Samantha : సమంత- నాగచైతన్య విడిపోతున్నట్టు అధికారికంగా ప్రకటించారు. దీంతో.. వారి విడాకుల అంశంపై కొనసాగుతున్న ఊహాగానాలకు తెరపడింది. ఇప్పుడు.. అంతకు రెట్టింపు అంశాలు చర్చలోకి వచ్చాయి. ఈ విషయంలో తప్పు ఎవరిది? విడాకులకు ఎవరు కారణమై ఉంటారు? సమంతకు భరణం ఎంత ఇవ్వబోతున్నారు? వంటి విషయాలపై సోషల్ మీడియా వేదికగా చర్చసాగుతోంది. ఇలాంటి మరొక విషయమే సామ్ నివాసం. విడాకుల తర్వాత సమంత ఎక్కడ నివసించబోతోంది? అనే విషయం కూడా చర్చలో కొనసాగుతోంది.

నిజానికి.. విడాకుల విషయం అధికారికంగా ప్రకటించడానికి ముందే సమంత హైదరాబాద్ ను వదిలిపెట్టింది. కొంతకాలంగా చెన్నైలో నివాసం ఉంటోంది. అక్కడ స్నేహితులతో జాలీగా గడుపుతున్న ఫొటోలను, వీడియోలను సోషల్ మీడియాలో పోస్టు చేస్తూ వచ్చింది. ఇక, త్వరలోనే ముంబైకి షిఫ్ట్ కాబోతోందని, బాలీవుడ్ లో సెటిల్ అయ్యేందుకు ప్రయత్నిస్తోందనే ప్రచారం సాగింది.
అయితే.. ఇటీవల అభిమానులతో సోషల్ మీడియాలో చిట్ చాట్ నిర్వహించిన సమంత.. హైదరాబాద్ పై క్లారిటీ ఇచ్చింది. ‘‘హైదరాబాద్ నా హోమ్ టౌన్.. ఇప్పటికీ.. ఎప్పటికీ’’ అని చెప్పింది సమంత. అయితే.. విడాకుల గురించి అధికారికంగా ప్రకటించడానికి ముందు ఇలా చెప్పింది. మరి, ఇప్పుడు విడిపోతున్నట్టు ప్రకటించారు కాబట్టి.. నిజంగా హైదరాబాద్ లోనే ఉంటుందా? అనే చర్చ సాగుతోంది.
కాగా.. హైదరాబాద్ లోని గచ్చి బౌలీలో సమంతకు సొంతంగా ఫ్లాట్ ఉన్నట్టుగా తెలుస్తోంది. ఒకవేళ హైదరాబాద్ లో నివసించాలని డిసైడ్ అయితే.. ఇక్కడే ఉంటుందని టాక్. అయితే.. చైతూతో విడిపోయిన తర్వాత భాగ్యనగరంతో సమంతకు పనేముంది? అనే చర్చ కూడా సాగుతోంది. మరి, ఏం జరుగుతుంది? అన్నది చూడాలి.