Chiranjeevi: తెలుగు సినిమా ఇండస్ట్రీకి 40 సంవత్సరాల పాటు మెగాస్టార్ గా కొనసాగిన ఒకే ఒక హీరో మెగాస్టార్ చిరంజీవి… సినిమా ఇండస్ట్రీలో టాప్ హీరోగా అలాగే మెగాస్టార్ గా గుర్తింపు పొందుతూ వస్తున్నాడు. ప్రజారాజ్యం పార్టీ పెట్టి సినిమాలకి బ్రేక్ ఇచ్చాడు. ఇక ఈ క్రమంలో చిరంజీవి ఒక పది సంవత్సరాల పాటు సినిమాలకి దూరంగా ఉంటూ వచ్చారు. ఇక ఆ తర్వాత ఆయన పెట్టిన ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసి మళ్లీ సినిమా ఇండస్ట్రీకి రీ ఎంట్రీ ఇచ్చారు.
ఆయన ఇండస్ట్రీ నుంచి రాజకీయాలకు వెళ్లిపోయి, మళ్లీ తిరిగి ఇండస్ట్రీ కి వచ్చారు అయినప్పటికీ ఇంకా ఇప్పటివరకు కూడా ఇండస్ట్రీలో చిరంజీవి తర్వాత టాప్ హీరో ఎవరు అనేది మాత్రం క్లారిటీ అయితే రావడం లేదు. ఇక సీనియర్ హీరోలను మినహాయిస్తే పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, ప్రభాస్ లాంటి స్టార్ హీరోలు వాళ్ళ సినిమాలతో భారీ వసూళ్లను రాబడుతూ ముందుకెళ్తున్నారు.
కానీ ఇండస్ట్రీని శాసించే ఈ జనరేషన్ స్టార్ హీరో ఎవరు అనేది మాత్రం క్లారిటీగా తెలియడం లేదు. ఇక ఈ విషయం మీద చాలా సంవత్సరాల నుంచి చాలా రకాల చర్చలు జరుగుతున్నప్పటికీ ఈ ప్రశ్నకి మాత్రం సరైన సమాధానం అయితే దొరకడం లేదు. దానికి కారణం ఏంటి అంటే ఒక హీరో ఒక సినిమాతో సక్సెస్ కొడితే మరొక సినిమాతో ఫెయిల్యూర్ ను అందుకుంటున్నాడు. అలాంటప్పుడు ఆ హీరోని టాప్ హీరోగా ఎలా పరిగణనలోకి తీసుకుంటాం అనేది కూడా ఇక్కడ మనం గమనించాల్సిన విషయం.
ఇక అదే విధంగా ఒకప్పుడు చిరంజీవి వరుసగా 6 సంవత్సరాల్లో 6 ఇండస్ట్రీ హిట్లను కొట్టాడు. కాబట్టి తను ఇండస్ట్రీలో మెగాస్టార్ గా ఎదిగాడు. ఇక ఇప్పటివరకు ఆ రికార్డుని ఎవరు సాధించలేదు. అలాగే చిరంజీవి సాధించిన రికార్డును ఎవరు బ్రేక్ చేయలేదు. అందువల్లే చిరంజీవి అన్ని సంవత్సరాల పాటు మెగాస్టార్ గా కొనసాగారు. ఇక కొంతకాలం బాలయ్య బాబు చిరంజీవికి పోటీ ఇచ్చినప్పటికీ ఎప్పటికప్పుడు చిరంజీవి తనని తాను ప్రూవ్ చేసుకుంటూ బాలయ్యను డామినేట్ చేస్తూ స్టార్ హీరో రేంజ్ ని అధిగమించి మెగాస్టార్ గా గుర్తింపు పొందాడు…ఇక ఇప్పుడు మెగాస్టార్ గా గుర్తింపు తెచ్చుకునే నటుడు ఎవరు అనేది కూడా తెలియాల్సి ఉంది…