Rangamartanda: క్రియేటీవ్ దర్శకుడు కృష్ణ వంశీ తాజాగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘రంగమార్తాండ’. మరాఠీలో సూపర్ హిట్ అయిన ‘నట సామ్రాట్’ మూవీని దర్శకుడు కృష్ణ వంశీ తెలుగులో రీమేక్ చేస్తున్నాడు. వరుస ఫ్లాపులతో సతమతం అవుతున్న కృష్ణవంశీ ఈసారి ‘రంగమార్తండ’తో సూపర్ హిట్ కొడుతాననే నమ్మకంతో ఉన్నాడు.
‘నట సామ్రాట్’ మూవీలో నానా పటేకర్ చేసిన పాత్రను తెలుగులో విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ చేస్తున్నాడు. అయితే ఈ సినిమాలో మరో కీలకమైన పాత్ర ఉంది. నానా పటేకర్ స్నేహితుడిగా మరాఠీలో విక్రమ్ గోఖలే నటించాడు. ఆయన ఓ స్టేజ్ ఆర్టిస్ట్ అయినప్పటికీ ఒక సన్నివేశంలో నానాని పూర్తిగా డామినేట్ చేసేస్తారు.
అలాంటి పాత్రకు దర్శకుడు కృష్ణ వంశీ తెలుగులో బ్రహ్మానందానికి ఇచ్చారు. ఈ పాత్ర పూర్తి సీరియస్ ఎమోషనల్ రోల్ తోపాటు యాంటీ క్లైమాక్స్ ఉంటుంది. దీంతో ఈ పాత్రకు బ్రహ్మనందంను ఎంచుకోవడం కృష్ణ వంశీది సాహసమనే చెప్పాలి. ఇక ఈ పాత్ర కోసం బ్రహ్మనందం తొలి గడ్డం కూడా పెంచారట. దీంతో ఆయన లుక్కుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
ఇటీవల రంగమార్తండ షూటింగ్ లో ప్రకాశ్ రాజ్, బ్రహ్మనందంలపై ఓ కీలక సన్నివేశం తెరకెక్కించారు. ఇందులో బ్రహ్మనందం నటన చూసి కృష్ణ వంశీ భావోద్వేగానికి లోనయ్యారట. ఈ సీన్ సినిమాకే హైలెట్ గా నిలుస్తుందని టాక్ విన్పిస్తోంది. అప్పటి నుంచి ఈ సినిమాలో బ్రహ్మనందం ఇరగదీశాడనే వార్త హల్చల్ చేస్తోంది.
ఇదిలా ఉంటే కృష్ణవంశీ ‘రంగమార్తండ’ మూవీని తెలుగులో రీమేక్ చేస్తున్నాడని తెలియగానే ఓ ప్రముఖ సీనియర్ నటుడు ఆయనకు ఫోన్ చేసి విక్రమ్ గోఖలే పాత్ర చేస్తానని, రెమ్యూనరేష్ ఏమి వద్దని చెప్పాడట. అయితే కృష్ణవంశీ మాత్రం ఆ పాత్రలో బ్రహ్మనందాన్ని మాత్రమే చూస్తున్నానని చెప్పాడట. దీంతో ఈ పాత్రపై కృష్ణవంశీకి ఎంత ప్రేమ ఉందో అర్థమవుతోంది.