Prabhas: ప్రస్తుతం పాన్ ఇండియా ఇండస్ట్రీ లో సీక్వెల్స్ హవా ఎక్కువగా నడుస్తుంది. అవసరం ఉన్నా లేకపోయిన ప్రతి సినిమా ఎండింగ్ లో ఈ సినిమాకి సీక్వెల్ ఉందంటూ అనౌన్స్ చేస్తూ ఎండ్ చేస్తున్నారు. ఇక దర్శకులు కూడా ఫస్ట్ పార్ట్ సక్సెస్ అయి ప్రాఫిట్స్ వస్తే రెండో పార్ట్ ను తెరకెక్కించే ప్రయత్నం చేస్తున్నారు. ఒకవేళ మొదటి పార్ట్ ఫ్లాప్ అయితే ఆ సినిమాకు సంబంధించిన రెండో పార్ట్ ని లేకుండా మొదటి పార్ట్ వరకే సినిమాని ఎండ్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇక ఇలాంటి సందర్భంలోనే ప్రభాస్ నుంచి వస్తున్న ప్రతి సినిమాకి సీక్వెల్ అయితే ఉంటుందని అనౌన్స్ చేస్తూ వస్తున్నారు. బాహుబలి సినిమా ఏ టైంలో అయితే చేశాడో గానీ అప్పటి నుంచి ప్రభాస్ చేస్తున్న చాలా సినిమాలు సీక్వెల్స్ సినిమాలుగా తెరకెక్కుతూ ప్రేక్షకులను అలరించే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక అందులో భాగంగానే ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన సలార్ సినిమాకి సీక్వెల్ గా సలార్ 2 సినిమా ఉంటుందని అనౌన్స్ చేశారు. అలాగే నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన కల్కి సినిమాకి సీక్వెల్ ఉంటుందనే ఉద్దేశ్యంతో కల్కి 2 సినిమాని కూడా అనౌన్స్ చేశారు. ఇక ఏది ఏమైనా ప్రభాస్ నుంచి వస్తున్న ప్రతి సినిమాకి సీక్వెల్ ని అనౌన్స్ చేయడానికి గల ముఖ్య ఉద్దేశ్యం ఏంటి అంటే ఒక సినిమా మీద పెట్టే బడ్జెట్ తో రెండు సినిమాలను చేయడం వల్ల ఒకె బడ్జెట్ కి రెండు సార్లు కలెక్షన్స్ వస్తున్నాయి.
దానివల్ల ప్రొడ్యూసర్ భారీగా లాభాలు రావడమే కాకుండా హీరోలకు కూడా భారీగా లాభం వస్తుందనే చెప్పాలి. ఇక ప్రొడ్యూసర్స్ కి కూడా ఖర్చులు ఈజీగా భరించుకునే అవసరమైతే ఏర్పడుతుంది.
ఒకసారి సెట్ వేస్తే ఆ సెట్లోనే మొదటి పార్ట్ రెండో పార్ట్ రెండు సినిమాలను చిత్రీకరించే ఫెసిలిటీ ఉండే విధంగా ప్రణాళికల రూపొందించుకుంటూ మన దర్శక నిర్మాతలు ఒక కొత్త బిజినెస్ స్ట్రాటజీ కి శ్రీకారం అయితే చూడుతున్నారు…
ఇక ప్రభాస్ కూడా బాహుబలి రెండు పార్టులుగా వచ్చి సూపర్ సక్సెస్ అయింది. కాబట్టి ఆ సెంటిమెంట్ ని రిపీట్ చేయాలనే ఉద్దేశ్యంతో ప్రతి సినిమాకి సీక్వెల్ ని అనౌన్స్ చేస్తూ ముందుకు సాగుతున్నాడు… ఇక ఇప్పుడు ఫౌజీ, స్పిరిట్ సినిమాలను చేస్తున్న ఆయన తొందర్లోనే సలార్ 2, కల్కి 2 సినిమాలను పట్టాలెక్కించే పనిలో బిజీ కానున్నట్టుగా తెలుస్తోంది…