Pawan Kalyan: సినిమా ఇండస్ట్రి లో ఎంతమంది స్టార్ హీరోలు ఉన్నప్పటికీ పవన్ కళ్యాణ్ కి ఉన్న ఆ స్టార్ డమ్ మాత్రం మరే హీరోకి లేదు అని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఒక హీరో గానే కాకుండా మానవత్వం ఉన్న మనిషి గా తన వంతు సహాయం కూడా చేస్తాడు కాబట్టి హీరో గానే కాకుండా వ్యక్తిగా కూడా ఆయన్ని ప్రతి ఒక్కరు ఆరాధిస్తూ ఉంటారు. ఇక అందులో భాగంగానే ఆయన చేసిన ప్రతి సినిమా కూడా ప్రేక్షకుల్లో విపరీతమైన గుర్తింపును సంపాదించడమే కాకుండా ఆయనకంటూ ఒక ప్రత్యేకతను ఏర్పాటు చేయడంలో చాలా వరకు హెల్ప్ అవుతూ ఉంటుంది.
ఇక ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ కి రవితేజ యాక్టింగ్ అంటే చాలా ఇష్టం రవితేజ హీరోగా చాలా సినిమాలు చేసి మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు ముఖ్యంగా పవన్ కళ్యాణ్ రిజెక్ట్ చేసిన చాలా సినిమాలను రవితేజ చేసి మంచి సక్సెస్ లను అందుకున్నాడు.ఇక ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ ను అయితే ఏర్పాటు చేసుకున్నాడు. ఇక పవన్ కళ్యాణ్ కి రవితేజ సినిమాల్లో కామెడీ అంటే చాలా ఇష్టం అంటూ అప్పట్లో ఒక ఇంటర్వ్యూ చెప్పాడు. అలాగే కామెడీ సినిమాలు చేసే రవితేజ విక్రమార్కుడు సినిమాలో చేసిన విక్రమ్ సింగ్ రాథోడ్ క్యారెక్టర్ మాత్రం ఆయనకి బాగా పేరు తీసుకువచ్చింది.
ఆ సినిమాని చూసిన పవన్ కళ్యాణ్ అప్పట్లో రవితేజ మీద సంచలన వ్యాఖ్యలు చేశాడు… విక్రమార్కుడు లో ఆయన అంత సీరియస్ గా నటిస్తాడు అని నేను అనుకోలేదు. అంత సీరియస్ క్యారెక్టర్ చేసి కంప్లీట్ గా నన్ను భయపెట్టేసాడు అంటూ అప్పట్లో రవితేజ మీద పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. నిజానికి విక్రమార్కుడు సినిమాని పవన్ కళ్యాణ్ చేయాల్సింది కానీ కొన్ని కారణాల వల్ల ఆ సినిమా రవితేజ చేసి సూపర్ సక్సెస్ అందుకున్నాడు.
ఇలా తను చేయాల్సిన క్యారెక్టర్ ని రవితేజ చేసి పవన్ కళ్యాణ్ ని భయపెట్టించాడు అంటే రవితేజ నటన లో ఎంత దమ్ము ఉందో మనం అర్థం చేసుకోవచ్చు ఎప్పుడూ కామెడీగా సినిమాలు చేసుకునే రవితేజ విక్రమార్కుడు లో చేసిన విక్రమ్ సింగ్ రాథోడ్ పాత్ర ఆయన చేసిన అన్ని సినిమాల్లోకెళ్ల అది ఒక స్పెషల్ క్యారెక్టర్ ఎప్పటికీ ఆ క్యారెక్టర్ అలా ఎవర్ గ్రీన్ గా నిలిచిపోతుందనే చెప్పాలి…