Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ సీజన్ 5 చివరి అంకానికి చేరుకుంది. వచ్చే ఆదివారం టైటిల్ విన్నర్ ఎవరో తేలిపోనుంది. విజేత రూ. 50 లక్షల క్యాష్, ట్రోపి తన్నుకుపోతాడు. ఈ ట్రోఫీ కోసం ఐదుగురు కంటెస్టెంట్స్ పోటీపడుతున్నారు. సన్నీ, మానస్, శ్రీరామ్, షణ్ముఖ్, సిరి ఫైనల్ కి చేరారు. నిన్న ఎపిసోడ్ లో కాజల్ ఎలిమినేటై రేసు నుండి తప్పుకున్నారు.

టైటిల్ కోసం పోటీపడుతున్న ఐదుగురిలో సిరి ఒక్కటే అమ్మాయి. గత సీజన్లో హారిక, అరియానా ఫైనల్ కి చేరారు. మరి ఈ సీజన్ లో అయినా టైటిల్ అమ్మాయికి దక్కుతుందా అనే ఆసక్తి కొనసాగుతుంది. గత నాలుగు సీజన్స్ టైటిల్స్ అబ్బాయిలే గెలుచుకోగా… ఫైనల్ కి చేరిన సింగర్ గీతా మాధురి, యాంకర్ శ్రీముఖి… రన్నర్స్ గా మిగిలిపోయారు.
సిరి కూడా టైటిల్ గెల్చుకోవడం అంత ఈజీ కాదు. ఓట్ల పరంగా మిగతా కంటెస్టెంట్స్ తో పోటీపడేంత ఫాలోయింగ్ ఆమెకు లేదు. టైటిల్ రేసులో మొదట్నుంచి వినిపిస్తున్న పేరు షణ్ముఖ్. బిగ్ బాస్ సీజన్ 5 టైటిల్ గెలిచేది షణ్ముఖ్ అంటూ సోషల్ మీడియాలో భారీగా ప్రచారమైంది. అయితే కొన్ని వారాలుగా అతడి ర్యాంకింగ్ పడిపోతూ వచ్చింది. సిరితో ఎమోషనల్ గా కనెక్ట్ అయిన షణ్ముఖ్ గేమ్ దెబ్బతింది. సిరి గురించి ఆలోచిస్తూ అతడు గేమ్ పై ఫోకస్ తగ్గించాడు.
అలాగే చిన్న చిన్న కారణాలతో సిరితో గొడవలు పెట్టుకోవడం, ఆమెను మానసికంగా వేధించడం చేస్తున్నాడు. ప్రతి ఎపిసోడ్ లో ఇదే బాగోతం కొనసాగుతుంది. ఫ్రెండ్షిప్ పేరుతో వీరి మధ్య శృతి మించిన రొమాన్స్ కూడా షణ్ముఖ్ పై వ్యతిరేకత తీసుకువచ్చింది. అలా అని షణ్ముఖ్ టైటిల్ గెలిచే అవకాశాలు అసలు లేవని కాదు. గేమ్ పరంగా అతడు వెనుకబడ్డాడు.
మరోవైపు సన్నీ తన అగ్రెసివ్ గేమ్ తో టైటిల్ రేసులో దూసుకొచ్చాడు. కొన్ని వారాలుగా అతడు మరింత పుంజుకున్నాడు. మొదట్నుంచి ఎటాకింగ్ గేమ్ ఆడుతున్న సన్నీ, ఎమోషన్స్ కి దూరంగా ఉంటూ జెన్యూన్ గేమ్ ఆడుతున్నాడన్న పేరు తెచ్చుకున్నాడు. అదే సమయంలో అతని కోపం మైనస్ గా మారింది. ఈ విషయంలో హోస్ట్ నాగార్జున అతడికి చివాట్లు కూడా పెట్టారు. ఏదేమైనా ఇప్పటి వరకు టైటిల్ రేసులో సన్నీ ముందంజలో ఉన్నట్లు సమాచారం.
Also Read: Pawan Kalyan: నీదేం పోయింది పవన్… బొక్క నిర్మాతలకేగా
ఇక ఫైనల్ కి చేరిన శ్రీరామ్, మానస్ లను తీసేయడానికి లేదు. ముఖ్యంగా స్టార్ సింగర్ గా శ్రీరామ్ భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగి ఉన్నాడు. మానస్ కి ఓ వర్గం ఫుల్ గా సప్పోర్ట్ ఇస్తున్నట్లు సమాచారం. కాబట్టి ఈ వారం రోజుల్లో సమీకరణాలు ఎలాగైనా మారిపోవచ్చు. టైటిల్ విన్నర్ ఎవరైనా కావచ్చు. వచ్చే ఆదివారం ఊహాగానాలకు, నిరీక్షణకు తెరదించుతూ మరో కొత్త బిగ్ బాస్ విన్నర్ అవతరించనున్నాడు. ఇక సీజన్స్ వారీగా గత నాలుగు టైటిల్స్ ని శివ బాలాజీ, కౌశల్, రాహుల్ సిప్లిగంజ్, అభిజీత్ గెలుచుకున్నారు.
Also Read: Akhanda: బాలయ్య బాబు చాలా జెన్యూన్… చూసి నేర్చుకోండయ్యా!