Tollywood Star Directors: తెలుగు సినిమా స్థాయి ప్రస్తుతం ఏ రేంజ్ లో పెరిగిందో చెప్పాల్సిన పనిలేదు. ఒకప్పుడు తెలుగు సినిమాను పట్టించుకోని ప్రతి ఒక్కరు ఇప్పుడు ఈ సినిమాల గురించి ఎదురుచూస్తున్నారు. దీనికి కారణం ఎవరంటే ముందుగా ది గ్రేట్ డైరెక్టర్ రాజమౌళి పేరే గుర్తుకు వస్తుంది. మొదటి స్థానంలో రాజమౌళి ఉంటే.. తర్వాత స్థానాల్లో సందీప్ రెడ్డి వంగా, సుకుమార్ లు ఉంటారు. నిజానికి ఈ ముగ్గురు కూడా తెలుగు సినిమా స్థాయిని పాన్ ఇండియా రేంజ్ కు తీసుకెళ్లారు అనడంలో సందేహం లేదు.
వీరు పాన్ ఇండియా డైరెక్టర్లుగా గుర్తింపు సంపాదించడంతో వీరితో సినిమా చేయడానికి ప్రతి ఒక్క హీరో కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. కానీ ఈ డైరెక్టర్లు బిజీగా ఉన్నారు. ఇక ఈ హీరోలు ప్రస్తుతం బాలీవుడ్ హీరోలను మాత్రం పక్కన పెట్టినట్టు తెలుస్తోంది. సందీప్ రెడ్డి వంగా మాత్రమే యానిమల్ సినిమాను తెరకెక్కించారు. కానీ మిగిలిన ఇద్దరు మాత్రం బాలీవుడ్ హీరోలతో సినిమా కమిట్ కాలేదు. కానీ బాలీవుడ్ హీరోలు ఈ డైరెక్టర్లతో సినిమా చేయడానికి ఆరాటపడుతున్నారట. ప్రస్తుతం డైరెక్టర్ సందీప్ కూడా ప్రభాస్ తో బిజీగా ఉన్నారు. వీరి కాంబినేషన్ లో స్పిరిట్ సినిమా రాబోతుంది.
రాజమౌళి తన తర్వాత సినిమాను మహేష్ బాబుతో తెరకెక్కిస్తున్నారు. సుకుమార్ కూడా అల్లు అర్జున్ తో బిజీ అయ్యారు. ఇలా ఇప్పటికీ కూడా వీరి చేతిలో బాలీవుడ్ హీరోలతో సినిమాలు లేవు. అంతేకాదు మరో సినిమాకు కూడా ఒప్పుకున్న దాఖలాలు లేవు. దీనికి కారణం టాలీవుడ్ లోనే స్టార్ హీరోలు ఉన్నప్పుడు బాలీవుడ్ హీరోలతో ఎందుకు సినిమా చేయాలని అనుకుంటున్నారట. ఇక సందీప్ వంగ యానిమల్ సినిమాకు ముందుగా మహేష్ బాబును కలిశారు. కానీ మహేష్ బాబు తిరస్కరించారట.
మహేష్ బాబు నో చెప్పడంతో మరో అవకాశం లేక సందీప్ వంగా రణ్ బీర్ కపూర్ ను కలిశారు. ఇలా యానిమల్ సినిమా బాలీవుడ్ హీరో చేతిలోకి వెళ్లింది. ఏది ఏమైనా ఒకప్పుడు టాలీవుడ్ ను చిన్నచూపు చూసిన హీరోలు ప్రస్తుతం టాలీవుడ్ వైపు ఎదురుచూడడం గమనార్హం.