Balakrishna: సినిమా ఇండస్ట్రీలో నందమూరి తారక రామారావు గారిని భోళా శంకరుడు అని పిలుస్తూ ఉండేవారు. ఎందుకంటే ఆయన ఎవరికైనా సరే ఈజీగా వరాలు ఇచ్చేస్తూ ఉంటాడని అందుకే అతన్ని అలా పిలుస్తూ ఉంటారని ఆయన గురించి చాలా గొప్పగా చెప్తూ ఉంటారు. ఆయన తలుచుకుంటే చిన్న హీరోలను సైతం పెద్ద హీరోగా మార్చే అంత కెపాసిటీ ఉన్న వ్యక్తి అని అప్పట్లో ఎన్టీఆర్ గురించి చాలా గొప్పగా చెప్పేవారు. అందుకే ఆయన నీడలో చాలా మంది హీరోలు సూపర్ స్టార్లు ఎదిగారు.
ఇక ఆయన నట వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన బాలయ్య బాబు సైతం స్టార్ హీరోగా మారడంలో ఎన్టీఆర్ కీలక పాత్ర వహించాడు. ఇక ఇదిలా ఉంటే బాలయ్య బాబు ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎదిగిన తర్వాత వరుసగా బ్లాక్ బాస్టర్ హిట్స్ ని కొడుతూ నెంబర్ వన్ హీరోగా ఎదుగుతాడని అందరూ అనుకున్నారు. కానీ మధ్యలో కొన్ని ఫ్లాప్ సినిమాల వల్ల ఆయన కెరియర్ అనేది డైలమాలో పడింది. దాని వల్లే ఆయన నెంబర్ వన్ హీరోగా ఎదగలేకపోయాడు అనేది అందరికీ తెలిసిన విషయమే. ఇక బాలయ్య బాబు చేసిన ‘ కృష్ణ బాబు’ సినిమా విషయంలో డైరెక్టర్ అయిన ముత్యాల సుబ్బయ్య తో బాలయ్య బాబు గొడవపడ్డాడనే విషయం చాలా మందికి తెలియదు.
అయితే ఈ సినిమాతో సూపర్ డూపర్ సక్సెస్ ని అందిస్తానని ముత్యాల సుబ్బయ్య బాలయ్య బాబుకి మాటిచ్చాడు. స్క్రిప్ట్ లో కొన్ని మార్పులు చేర్పులు చేయమని బాలయ్య బాబు అడిగినప్పుడు మార్పులు చేర్పులు ఏమీ అవసరం లేదు ఈ సినిమాతో మనం బ్లాక్ బస్టర్ హిట్టు కొడుతున్నామని ముత్యాల సుబ్బయ్య కాన్ఫిడెంట్ గా చెప్పాడు. అయినా కూడా బాలయ్య కు ఈ సినిమా మీద నమ్మకం అయితే లేకుండా పోయింది. దాంతో డైరెక్టర్ ను నమ్మి ముందుకు వెళ్లిన బాలయ్య ఈ సినిమాతో భారీ డిజాస్టర్ ని చవి చూడాల్సి వచ్చింది.
ఇక దాంతో బాలయ్య ఒకసారి గా ముత్యాల సుబ్బయ్య పైన విరుచుకుపడి ఆయనతో గొడవ పడినట్టుగా అప్పట్లో చాలా వార్తలు వచ్చాయి. ఇక ఆ తర్వాత వీళ్ళ కాంబినేషన్ లో మరో సినిమా రాలేదు. ఒకవేళ బాలయ్య బాబు చెప్పినట్టుగా కొన్ని మార్పులు చేర్పులు చేసినట్లయితే సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యేదని అప్పుడున్న ఆ సినిమా యూనిట్ కూడా అభిప్రాయపడ్డారు.