Devara: తెలుగు సినిమా ఇండస్ట్రీలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఈయన చేసిన చాలా సినిమాలు ఇండస్ట్రీలో విజయాలను అందుకోవడమే కాకుండా ఆయనకి సపరేట్ గా ఒక స్టార్ డమ్ అనేది తీసుకొచ్చి పెట్టాయి. మొదట్లో ఈయన చేసిన ఆది, సింహాద్రి లాంటి సినిమాలు మాస్ లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించి పెట్టాయి. అలాంటి ఒక యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇప్పుడు కొరటాల శివ దర్శకత్వంలో చేస్తున్న దేవర సినిమా మీదనే అందరి ఫోకస్ ఉంది.
ఎందుకంటే ఈయన చేస్తున్న ఈ సినిమా భారీ సక్సెస్ సాధిస్తుంది అంటూ ప్రతి ఒక్కరు ఈ సినిమా గురించే మాట్లాడుకుంటున్నారు. అయితే ఇప్పుడు తెలుస్తున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో ఒక సర్ప్రైజ్ ఉన్నట్టుగా తెలుస్తుంది. అది ఏంటి అంటే ఈ సినిమాలో ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ కోసం విజయ్ దేవరకొండ ఈ సినిమాలో నటించినట్టుగా తెలుస్తుంది. ఆయన క్యారెక్టర్ ఈ సినిమా క్లైమాక్స్ లో కనిపిస్తుందట అది ఒక 10 నిమిషాల పాత్ర అని కూడా తెలుస్తుంది. అయితే ఈ విషయాన్ని సినిమా యూనిటీ ఎక్కడ కూడా ప్రస్తావించడం లేదు.
అది డైరెక్ట్ గా స్క్రీన్ మీదనే చూసి ఆశ్చర్యానికి గురయ్యేలా ఒక సర్ప్రైజ్ ని సినిమాలో ఉంచినట్టుగా తెలుస్తుంది. అయితే స్క్రీన్ మీద ఎన్టీఆర్ విజయ్ దేవరకొండ కాంబో అనేది చాలా బాగా వర్క్ అవుట్ అయినట్టుగా చిత్ర యూనిట్ ఆనందాన్ని వ్యక్తం చెప్తున్నారు. ఇక వీళ్లిద్దరి మధ్య తెరకెక్కించిన సీన్లు కూడా అద్భుతంగా వచ్చాయని ఇప్పటికే చిత్ర యూనిట్ సంబరాలు చేసుకుంటున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఈ విషయాన్ని చాలా గోప్యంగా ఉంచుతూ వస్తున్నారు. ముఖ్యంగా ఈ సినిమాలో ఆయన నటించిన పాత్ర ఏంటి అనేది కూడా ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలను రెకెత్తిస్తుంది.
సినిమా చివర్లో ఆయన కనిపించేది 10 నిమిషాలైనా కూడా సినిమా మొత్తానికి ఆ క్యారెక్టర్ ఇంపాక్ట్ చూపించబోతున్నాట్టు గా తెలుస్తుంది. అలాగే సెకండ్ పార్ట్ కి కూడా ఆ క్యారెక్టర్ లీడ్ ఇవ్వబోతున్నట్టుగా కూడా వార్తలైతే వస్తున్నాయి… ఇక పాన్ ఇండియా లెవెల్ లో వస్తున్న ఈ సినిమా మీద ఇప్పటికే భారీ అంచనాలైతే ఉన్నాయి ఇక విజయ్ దేవరకొండ కూడా ఈ సినిమాలో నటిస్తున్నాడు అనే న్యూస్ లీక్ అవడంతో ఈ సినిమా మీద అంచనాలు మరింతగా పెరిగే అవకాశం కూడా ఉంది…