Hanuman: ఈ సంక్రాంతికి రిలీజ్ అయిన సినిమాల్లో హనుమాన్ సినిమా తనదైన రీతిలో భారీ వసూళ్లను కలెక్ట్ చేస్తూ ముందుకు దూసుకెళ్తుంది. ఇక ఇలాంటి క్రమంలో మిగిలిన సినిమాలు ఈ సినిమాతో పోటీ పడలేక కలెక్షన్స్ పరంగా చాలా వీక్ గా కనిపిస్తున్నాయి. ఇక ఇలాంటి క్రమంలోనే హనుమాన్ సినిమాని తొక్కేయడానికి చాలా రకాల కుట్రలు అయితే జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. అవేంటి అంటే గుంటూరు కారం సినిమాని హైప్ చేస్తూ హనుమాన్ సినిమాకి హైప్ ను తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ మౌత్ టాక్ వల్ల హనుమాన్ సినిమాకి రావాల్సినంత క్రేజ్ అయితే వచ్చేసింది.
ఇక ప్రతి ఒక్కరు ఈ సినిమాను చూడడానికి ఎక్కువ ఆసక్తిని చూపిస్తూ థియేటర్లలో రచ్చ రచ్చ చేస్తున్నారు. ఇక ఇలాంటి క్రమంలో హనుమాన్ సినిమా కలెక్షన్స్ ని తగ్గించడానికి గుంటూరు కారం సినిమాకు సంబంధించిన టీం చాలా రకాలుగా ప్రయత్నాలు చేస్తుందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇక దానికి తగ్గట్టుగానే ప్రసాద్ ఐమాక్స్ లో హనుమాన్ సినిమాకి సంబంధించిన మూడు షోలు హౌస్ ఫుల్ అయినప్పటికి ఆ షో లను క్యాన్సిల్ చేశారు.
కారణం ఏంటి అనేది తెలీదు గానీ ఆ మూడు షోస్ లకి గుంటూరు కారం సినిమాని వేసినట్టుగా తెలుస్తుంది. ఇక ఈ విషయాన్ని ప్రశాంత్ నీల్ సోషల్ మీడియా వేదికగా తన అభిమానులతో పంచుకున్నారు. ఇక ఇది చూసిన చాలామంది అభిమానులు ఒక చిన్న సినిమాని తొక్కేయడానికి ఇన్ని రకాల కుట్రలు చేయడం అవసరమా రిలీజ్ కి ముందు ఆ సినిమా కి థియేటర్లు ఎక్కువగా ఇవ్వలేదు సరే పోని అనుకుంటే ఇప్పుడు ఇక తొక్కెయ్యలని చూస్తున్నారు ఇక ఇదంత చూస్తున్న ప్రేక్షకులు గుంటూరు కారం సినిమా టీం పైన విరుచుకుపడుతున్నారు.
ఒక పెద్ద హీరో సినిమా వచ్చి కంటెంట్ బాలేకపోవడం వల్ల డివైడ్ టాక్ తో నడుస్తున్నప్పుడు ఒక చిన్న సినిమా వచ్చి సక్సెస్ అయితే మాత్రం దాన్ని బతకనివ్వరా అంటూ చాలామంది నెటిజన్లు సైతం సోషల్ మీడియా వేదికగా గుంటూరు కారం సినిమా మీద నిప్పులు చెరుగుతున్నారు.ఇక వాళ్ల సినిమాలు సక్సెస్ కాకపోతే ఎవరేం చేస్తారు. దానికి సక్సెస్ అయిన చిన్న సినిమాలను తొక్కెయ్యడం కరెక్ట్ కాదు కదా అంటూ కామెంట్లు చేస్తున్నారు…