Tamil Film Industry Future: ప్రస్తుతం తమిళ్ సినిమా ఇండస్ట్రీ పరిస్థితి చాలా దారుణంగా తయారైంది. ఒకప్పుడు మంచి కాన్సెప్ట్ లతో సినిమాలు రావాలి అంటే అది తమిళ్ నుంచి మాత్రమే అనేంతలా గుర్తింపును సంపాదించుకున్న ఇండస్ట్రీ ఇప్పుడు ఒక సక్సెస్ ని సాధించడానికి నానా తంటాలు పడుతోంది. ముఖ్యంగా పాన్ ఇండియాలో ఇప్పటివరకు తమిళ్ సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చిన ఏ సినిమా కూడా సూపర్ సక్సెస్ ని సాధించలేదనేది వాస్తవం… ఇక ఇప్పుడు మరోసారి మురుగదాస్ ‘మదరాసి’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. మరి ఈ సినిమా ఎలాంటి సక్సెస్ ని సాధిస్తోంది. తద్వారా ఈ సినిమాతో ఆయన ఎలాంటి ఐడెంటిటిని క్రియేట్ చేసుకోబోతున్నాడు. అలాగే తమిళ్ సినిమా ఇండస్ట్రీని టాప్ లెవల్లో నిల్చోబెట్టే ప్రయత్నం చేస్తున్నాడా? లేదా అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది…గతంలో వచ్చిన భారతీయుడు 2, కంగువా లాంటి సినిమాలు భారీగా ప్రేక్షకులను నిరాశపరిచాయి. ఇక దాంతో పాటుగా కమల్ హాసన్ హీరోగా వచ్చిన ‘థగ్ లైఫ్’ రీసెంట్ గా రజనీకాంత్ హీరోగా వచ్చిన కూలీ సినిమాలు సైతం ప్రేక్షకులను ఏమాత్రం మెప్పించలేకపోయాయి. పాన్ ఇండియా రిలీజ్ లను సొంతం చేసుకున్న ఈ సినిమాలు సగటు ప్రేక్షకులను మెప్పించకపోవడంతో ఇండస్ట్రీ బాగా వెనకబడిపోయింది…. నిజానికి తమిళ్ సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చే సినిమాలు ఇప్పుడున్న ప్రేక్షకులకు ఎందుకు నచ్చడం లేదు అంటే వాళ్లు కథల మీద ఎక్కువగా ఫోకస్ చేయడం లేదని తెలుస్తోంది. ఎంతసేపు మేకింగ్ మీద ఫోకస్ చేసి ముందుకు సాగుతున్నారు. కానీ కథలో కంటెంట్ లేనప్పుడు ప్రేక్షకులు ఆ సినిమాకి కనెక్ట్ అవ్వడం అనేది చాలా కష్టమైన పని…మరి అలాంటి వాళ్ళు చాలా తప్పులు చేస్తున్నారు.
ఇక మురుగదాస్ లాంటి దర్శకుడు ‘మదరాసి’ సినిమా విషయంలో ఎలాంటి కేర్ తీసుకున్నాడు అనేది తెలియాల్సి ఉంది. ట్రైలర్ మొత్తాన్ని యాక్షన్ తో నింపేశాడు మరి సినిమా మొత్తం అలాగే ఉంటుందా? అలా ఉంటే ప్రేక్షకులు యాక్సెప్ట్ చేస్తారా అనేది కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
ఇక శివ కార్తికేయన్ అమరన్ సినిమా తర్వాత మరొక మంచి సక్సెస్ ని తన ఖాతాలో వేసుకుంటాడా? లేదా అనేది తెలియాల్సి ఉంది…ఇక రీసెంట్ గా మురుగదాస్ చేసిన కామెంట్స్ వైరల్ అవ్వడంతో ఇప్పుడు ఆయన సినిమా ఎలా ఉంటుంది అనే దాని మీదనే అందరి ఫోకస్ అయితే ఉంది.
తమిళ్ సినిమా దర్శకులను ఇతర దర్శకులతో పోల్చాల్సిన పనిలేదని వాళ్లు ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేసే సినిమాలు కాకుండా ఎడ్యుకేట్ చేసే సినిమాలు చేస్తారు అంటూ కామెంట్స్ చేశాడు. ఇక ఆయన కామెంట్లకు భారీ ఎత్తున విమర్శలైతే ఎదుర్కొన్నాడు. మరి ఆయన సినిమా ప్రేక్షకులను ఎడ్యుకేట్ చేస్తుందా లేదా అనేది తెలియాల్సి ఉంది…