులుకున్నాను. ప్రొఫెషన్ ని పర్సనల్ లైఫ్ ని మిక్స్ చేయకూడదు. వాటిని వేరు వేరుగా చూడాలి, అని ఎన్టీఆర్ అన్నారు.
ఇంకా మాట్లాడుతూ… మా అమ్మను ప్రేమగా చూసుకునే అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి అనుకున్నాను. నా అంత ప్రేమగా కాకపోయినా కనీసం అందులో సగం ప్రేమగా చూసుకున్నా చాలు. ఆ లక్షణం లక్ష్మి ప్రణతిలో ఉందని నేను నమ్మాను. మా అమ్మను బాగా చూసుకుంటుందని లక్ష్మి ప్రణతి మెడలో తాళి కట్టాను, అని ఎన్టీఆర్ అసలు మేటర్ బయటపెట్టాడు.
అప్పట్లో ఎన్టీఆర్-సమీరా రెడ్డి రిలేషన్ లో ఉన్నారని కథనాలు వెలువడ్డాయి. వీరిద్దరి కాంబోలో నరసింహుడు, అశోక్ చిత్రాలు తెరకెక్కాయి. అప్పుడే ప్రేమ చిగురించిందని టాక్. హరికృష్ణ మందలించడం వలనే సమీరా రెడ్డితో ఎన్టీఆర్ బంధం తెంచుకున్నాడనే టాక్ కూడా ఉంది. ఎఫైర్ రూమర్స్ ఇబ్బంది పెట్టాయి. అందుకే టాలీవుడ్ ని వదిలేశానని సమీరా రెడ్డి గతంలో చెప్పడం విశేషం.
2011లో లక్ష్మి ప్రణతిని ఎన్టీఆర్ వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు మగపిల్లలు సంతానం. అభయ్ రామ్, భార్గవ్ రామ్ వారి పేర్లు. ఎన్టీఆర్ నటించిన దేవర విడుదలకు సిద్ధమైంది. సెప్టెంబర్ 27న వరల్డ్ వైడ్ ఐదు భాషల్లో విడుదల చేస్తున్నారు. దర్శకుడు కొరటాల శివ తెరకెక్కిస్తుండగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు.
Web Title: Why did ntr have to marry lakshmi pranati
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com